Showing posts with label నేర్చుకోండి నాతో. Show all posts
Showing posts with label నేర్చుకోండి నాతో. Show all posts

Monday, 3 August 2015

శుభలేఖలతో బుక్ మార్క్ ...1

మనని పెళ్లి కని పిలుస్తో ఎన్నో శుభలేఖలు  వస్తాయి. అలాగే ఇతర శుభకార్యాలకి కూడా ఈ మధ్యన పత్రికలు చాలా  గ్రాండ్ గా అచ్చు వేయించి ఇస్తున్నారు. ఇవి చాలా పోగవుతాయి. 

వీటిని ఉప గించి నేను కొన్ని బుక్ మార్క్స్ తయారు చేశాను. ఇదిగో అందులో ఒకటి ఇక్కడ మీకోసం. 

ఇది శుభలేఖ పైన కవరు. ఇందులో నేను పైన భాగం ( మూత  లాగా ఉన్నది) కత్తిరించి క్రిందిది మాత్రం తీసుకున్నాను. 
ఇదిగో ఇలా దానికి ముందు భాగం గోల్డ్ ప్రింట్ ఉన్నది. వెనక సాదాగా ఉన్నది. మడత కూడా ఉన్నది (కవరు కదా). ఈ రెండు బాగాలను అలాగే లోపలిభాగం అతికించాను. బాగా ఆరిన తరువాత పంచర్ తో చిల్లు పొడిచి ఒక చక్కని త్రాడు ఎక్కించి చివరన జారి పోకుండా ముడి వేశాను. 
ఇదిగో బుక్ మార్క్ రెడి. ఇప్పుడు మీరు దీనిని పుస్తకం లో చదివే పేజీని గుర్తు పెట్టుకోవటానికి వాడ వచ్చు.  ఎవరికైనా గిఫ్ట్ చేయచ్చు, పిల్లలు కూడా దీనిని చాలా సులభంగా చేసేస్తారు. 
మరి ఆలస్యం దేనికి? మీరు చేసి చూడండి. 
మరి కొన్ని వచ్చే టపాలలో . ..... 


మీ...అనామిక....

Saturday, 15 June 2013

డిజైనర్ కోస్టర్ -4

ఈ సారి కూడా కుందన్ సీతాకోక చిలుకలు, కుందన్ లతో అలంకరణ 


ఇలా ఎన్నో అలంకరణలు మనకు నచ్చినవి చెసుకొవచ్చును. ... మరి కొన్ని వచ్చే టపాలలో ...... 

మీ...అనామిక....

Monday, 3 June 2013

డిజైనర్ కోస్టర్- 3


 ఈ కోస్టర్, కప్ కవర్ కుందన్ సీతకోకచిలుకలతో అలంకరించాను. 

బాగున్నాయి కదు. చాలా సులభంగా చేయవచ్చును. ప్లాస్టిక్ కోస్టర్ పైన కూడా ఈ అలంకరణలు చేసుకొవచ్చును. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వటానికి కూడా బాగుంటాయి. 

మరి కొన్ని వచ్చే టపాలలో ..... 

మీ...అనామిక....

Sunday, 2 June 2013

డిజైనర్ కోస్టర్ -2

ఇదిగో ఇంకొక ఐడియా ... కోస్టర్ మరియు మూత సెట్ 

ఇంకొన్ని వచ్చే టపాలలో .... 

మీ...అనామిక....

Saturday, 1 June 2013

డిజైనర్ కోస్టర్ - 1


కోస్టర్  (coaster) అంటే గ్లాసులు కాని కప్పుల కింద గాని పెట్టు కునేవి. వీటి వల్ల  టేబులు పై మరకలు పడవు.  గ్లాసుల/కప్పుల పైన పెట్టే  మూతలను గ్లాస్/కప్ కవర్స్ అంటారు. ఇవి రెండూ గుండ్రంగా కాని చదరంగా కాని  ఉంటాయి. రక రకాల డిజైన్ల లో దొరుకుతాయి. 

నేను చాలా రోజుల క్రితం కొన్ని కోస్టర్స్ గుండ్రనివి సాఫ్ట్ చెక్క తో చేసినవి కొన్నాను. వాటిని ఎలా అలంకరించాలా అని ఆలోచిస్తే కొన్ని ఐడియాలు  మదిలో మెదిలాయి. అందులోంచి ఒకటి ఇదిగో ఇలా ... 

ఇది కోస్టర్ కోసం 
ఇది మూత. ఆల్చిప్పలు మంచి జిగురు పెట్టి అంటిస్తే ఊడిపోకుండా ఉంటాయి. 

బాగున్నాయా?

మరి కొన్ని వచ్చే టపాలలో .... 

మీ...అనామిక....

Tuesday, 5 February 2013

వ్యర్ధాలతో...1

మనం ఎన్నో వస్తువులు పనికి రావని, చెత్త అని పడేస్తాం. కాని వాటిని ఉపయోగించి  కళాకృతులు కాని లేదా పనికొచ్చే వస్తువులు  కాని తయారు చేయోచ్చును. 

అలాంటిదే ఇది - గడియారం. 
ఇందులో వాడినవి- 
  • గడియారం కిట్టు - మార్కెట్ లో దొరుకుతుంది, 
  • గణేష్ బొమ్మ ఉన్న పెళ్లి పత్రిక దళసరిగా ఉంటుంది కనుక మొత్తంగా అలాగే వాడేం 
  • దాని పైన పాత కాలెండర్ నుండి కత్తిరించి, నంబర్లు అంటిచాం 
  • దాని పైన ముందు వైపు దుమ్ము నుండి రక్షణ కొరకు ప్లాస్టిక్ షీట్ వాడేం
  • వెనుక థర్మొకొల్ ముక్కలను వాడేం. దీనిపైన పెళ్లి పత్రిక అంటిచాం ఇది గడియారానికి ధృడత్వం ఇవ్వటమే కాక స్టాండ్ లాగా  కూడా పని చేస్తుంది.
ఈ గడియారాన్ని టేబుల్ పైన పెట్టుకోవచ్చును లేదా గోడకు తగిలించుకోవచ్చును. ఇప్పటికి 2-3 ఏళ్ల నుంచి బాగానే పనిచేస్తోంది.

పెళ్లి పత్రికలను, చించ లేము. పారేయను లేము. అందుకని ఇలా వాడితే బాగుంటుందని అనిపించింది. ఈ ఐడియా నాది. గడియారం మాత్రం మా తమ్ముడు తయారు చేశాడు. నాకు అంత ఇంజినీరింగ్ తెలియదు. 


మరి నా ఈ ఐడియా మీకు నచ్చిందా? ....
మీ...అనామిక....

Saturday, 10 November 2012

డిజైనర్ దీపాలు


దీపావళి అంటే దీపాల పండగ. ఎన్ని దీపాలు పెడితే అంత వెలుగు, అంత ఆనందం. అయితే విధ్యుత్ దిపాలకంటే, వెండి ఇత్తడి కుందులు కాని లేదా మట్టి దీపాలు కాని బాగుంటాయి. అవి కూడా కొంచెం శ్రద్ధ తీసుకుని అందంగా అలంకరిస్తే ఇంకా బాగుంటాయి కదూ ?

కుందన్ తో అలంకరించిన ఈ థాలి చూడండి ....

నీలం  రంగు ప్లేటు  (ఇలా వివిధ రంగులలో వివిధ ఆకారాలలో బజారులో దొరుకుతాయి)  కుందన్లతో అలంకరించి మధ్యన ఇత్తడి కుంది ఉంచాను.


నేను మాములు జిగురుతో అంటించాను. తరువాత నీళ్ళతో కడిగి ప్లేటు, కుందన్లు మళ్లి  వేరే వాడుకోవచ్చు. అలాగే ఉండాలంటే ఫెవికాల్ లాంటి జిగురు వాడి అతికించుకోవాలి. 

ఇది దీపావళికే కాక మన ఇంట్లో పార్టీలకి ఇతర పడంగలకి కూడా వాడుకోవచ్చు. 

బాగుంది కాదు..ఇదే మనం కొంటే ఎంత ఖరీదో కదూ ...ఇంకా కొన్ని వచ్చే టపాలలో.


మీ...అనామిక....

Friday, 6 July 2012

కూరలు పళ్ళతో అలంకరణ




ఇవి కూరగాయల తో చేసినవి. బీర చెక్కు, దోస చెక్కు, క్యారట్, దొండ స్లాయస్, క్యారట్ ముచికలు వాడాను. హార్ట్ ఆకారంలో ఉన్న ఎర్రని ప్లేటు.

ఇంకా బాగా చేయవచ్చు. కాని ఈ లోపల మా అమ్మ కేక వినిపించింది.."అలా బొమ్మలు బోర్సులు చేసుకుంటూ ఉంటే వంట ఎప్పుడు అవ్వాలి, భోజనం ఎప్పుడు చేయాలి.. అవతల అందరు ఆకలో అని గోల చేస్తున్నారు" అని.. అంతే!  మరి నా సృజనకు బ్రేకు వేసి వంటలో పడ్డా. మళ్లి వీలు చూసుకుని తీరికగా ఇంకా ఏమైనా చేయగలనా అని చూడాలి.


మీ...అనామిక....

Saturday, 9 June 2012

పుష్పాలంకరణ


మన ఇల్లు అందంగా ఉండాలని ఎంతో శ్రమ పడతాం. బోలెడంత డబ్బులు పోసి ఎన్నో కొంటాం. అయినా అతిథులు  వస్తున్నారంటే మళ్లి  ఇంకేదైనా కొందామా,  ఏదైనా కొత్తగా అలంకరణ చేద్దామా అని ఆలోచిస్తాం.

చాల మందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే ఖరీదైన బొమ్మలు, అలంకరణ వస్తువులు వల్లనే ఇంటికి అందం వస్తుంది అని. ఇరుగు పొరుగు వాళ్ళు మన చుట్టాలను చూసి వాళ్ళు ఎంత డబ్బు పెట్టి ఖరీదైనవి కొన్నారు, అందుకే వాళ్ళ ఇళ్ళు అంత అందంగా ఉన్నాయి అని అనుకుంటాం. కాని ఎంత ఖరిదైనది  అయినా చూడగా చూడగా బోరు కొడుతుంది. అలా అని వాటిని పారవేయలేము.

కాని మన ఇంటిని చిన్న చిన్న వాటితోనే అతి తక్కువ ఖర్చుతో అంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చును. ముఖ్యంగా ప్రతిసారి కొత్తగా అలంకరణ చేసుకోవచ్చును.

ఇది చూడండి :

ఒక టెర్రకోట పాత్ర (లోతు తక్కువగా ఉన్నది) తీసుకుని, చల్లటి నీళ్ళతో నింపండి. అందులో మీకు నచ్చిన పుష్పాలతో అలంకరణ చేయండి. గులాబీలు, బంతులు, చేమంతులు, మందారం.....ఇలా చాల పువ్వులు ఉంటాయి. సువాసన  కలిగినవి అయితే మరీ  మంచిది. లేదా ఒకటి రెండు చుక్కలు ఏదైనా స్సెంట్ ఆ నీళ్ళల్లో వేయండి. ఇవి  కనీసం 3-4 గంటలు  వాడకుండా ఉంటాయి. 

ఈ అలంకరణ ఈశాన్యం మూలలో కాని  లేదా ఇంటి ముంగిట్లో కాని, హాలు మధ్యలో కాని పెట్టు కావచ్చును. తోటలోను పెట్టుకోవచ్చు. ఎత్తుగా టాబులు మీద పెట్టుకోవచ్చు. పాత్రలు, పెద్దవి, చిన్నవి, అనేకమైన ఆకారాలలో  దొరుకుతాయి.  టెర్రకోట, ఇత్తడి, రాగి, రాతి, ప్లాస్టిక్ పాత్రలను వాడుకోవచ్చు.

పైన చూపించిన అలంకరణలో వాడినవి, మిరపకాయ మందార, రెక్క మందార (ఎర్రనివి), గ్రామఫోను గొట్టం పువ్వులు(నీలం), బిళ్ళ గన్నేరు (తెల్లవి), డేయిజి పువ్వులు చిన్నవి(పసుపు రంగువి). ఇవి కాక పసుపు రంగువి పెద్ద పువ్వులు, తెల్లనివి పెద్ద పూవులు, వాటి పేరు నాకు తెలియదు.

మరికొన్ని తరువాతి టపాలలో..


మీ...అనామిక....

Sunday, 8 April 2012

బొప్పాయి పండుతో బోటు

ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా ఉండాలను కుంటాము. కొత్తగా ఉంటే సరదాగా ఉంటుంది. అందుకేగా అన్నారు కొత్త ఒక వింత పాత ఒక రోత అని.

మనం ఇంట్లో పార్టీ చేసుకున్నప్పుడు కానీ డిన్నర్లకి ఎవరి నైనా పిలిచినప్పుడు కాని ఇల్లు ఎలాగో అలంకరిస్తాం. టేబులు,  పదార్ధాలూ కూడా అందంగా చూడ చక్కగా ఉంటే బాగుంటుంది కాదు. 

పదార్ధాలు చక్కగా రుచిగా వండడమే కాదు వాటిని వడ్డించటం కూడా ఒక కళ. 

బొప్పాయి పండు తో బోటు చేసి చూడండి:
  • ఒక బొప్పాయి పండు కొద్దిగా కోలగా కానీ పొడువుగా కాని ఉన్నది తీసుకోండి 
  • దాన్నిని నిలువునా సరిగ్గా మధ్యకు రెండుగా కోయండి
  • లోపలి గింజలను తీసివేయండి
  • ఒక భాగం చెక్కు తీసి ముక్కలు చేసి పెట్టుకోండి లేదా స్కూపర్ (చిన్న గరిటె)  ఉంటే గుండ్రంగా బంతుల లాగా చేసి పెట్టుకోండి 
  • రెండోవ భాగం సర్వ్ చేసే పళ్ళెం ఏదైనా అందంగా కాంట్రాస్ట్ రంగులో కానీ లేదా గాజుది తీసుకుని అందులో ఈ ముక్క కదలకుండా నిలబడుతుందా లేదా చూసుకోండి. 
  • లేదంటే క్రింది భాగం చదునుగా ఉండేందుకు కొద్దిగా  చెక్కి  ముక్కను తీసి వేయండి. మీ బోట్ తయారు అయినట్లే 
  • ఇప్పుడు మీరు ఈ బోటుని, ముక్కలను ఫ్రిజ్జిలో ఉంచి సర్వ్ చేసే టప్పుడు బోటులో ముక్కలను నింపి పళ్ళెం లో పెట్టి టేబుల్ పై అమర్చండి.
  • కేవలం బొప్పాయి ముక్కలే కాక ఇతర పళ్ళ ముక్కలను కానీ, ఫ్రూట్ సలాడ్ ను కానీ నింపి అమర్చ వచ్చు. 

ఖర్చు లేదు ఎక్కువ శ్రమా లేదు కదూ...



మీ...అనామిక....

Sunday, 6 November 2011

ఉల్లి కాడల తో పువ్వులు

ఉల్లికాడలతో పువ్వులు చేయటం చాల తేలిక. ఎలాగో చూద్దామా?

కావలసినవి:

ఉల్లికాడలు
పదునైన కత్తి
కొబ్బరి చీపురు పుల్లలు లేదా వెదురు పుల్లలు



ముందుగా:

ఉల్లికాడలు తాజాగా ఉన్నవి ఎంచుకోండి. వాటికీ ఉన్న ఉల్లి పాయలు మరి పెద్దవి(లావుగా) లేదా మరి చిన్నవి(సన్నగా) కాకుండా ఉండాలి. అవి చక్కగా ఉండాలి, ఎటువంటి గాట్లు లేదా దెబ్బ తగిలినవి కాకూడదు. వాటి పైన ఉన్న ఆకులూ(కాడలు) తాజాగా ఉండాలి. మనం వాటిని  కొన్న తర్వాత మడిచి కూరల సంచిలో పెట్టుకుంటాం. అలా మడవకుండా ఉండాలి. మడిస్తే ఆకులు నలిగి పోయి, తెగిపోయి మనకి కావలిసిన రీతిలో ఉండవు. 

ఉల్లి కాడలను నీళ్ళలో ముంచి మట్టి పోయేట్లుగా కడగాలి. కడిగేటప్పుడు ఆకులు నలిగి పోకుండా, చిరిగి పోకుండా జాగ్రత్తగా, నెమ్మదిగా కడగాలి. తరువాత ఆ నిరు పూర్తిగా పోయేదాకా ఒక పలుచటి బట్ట మీద ఆరనివ్వండి. 

కత్తి చిన్నదిగా ఉండి, చివర కోన దేలి ఉండి బాగా పదునుగా ఉండాలి. పిడి మన చేతిలో  సరిపోయేంతగా ఉంటే బాగుంటుంది. లేదా మనం రోజు వాడె కూరలు తరిగే కత్తి అయిన సరే. చివర మాత్రం మొనదేలి కోసుగా ఉంటేనే మంచిది.


కొబ్బరి చీపురు పుల్లలు, బలంగా ఉండి ఒక వైపు కోన దేలి ఉన్నవి  ఎంచుకోవాలి. ఇవి బలంగా ఉండి కావలిసిన పొడవు ఉన్నవి తీసుకోండి. వెదురు పుల్లలు అయితే ఇంకా బాగుంటుంది. ఇవి కూడా సన్నగా ఉండి చివర సూది లాగా ఉండాలి. Bamboo skewers అని దొరకుతాయి- అంటే కబాబ్ చేయటానికి వాడేవి. లేదా పుల్లలను ఒక వైపు మనమే కత్తితో చెక్కి సుదిలగా చేసుకోవచ్చు. 

చేసే పధ్ధతి :
  • ఉల్లిపాయలను కాడల నుండి కత్తిరించి వేరు చేయండి. ఇలా చేసేటప్పుడు, పాయలు కనీసం 5 -7 cms ఉండాలి. అలాగే ఆకులు(పోరకలు) విడి పడకుండా గుత్తిగా ఉంటే బాగుంటుంది. ఒక వేళ విడి పడితే కంగారేమీ లేదు. వాటిని టూత్ పిక్స్ పెట్టి కలిపి పెట్టవచ్చు.
  • ముందుగా ఒక ఉల్లిపాయ వేళ్ళని కత్తిరించి (పలుచని slice చేసి) తీసివేయండి.కానీ జాగ్రత్త సుమా ఎక్కువ కత్తిరిస్తే పాయ పొరలుపొరలుగా విడి పోతుంది. 
  • పైన ఎండిపోయిన పొట్టు ఉంటే తీసి వేయండి.
  • ఇప్పుడు అ భాగం మీ నుండి బైట వైపుకి పట్టుకుని, అటు  నుండి   1cm వడిలి క్రింది వరకు  కత్తితో పొడుగ్గా చిల్చండి.
  • ఈ చీలిక, పాయ మధ్య వరకు ఉండాలి సుమా. 
  • పాయను తిప్పుతో దగెరగా చిలుస్తూ మొత్తం పాయ అంత చిల్చండి.
  • ఈ చిలికలను వేళ్ళతో నెమ్మదిగా కొద్దిగా వేరు చేయండి.
  • ఇలా మీకు  కావలసినన్ని పాయలు చేసుకోండి.
  • వీటిని ఒక పాత్రలో చల్లటి (ఐస్ కోల్డ్) నీళ్ళలో ముంచి 15-20  నిం. పాటు ఫ్రిజ్జి లో ఉండనివ్వండి. డీప్ ఫ్రిజ్జిలో పెట్టవద్దు. 
  • పాయలు ఇలా  పువ్వుల లాగా విచ్చుకుంటాయి. వాటిని నీళ్ళ నుండి  తీసేసి నిరు పూర్తిగా కారిపోయేంత వరకు ఒక పలుచటి బట్ట మిద పెట్టి ఉంచండి.
  • ఈ లోపల పుల్లలను (సూది లాగా ఉన్న భాగం) ఉల్లి కాడలు(పోరకలు) లోంచి ఒక దానిలోనికి నెమ్మదిగా అడుగు నుండి లోపలికి దూర్చండి. కాడలు గుత్తిగా ఉంటె మధ్యగా ఉన్న కాడలోంచి లేదా విడి పడిపోతే కావలసినంత పొడవు ఉన్న కాడను  ఉపయోగించండి.  ఇలా చేసేటప్పుడు ఆ కాడ చిలిపోకుండా చూసుకోండి.
  • ఇప్పుడు  ఈ కాడ పై భాగాన ఒక ఉల్లి పువ్వుని గుచ్చండి. 
  • ఇలా మీకు కావలసినన్ని తయారు చేసుకోండి. 
  • వీటిని ఒక గ్లాసులో కాని వాజులో కాని అమర్చుకోండి. వీటికి ఇంకొన్ని ఉల్లి కాడలను ఆకుల లాగా అమర్చుకోవచ్చు. 
పార్టిలకి డిన్నర్లకి ఈ అలంకరణ డైనింగ్ టేబుల్ పై అమరిస్తే చాల బాగుంటుంది. మీరూ చేసి చూడండి.


మీ...అనామిక....

Wednesday, 2 November 2011

క్విల్లింగ్-2

క్విల్లింగ్  కి కావలసిన సామగ్రి:  

కాగితం:  క్విల్లింగ్ కోసం ప్రత్యేకంగా పేపర్ స్ట్రిప్స్ దొరకుతాయి. ఇవి వాడటం చాల సులభం. వీటిలో  ఎన్నో రంగులు. 
  • Solid Colours: మొత్తం స్ట్రిప్ ఒక రంగు ఉంటుంది
  • Two Toned: ఒక వైపు ముదురు రంగు రెండో వైపు లేత రంగు.
  • Graduated: ముదురు రంగు నుండి లేత రంగు కి లేదా తెలుపు
  • మెటాలిక్: బంగారం వెండి రాగి వంటి రంగులు
  • జువేల్డ్ : నవరత్నాల రంగుల్లో 
ఇలా చాలా రంగులు ఉంటాయి. ఇవి ఒక పాకెట్ లో ఓకే రంగు కానీ లేదా చాలా రంగులు (assorted) కానీ  ఉండవచ్చు ముదురు రంగులు, లేత రంగులు, ఒకే రంగులో వివిధ షేడ్స్ ఇలా అమ్ముతారు. దాదాపు 250 రంగులు ఉన్నాయి  అని  వినికిడి. 

ఈ స్ట్రిప్స్ యొక్క పరిమాణం 2mm, 3mm, 5mm, 8mm ఇంకా 10mm .


ఈ కాగితపు  స్ట్రిప్స్ తోనే రకరకాలైన ఆకారాలు చేస్తాం. 
Single colour packs
Assorted Colours
Assorted Colours-10mm
Graduated Coloured paper
Gold Colour
Quilling Tools


క్విల్లింగ్ టూల్ : ఇందులో రెండు రకాలు. ఒకటి సూది లాగా ఉంటుంది. రెండవది కూడా సూదిలాగా  ఉంటుంది కానీ,  సూది ఫై భాగాన ఒక చీలిక ఉంటుంది. ఈ చీలిక లోంచి కాగితాన్ని దూర్చి పెట్టడం వల్ల జారిపోకుండా ఉంటుంది. రెండు రకాల టూల్స్ కి పట్టుకోవడానికి అనువుగా పిడి ఉంటుంది.


ఈ టూల్స్ లేకపోయినా టూత్ పిక్ కాని, పొడవైన సూదులు కాని లేదా సన్నగా ఉన్న పుల్లను కాని ఉపయోగించవచ్చు.


క్విల్లింగ్ సర్కిల్  టెంప్లేట్  బోర్డ్ : ఇది రకరకాలైన పరిమాణాలలో కాగితపు చుట్టలను తయారు చేయటానికి ఉపయోగ పడుతుంది. ఇది లేక పోయినా మనం ఒక తెర్మోకోల్ షీట్ (1ftX1ft) పైన వివిధ పరిమాణాలలో వృత్తాలను  గీసుకుని వాడుకోవచ్చు.


క్విల్లింగ్ కోమ్బ్: ఇది కొన్ని రకాల ఆకారాలు తయారు చేయటానికి ఉపయోగ పడుతుంది. కాని దీని బదులు మామూలు దువ్వెన కానీ గుండు సూదులు(పెద్దవి) వాడుకోవచ్చును.


సూదులు: పొడవాటి గుండు సూదులు. వీటికి  పైన పూసలు కూడా ఉన్నవి ఉంటాయి. ఇవి కాగితపు చుట్టలను కదలకుండా పట్టి ఉంచడానికి ఉపయోగపడతాయి. 


కత్తెర: చిన్నది, పదునైనది లేదా కాగితాలు కత్తిరించేందుకు మీరు తరుచు వాడే  కత్తెర.


ట్విజర్స్ : సన్నని కొసలు ఉన్న పటకారు. ఇది కాగితపు చుట్టలను వివిధ ఆకారాలలో మలిచే టప్పుడు ఉపయోగ పడుతుంది. 


కొలబద్ద:స్కేల్ చిన్నది లేదా కొలుచుకునే టేప్, కాగితపు స్ట్రిప్స్ ని కావలసిన పరిమాణాలలో కోలుచుకోవటానికి పనికి వస్తుంది. 


బంక: రంగు లేని బంక(Gum) అయితే  బాగుంటుంది, తొందరగా అతికే బంక అయితే మరీ మంచిది. 


మరి వచ్చే టపాలలో మరీ కొన్ని విషయాలు తెలుసుకుందాం....చూస్తూ ఉండండి నా బ్లాగ్ .....
మీ...అనామిక....

Saturday, 29 October 2011

కూరలు-పళ్ళతో బొమ్మలు

నేర్చుకోండి నాతొ ...

కూరగాయలు, పళ్ళతో చేసే బొమ్మలను వెజిటేబుల్ - ఫ్రూట్  కార్వింగ్ అంటారు. తినే పదార్థాన్ని రుచిగా వండటమే కాదు దానిని చూడ చక్కని రీతిలో నోరూరించే లాగా అలంకరిస్తే ఇంకా బాగుంటుంది. ఇవి తినము అవి తినము అని మారం చేసే పిల్లలను గొడవ చేయకుండా తినిపించాలన్న ఇది ఒక చక్కని మార్గం.

ఈ కళ థాయిలాండ్ లో పుట్టిందని, కాదు చైనాలో అని కాదు జపాన్ అని ఇలా చాల వాదనలు ఉన్నాయి. ఎక్కడ పుట్టిందని చెప్పటం కష్టం. కానీ ఈ దేశాలలోనే కాక ఇప్పుడు అనేక దేశాలకు కూడా ఈ కళ విస్తరించింది. 

పెళ్ళిళ్ళలో, పార్టీలలో ఇప్పుడు ఇలాంటి చాలా కళాఖండాలు మనకి కనిపిస్తాయి.

ఇవి చూడండి ఈ కళని సాధన చేసేవారు ఎంత అద్భుతమైన కళ ఖండాలను సృష్టిస్తున్నారో..
వంకాయలతో పెంగ్విన్ 
పళ్ళు కూరగాయల తో 
కాప్సికం తో కప్పలు 
 పళ్ళతో 
 కూరలతో 
 కాలిఫ్లవర్ తో 
 టొమాటో కమలాల తో 

నాకు ఈ కళ లో కొంత ప్రవేశం ఉంది. నాతో నేర్చుకోండి ఈ కళని.  వచ్చే   టపాలనుండి .....


మీ...అనామిక....