Showing posts with label ఫాబ్రిక్ పెయింటింగ్. Show all posts
Showing posts with label ఫాబ్రిక్ పెయింటింగ్. Show all posts

Friday, 24 July 2015

టేబుల్ క్లాత్ పై ఫాబ్రిక్ పెయింటింగ్


టేబుల్ క్లాత్, కుషన్ కవర్స్ , దివాన్ సెట్- ఇలాంటి వాటిపైన అందంగా కనిపించడానికి  ఫాబ్రిక్ పెయింటింగ్ వెసుకొవచ్చు.  ఎంబ్రాయిడరీ కంటే తక్కువ సమయం పడుతుంది. మనకు వీలుగా చిన్న లేదా పెద్ద డిజైన్లు ఎంపిక చెసుకొవచ్చు.

ఇదిగో ఇది ఎప్పుడో చాలా కాలం కిందట నేను వేసిన డిజైన్.  టేబుల్ క్లాత్ పైన వేసాను. దివాన్ సెట్, కుషన్ కవర్స్, టేబుల్ క్లాత్- వీటన్నిటి పైన సముద్రంలోని అండర్ వాటర్ సీన్. అందుకే సీ  గ్రీన్ కలర్ క్లాత్ ఎంచుకున్నాను. అది కాటన్ కేసమేంట్ క్లాత్. చాలా మందంగా ఉండటం వలన పెయింట్ వేయటానికి చాలా ఇబ్బంది పడ్డా. కాని చాలా ఏళ్ళు మన్నింది. ఎన్నో సార్లు ఉతికినా చెక్కు చెదరలేదు. కాని కొంత రంగు తగ్గింది. క్లాత్ కూడా వెలిసిపోయింది.



 ఇది గోల్డ్ ఫిష్

ఇలా నాలుగు చివర్లలో చేపలను వేసి, మధ్యలో గోల్డ్ ఫిష్ వేసాను. 

చాలా పాతది కాబ్బట్టి పెయింటింగ్ కొంత రంగు తగ్గింది. క్లాత్ కూడా వెలిసింది. కాబ్బట్టి కొత్తల్లో ఉన్నంత బ్రైట్ గా లేదు. 

మీరు వేసి చూడండి. వేసినవి ఉంటే  మీరు మన సఖులందరితో  పంచుకోండి. సఖులందరమూ ఎంతో  కొంత ప్రేరణ పొందుతాము. 


మీ...అనామిక....

Sunday, 20 January 2013

చీరెల పై ఫాబ్రిక్ పెయింటింగ్-2

ఇదిగో ఇంకొక చీర - చీరె  పై ఫాబ్రిక్ పెయింటింగ్ చాల అందంగా ఉంది.
బెంగాలీ కాటన్ చిర. అత్తా కోడలి అంచు. మధ్యన లేత బూడిద రంగు + లేత ఆకుపచ్చ కలనేత. అంచు పైన ఉన్న డిజైన్ చూడండి.
చిరె  అంతా  ఈ డిజైన్ ఉంది.
కాని పమిట పైన వినాయకుడి బొమ్మ చాలా బాగుంది. చూడగానే కొనాలనిపించి కొనేశా. కాని తీరా కొన్నాక ఇలా దేవుడి బొమ్మలున్న చీర  మనం ధరించ వచ్చునా అని సందేహం.

మీ...అనామిక....

Saturday, 5 January 2013

చున్నీ పై ఫాబ్రిక్ పెయింటింగ్

ఇది చాల సంవత్సరాల క్రితం ఒక చున్నీ  పై నేను చేసిన చిత్రలేఖనం. ఫాబ్రిక్ పెయింట్ తో చేసినది.


మీ...అనామిక....

Tuesday, 1 January 2013

చీరెల పై ఫాబ్రిక్ పెయింటింగ్ -1

చీరెల  పై ఫాబ్రిక్ పెయింటింగ్  ఎప్పుడూ  ఫ్యాషనే. ఇదిగో ఇది చూడండి :

ఇది బెంగాలీ నూలు  చీర. చాలా  మెత్తగా ఉంది.అత్తా-కోడలు అంచులు. 
ఒక వైపు పసుపు రెండో వైపు నీలం అంచులు. అంచుల పైన గీసిన డిజైన్ చూడండి 
చీర అంత ఇలా పిట్టలు ఉన్నాయి.
ఎరుపు, పసుపు, నీలం  రంగులతో పిట్టలు చూడండి .
కొంగు పై పెద్ద పిట్టలు చాల అందంగా ఉన్నాయి కదూ?

ఇది బెంగాలీ చిత్రకారుల నైపుణ్యం. 

\ మీ...అనామిక....