Showing posts with label ఎంబ్రాయిడరి కుట్లు. Show all posts
Showing posts with label ఎంబ్రాయిడరి కుట్లు. Show all posts

Thursday, 16 July 2015

కుట్లు-అల్లికలు

సఖులందరికి ఒక మనవి:
కుట్లు-అల్లికలు  శీర్షిక లో 31 రకాల కుట్లు నేర్చుకున్నాం. అవి ;
1. Running Stitch - టాకా  కుట్టు -8 రకాలు 
2. Back Stitch -  వెనుక కుట్టు - 6 రకాలు
3. Stem Stitch  - కాడ కుట్టు -6 రకాలు 
4. Chain Stitch  - గొలుసు కుట్టు - 11 రకాలు 





మీకు ఈ శీర్షిక  ఎంతవరకు నచ్చిందో లేదా ఉపయోగ పడిందో నాకు తెలియలేదు. ఇంకా ఎన్నో ఉన్నాయి నేర్చుకోవటానికి. 

కొత్తవి నేర్చు కోవాలని ఉంటే,  ఈ బ్లాగ్ లో మీ కామెంట్ ఈ టపా క్రింద వ్రాయండి. లేదా ఈ-మెయిల్ చేయండి. మీ స్పందనని బట్టి నేను కొత్త కుట్లు నేర్పుతాను. 



మీ...అనామిక....

Sunday, 12 July 2015

కుట్లు-అల్లికలు - మనవి

సఖులందరికి ఒక మనవి:
కుట్లు-అల్లికలు  శీర్షిక లో 31 రకాల కుట్లు నేర్చుకున్నాం. అవి ;
1. Running Stitch - టాకా  కుట్టు -8 రకాలు 
2. Back Stitch -  వెనుక కుట్టు - 6 రకాలు
3. Stem Stitch  - కాడ కుట్టు -6 రకాలు 
4. Chain Stitch  - గొలుసు కుట్టు - 11 రకాలు 




మీకు ఈ శీర్షిక  ఎంతవరకు నచ్చిందో లేదా ఉపయోగ పడిందో నాకు తెలియలేదు. ఇంకా ఎన్నో ఉన్నాయి నేర్చుకోవటానికి. 

కొత్తవి నేర్చు కోవాలని ఉంటే,  
  1. నా బ్లాగ్ ను ఫాలో అవ్వండి. 
  2. నా ఈ బ్లాగ్ లో మీ కామెంట్ ఈ టపా క్రింద వ్రాయండి. మీ స్పందనని బట్టి నేను కొత్త కుట్లు నేర్పుతాను. 
మీ నుండి మంచి స్పందనని ఆశిస్తో


మీ...అనామిక....

Wednesday, 22 April 2015

ఎంబ్రాయిడరి కుట్లు -కావలసినవి-5

3-దారాలు-3

ఇంతకూ ముందు నేను ఈ విషయం పైన వ్రాసిన టపాలు ఇక్కడ చూడండి :

ఎంబ్రాయిడరి-కావలసినవి

దారాల లో ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. 
ఇవి జర్దోసి దారాలు, లావుగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి, సింగల్ మరియు కలనేత రంగులలో దొరుకుతాయి. చాలా  షేడ్స్ ఉన్నాయి. 
 
ఇవి రిమ్ ఝిమ్ దారాలు. బూజు బూజు గా ఉంటాయి. సింగల్, కలనేత రంగులలో దొరుకుతాయి. చాలా షేడ్స్ ఉన్నాయి. 

మనం కేవలం ఎంబ్రాయిడరీ దారాలే కాక ఇతర దారాలు, తాళ్ళు మొదలైనవి రక రకాలైన మందం లో దొరుకుతాయి. వీటిని వాడి ప్రయోగాలు చేయాలి. మనం కుట్టే డిజైన్, వాడే బేస్ ఫాబ్రిక్ (దేనిపై కుడుతున్నమో) వీటిని దృష్టి లో పెట్టుకుని దారాలను ఎంపిక చేసుకోవాలి. 

ఇక్కడ కొన్ని ఉదాహరణలు:
ఇవి టాటింగ్ కి వాడే దారాలు. ఇవి కూడా చాలా రంగులలో దొరుకుతాయి. వివిధ మందాల లో దొరుకుతాయి. అలాగే క్రోషియా దారాలను కూడా వాడ వచ్చు. 

ఈ క్రిందివి నిట్టింగ్ (అల్లిక) దారాలు కాటన్ వి. ఇవి ఊలు తో పాటు వేసి అల్లుతారు. వీటి లో కూడా చాలా రంగులు, మందాలు ఉంటాయి. 
వీటి తో కూడా ఎంబ్రాయిడరీ చెయవచ్చు. 

దారాలే కాక లేసులు, బటన్లు, పూసలు, అద్దాలు ఇంకా ఎన్నో వాటిని మనం ఎంబ్రాయిడరీ లో వాడవచ్చును.  అవి వచ్చే టపాల  లో చెప్పుకుందాం. 

మీ...అనామిక....

Friday, 26 July 2013

ఎంబ్రాయిడరి కుట్లు -కావలసినవి-4

3-దారాలు-2

ఇంతకూ ముందు మనం చెప్పుకున్నవి ఇక్కడ ఒకసారి చూడండి :


3. సిల్క్, జరి దారాలు -Silk, Metallic and Zari mixed Threads

పైవి సిల్క్ దారాలు-విచ్చెలు, చేతి తో కుట్టటానికి అనువుగా ఉంటాయి. మనకు కావలసినన్ని పోచలతో కుట్టు కోవచ్చును. రక రకాల రంగులలో దొరుకుతాయి. డబుల్ షేడ్స్ లో కూడా ఉంటాయి. 
ఇవి కూడా సిల్క్ దారాలే కాని మెషీన్ ఎంబ్రాయిడరి కోసం. ఇవి చాలా సన్నగా ఉంటాయి. వీటిల్లో కూడా సింగిల్, డబుల్ ఇంకా మల్టీ షేడ్స్ లో దొరుకుతున్నయి. 
ఇవి నీం జరి దారాలు. సిల్క్ పోచతో పాటు జరి దారం కూడా కలిసి  ఉంటుంది. ఇవి చేత్తో కుట్టటానికి  బాగుంటాయి. 

ఇవి మెటాలిక్ జారి దారాలు. మెషీన్ తో కుట్టటానికి 
ఇవి మెటాలిక్ దారాలు, కొద్దిగా మందంగా ఉండి, చేత్తో కుట్టటానికి అనువుగా ఉంటాయి. 

మరి కొన్ని వచ్చే టపాలలో చెప్పుకుందామా?...... 


మీ...అనామిక....

Sunday, 23 September 2012

గొలుసు కుట్టు -Chain Stitch-11

Braided Chain Stitch 

ముందుగా కావలసిన విధంగా గొలుసు కుట్టు కుట్టుకోవాలి. 
తరువాత వేరే రంగు(నారింజ రంగు) దారాన్ని( గొలుసు కుట్టు ప్రారంభించిన చోట ఇలా బట్ట పైకి తీసుకోవాలి. 
 
 రెండోవ గొలుసు లోకి దూర్చాలి. బట్టలోకి మాత్రం దూర్చ కూడదు. 
ఇప్పుడు మళ్ళి మొదటి గొలుసు లోంచి, ఇంతకు ముందు వేసిన లూప్ అడుగు నుండి తీయాలి.
 ఇలా కనిపించాలి.
 ఇలా అన్ని గోలుసులలోంచి దారాని లేసు లాగా అల్లాలి.
చివరికి వచ్చినప్పుడు పధ్ధతి ప్రకారం అయితే ఇక్కడ దారాన్ని(నారింజ రంగు) బట్టలోకి దించి వేయాలి. మళ్లి పై వైపు మొదటి(ముందుగ మనం మొదలు పెట్టినది) నుండి మొదలు పెట్టుకోవాలి.
కాని నేను ఇలా నారింజ రంగు దారాన్ని, నల్ల దారం గుండా దూర్చి (బట్టలోకి దూర్చ కుండా) కుట్టుని తలక్రిందలుగా (పై వైపు క్రిందికి వచ్చేటట్లుగా) పట్టుకుని మరల అటు నుండి లేసు అల్లి మొదటికి వచ్చాను. 
చివరన దారాన్ని బాట్ట అడుగుకి దింపి ముడి వేసుకోవాలి. 
ఇలా ఈ కుట్టు పూర్తీ అయినట్లే. కాని ఈ లేసు ఉతికేటప్పుడు లేదా ఇస్త్రి చేసే టప్పుడు చెదిరి పోకుండా ఉండాలంటే ఇలా క్రింద చూపిన విధంగా టాకాలు  వేస్తే అందంగా కూడా ఉంటుంది. టాకాలు సమంగా రావాలి.
లాసు అల్లేందుకు  జరి దారం వాడితే చాలా  బాగుంటుంది. 

ఇంకొన్ని తరువాతి టపాలలో....
మీ...అనామిక....

Thursday, 20 September 2012

గోలుసు కుట్టు- Chain Stitch-10


Checkered Chain Stitch or Magic Chain Stitch

ఈ కుట్టు పేరుకు  తగ్గట్లుగానే ఉంటుంది. అంతా గొలుసు కుట్టు లాగానే కుట్టాలి. కాని రెండు వేర్వేరు రంగు దారాలను ఒకే సుదిలోకి ఎక్కించు కోండి. నేను ముదురు-లేత గులాబీ రంగు దారాలను వాడాను.
ముందుగా సూది ని  బట్ట అడుగు నుండి పైకి తీసుకోండి.
మాములు గొలుసు కుట్టు లాగానే కుట్టండి. కాని దారాన్ని లూప్ (సూది చుట్టూ) వేసినప్పుడు ఒక రంగు దారాన్ని మాత్రమే వేయండి. సూదిని పైకి లాగండి. 
 ఒక గొలుసు ఇలా రావాలి.
ఇప్పుడు రెండో గొలుసు కుట్టేటప్పుడు రెండో రంగు దారాన్ని వాడండి. ఇలా మొత్తం కుట్టేటప్పుడు ఒకొక్క రంగు దారాన్ని ఒకొక్క గోలుసుకి ఒకదాని తరువాత ఒకటి వాడండి. 
కుట్టు చివరన మాములు గొలుసు కుట్టుకి మాదిరి దారాన్ని బాట పైనుండి అడుగుకి దించి, ముడి వేయండి.

ఇలా ఒక దాని తరువాత ఒకటి కాకుండా 2/3 ఒకే రంగు గొలుసులు కుట్టి తరువాత 2/3 వేరే రంగువి ఇలా రక రకాలుగా కుట్టుకోవచ్చును. 

దారం తక్కువ పోచలు వాడినా లేదా సన్ననిది అయితే రెండు కంటే ఎక్కువ రంగులు వాడవచ్చు. కాని కుట్టేటప్పుడు దారం చిక్కు పడకుండా జాగ్రత్త పడాలి. 

ఇది ఫిల్లింగ్ కుట్టు లాగా కాని లేదా అవుట్ లైన్ లాగా కాని లేదా బోర్డర్ లాగా కాని, వేరే కుట్లతో కలిపి కాని వాడుకోవచ్చును.

మీ...అనామిక....

Wednesday, 12 September 2012

గొలుసు కుట్టు -Chain Stitch-9

Long-Armed Detached Chain Stitch
ఇది Detached Chain Stitch లో ఒక రకం. ఇందులో గొలుసు కుట్టిన తరువాత దారం గోలుసుకి దెగ్గరగా కాకుండా మనకు కావలసినంత దూరం లో బట్ట క్రిందికి దించాలి. కాని మరి పొడువు ఉంటే, కుట్టు వదులుగా ఉండి సరిగ్గా నిలవదు. 

ఈ కుట్టు పూవులు, ఆకులు వంటివి కుట్టటానికి పనికి వస్తుంది. అలాగే వేరే కుట్లతో కలిపి కుట్టుకోవచ్చును. 

మీకు ఈ టపాలు నచ్చుతున్నాయని ఆశిస్తున్న. సుళువుగా అర్ధం అవుతున్నాయని అనుకుంటున్నా. 

ఇంకొన్ని గొలుసు కుట్టు రకాలు వచ్చే టపాలలో....
మీ...అనామిక....

Sunday, 9 September 2012

గొలుసు కుట్టు -Chain Stitch-8

Russian Chain Stitch

ఈ కుట్టులో ముడేసి విడి విడి గొలుసులు త్రిభుజాకారం లో కుడతారు. ఇవి వరుసగా ఒక దాని క్రింద ఒకటి కానీ, లేదా ఒక వరుసలో కాని కుడతారు.
ఈ కుట్టు బార్డర్ లాగా కుట్టటానికి కాని లేదా బూటిలుగా కుట్టటానికి ఉపయోగించవచ్చు.


మీ...అనామిక....

Saturday, 8 September 2012

గొలుసు కుట్టు -Chain Stitch-7

Slipped Detached Chain Stitch-Tulip Stitch

ఇది కూడా గొలుసు కుట్టు కుటుంబానికి చెందినదే. ఇది "ట్యులిప్ " పువ్వు లాగ ఉంటుందని ట్యులిప్ కుట్టు అని కుడా అంటారు.
  ముందుగా ఒక single chain stitch కుట్టుకోవాలి.
తరువాత A నుండి దారం బట్ట అడుగు నుండి పైకి తీయాలి.  పైన చూపిన విధంగా కుట్టులోనుండి దూర్చి, B దెగ్గర క్రిందికి దింపాలి. తరువాత C నుండి D కి అదే విధంగా కుట్టాలి. 2 లో చూపింది ట్యులిప్  కుట్టు. తరువాతివి ఆ కుట్టు లో రకాలు. 
ఈ కుట్టు పువ్వులాగా ఉంటుంది. బుటీలుగా లేదా ఇతర కూట్ల తో కలిపి కుట్టుకోవచ్చు. అవి తరువాత వివరంగా చెప్పుకుందాం.

గొలుసు కుట్టుకి చెందినవి ఇంకా అనేకం ఉన్నాయి. నా తరువాతి టపాలలో చూడండి 

మీ...అనామిక....

Thursday, 6 September 2012

గొలుసు కుట్టు - Chain Stitch-6

Single and Double Threaded Detached Chain Stitch
Detached or Lazy Daisy- అంటే విడిగా ఒక గొలుసు కుట్టు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఇది ఒక ఆకారాన్ని నింపటానికి (filling) కి కూడా వాడుకోవచ్చు. 

ఈ గొలుసులను పైన చూపిన విధంగా దారం ఒక వైపు నుండి రెండవ వైపు నాకు లేదా  మరల రెండవ వైపు నుండి మొదటికి లేస్ లాగ అల్లి కుట్టుకోవచ్చును. వీటికి గొలుసులను ఒక పద్ధతిగానే కాక విసిరివేసినట్లు కూడా కుట్టి లేస్ లాగా  అల్లుకోవచ్చు. ఇది కూడా ఫిల్లింగ్ కి వాడవచ్చు.


మీ...అనామిక....

Saturday, 1 September 2012

గొలుసు కుట్టు - Chain Stitch-5

Detached or Lazy Daisy or Single Chain Stitch

ఇది చాల ప్రాచుర్యం  పొందిన కుట్టు. గొలుసు కుట్టు కుటుంబానికి చెందినది. మన అందరికి సుపరిచితమే. పువ్వులు కుట్టాలనగానే  ఈ కుట్టు గుర్తుకు వస్తుంది. 
దారాన్నిబట్ట క్రింది నుండి పైకి తీసి ఒక గొలుసు కుట్టి మళ్లీ క్రిందికి దింపేయాలి. ఇలా డిజైన్ అంతా ఒకొక్క గొలుసు కుట్టు తోనే కుట్టాలి. అందుకే దీనికి-Detached Chain అని పేరు. ఈ కుట్టు డైజి (Daisy) పువ్వుల రెక్కల లాగా ఉంటుందని  Lazy Daisy అని కూడా అంటారు. Single Chain Stitch అని కూడా అంటారు.

ఇది ఎక్కువగా పువ్వులు కుట్టటానికి, ఆకులు కుట్టటానికి ఉపయోగ పడుతుంది. చాలా సుళువు.
ఇది చూడండి. ఆకులకి, పువ్వులకి ఈ కుట్టు వాడి కుట్టినది. దీనికి నేను రక రకాలైన దారాలు వాడాను. 

ఇంకొన్ని కుట్లు వచ్చే టపాలలో......

మీ...అనామిక....

Friday, 31 August 2012

గొలుసు కుట్టు-Chain Stitch-4

Zig Zag Chain Stitch

ఈ కుట్టు కి గొలుసులు పైన చూపిన విధంగా వాలుగా కుట్టు కోవాలి. వాలు ఎంత అన్నది మనం మార్చుకోవచ్చు. అంటే వాలును బట్టి "V" (గొలుసుల మధ్య దూరం)  ఎక్కువ తక్కువ ఉంటుంది. కుట్టు చక్కగా రావాలి అంటే రెండు సమాంతర రేఖలను గీసుకుని కుట్ట వచ్చు.

మొదట ఒక గొలుసు కుట్టి దాని (చివర/tip) నుండి రెండవ గొలుసు కుట్టాలి. ఇలా ప్రతి గొలుసు ముందు కుట్టిన గొలుసును pierce చేస్తూ (చిల్చుతో?) కుట్టాలి. లేదా గొలుసులు నిలబడవు. 

మరి కొన్ని కుట్లు తరువాతి టపాలలో.....

మీ...అనామిక....