Showing posts with label వ్యర్ధాలతో. Show all posts
Showing posts with label వ్యర్ధాలతో. Show all posts

Monday, 3 August 2015

శుభలేఖలతో బుక్ మార్క్ ...1

మనని పెళ్లి కని పిలుస్తో ఎన్నో శుభలేఖలు  వస్తాయి. అలాగే ఇతర శుభకార్యాలకి కూడా ఈ మధ్యన పత్రికలు చాలా  గ్రాండ్ గా అచ్చు వేయించి ఇస్తున్నారు. ఇవి చాలా పోగవుతాయి. 

వీటిని ఉప గించి నేను కొన్ని బుక్ మార్క్స్ తయారు చేశాను. ఇదిగో అందులో ఒకటి ఇక్కడ మీకోసం. 

ఇది శుభలేఖ పైన కవరు. ఇందులో నేను పైన భాగం ( మూత  లాగా ఉన్నది) కత్తిరించి క్రిందిది మాత్రం తీసుకున్నాను. 
ఇదిగో ఇలా దానికి ముందు భాగం గోల్డ్ ప్రింట్ ఉన్నది. వెనక సాదాగా ఉన్నది. మడత కూడా ఉన్నది (కవరు కదా). ఈ రెండు బాగాలను అలాగే లోపలిభాగం అతికించాను. బాగా ఆరిన తరువాత పంచర్ తో చిల్లు పొడిచి ఒక చక్కని త్రాడు ఎక్కించి చివరన జారి పోకుండా ముడి వేశాను. 
ఇదిగో బుక్ మార్క్ రెడి. ఇప్పుడు మీరు దీనిని పుస్తకం లో చదివే పేజీని గుర్తు పెట్టుకోవటానికి వాడ వచ్చు.  ఎవరికైనా గిఫ్ట్ చేయచ్చు, పిల్లలు కూడా దీనిని చాలా సులభంగా చేసేస్తారు. 
మరి ఆలస్యం దేనికి? మీరు చేసి చూడండి. 
మరి కొన్ని వచ్చే టపాలలో . ..... 


మీ...అనామిక....

Tuesday, 5 February 2013

వ్యర్ధాలతో...1

మనం ఎన్నో వస్తువులు పనికి రావని, చెత్త అని పడేస్తాం. కాని వాటిని ఉపయోగించి  కళాకృతులు కాని లేదా పనికొచ్చే వస్తువులు  కాని తయారు చేయోచ్చును. 

అలాంటిదే ఇది - గడియారం. 
ఇందులో వాడినవి- 
  • గడియారం కిట్టు - మార్కెట్ లో దొరుకుతుంది, 
  • గణేష్ బొమ్మ ఉన్న పెళ్లి పత్రిక దళసరిగా ఉంటుంది కనుక మొత్తంగా అలాగే వాడేం 
  • దాని పైన పాత కాలెండర్ నుండి కత్తిరించి, నంబర్లు అంటిచాం 
  • దాని పైన ముందు వైపు దుమ్ము నుండి రక్షణ కొరకు ప్లాస్టిక్ షీట్ వాడేం
  • వెనుక థర్మొకొల్ ముక్కలను వాడేం. దీనిపైన పెళ్లి పత్రిక అంటిచాం ఇది గడియారానికి ధృడత్వం ఇవ్వటమే కాక స్టాండ్ లాగా  కూడా పని చేస్తుంది.
ఈ గడియారాన్ని టేబుల్ పైన పెట్టుకోవచ్చును లేదా గోడకు తగిలించుకోవచ్చును. ఇప్పటికి 2-3 ఏళ్ల నుంచి బాగానే పనిచేస్తోంది.

పెళ్లి పత్రికలను, చించ లేము. పారేయను లేము. అందుకని ఇలా వాడితే బాగుంటుందని అనిపించింది. ఈ ఐడియా నాది. గడియారం మాత్రం మా తమ్ముడు తయారు చేశాడు. నాకు అంత ఇంజినీరింగ్ తెలియదు. 


మరి నా ఈ ఐడియా మీకు నచ్చిందా? ....
మీ...అనామిక....

Monday, 26 March 2012

మన వంతు....భూత దయ


మీకు తెలుసా? మన రాష్ట్రంలో పిచుకల సంఖ్యా 80% తగ్గిందని  ఒక  అంచనా. రాబందులు, సైబీరియన్ క్రేన్...ఇలా ఎన్నో. కొన్ని అసలు లుప్తమైపోతే కొన్ని దాదాపుగా ఆ దశకు చేరుకుంటున్నాయి. ఈ లింక్ లో చూడండి:


వీటన్నిటికి కారణం మానవుని స్వార్ధం, అత్యాశ, విచక్షణా రహితంగా అడవులు, చెట్లు నరికి వేయటం, అడవులను నరికి వేసి, సాగు భూములుగా వాడటం, చెట్లు నాటకపోవటం ఇలా ఎన్నో.  

ఇప్పుడైనా కళ్ళు తెరిచి, మనం కొంతైన పశు పక్షాదులని ఆదుకోవాలి. ముఖ్యంగా నగరాలలో పట్టణాలలో వీటికి తిండి నీరు దొరకదు. పిచుకలు, చిన్న చిన్న పక్షులు, చిలకలు ఇలాంటివాటికి పళ్ళు గింజలు కావాలి.అసలు మన నగరాలలో మొక్కలే పెంచట్లేదు. ఇహ చెట్లా? 

మీరు ఉన్నది చిన్న ఇల్లైన, ఫ్లాట్ అయిన గుప్పెడు ధాన్యపు గింజలు, గుక్కెడు మంచినీళ్ళు అందుబాటులో ఉంచ గలిగితే చాలు. కొన్ని పళ్ళ ముక్కలు కూరల ముక్కలు పెట్టవచ్చు. 

స్థలం ఉంటే  మొక్కలు నాటండి, చెట్లు పెంచండి. చిన్న కుండీలలో అయిన సరే.

పూల మొక్కలు, తుమ్మెదలు, సీతాకోక చిలకలు, తేనెటీగలు సందడి చేస్తాయి. పళ్ళ మొక్కలుంటే, చిలుకలు ఇతర పక్షులు మిమ్మలిని పలకరిస్తాయి. 

ధాన్యం గింజలు తినే పక్షులకి నీరు చాల అవసరం. అంతే కాదు వేసవిలో తాపం నుండి రక్షణకు నీళ్ళలో ఒక మునకైన అవసరం. లోతు ఎక్కువలేని వెడల్పు గల మట్టి ముకుళ్ళ  లో నీళ్లు పోసి పెట్టవచ్చు.   

ఇవిగో నేను మా ఇంట్లోని తోటలో, కిటికీలలో ఇలా చాలా చోట్ల పెడతాను: 
 ఇలా మూకుడులో గింజలు, నీళ్లు పెట్టచ్చు.
 లేదా ప్రమిదలో 
పనికిరాని డబ్బాలలో...శుబ్రం చేసి పెట్టండి.
ఇంకా ఓపికుంటే ఇలాంటి అందమైన మట్టి పాత్రలను మీ తోటలో పెట్టుకోవచ్చు. 

ఏవైనా ఈ పాత్రలను తరుచు శుబ్రపరిచి, శుబ్రమైన నీరు గింజలు ఉంచాలి. ఇలా తరుచు చేస్తూ ఉంటే, పక్షులు, ఉడుతలు వంటివి మనని పలకరిస్తాయి.

మరి చేస్తారుగా? 


మీ...అనామిక....