Sunday, 6 November 2011

ఉల్లి కాడల తో పువ్వులు

ఉల్లికాడలతో పువ్వులు చేయటం చాల తేలిక. ఎలాగో చూద్దామా?

కావలసినవి:

ఉల్లికాడలు
పదునైన కత్తి
కొబ్బరి చీపురు పుల్లలు లేదా వెదురు పుల్లలు



ముందుగా:

ఉల్లికాడలు తాజాగా ఉన్నవి ఎంచుకోండి. వాటికీ ఉన్న ఉల్లి పాయలు మరి పెద్దవి(లావుగా) లేదా మరి చిన్నవి(సన్నగా) కాకుండా ఉండాలి. అవి చక్కగా ఉండాలి, ఎటువంటి గాట్లు లేదా దెబ్బ తగిలినవి కాకూడదు. వాటి పైన ఉన్న ఆకులూ(కాడలు) తాజాగా ఉండాలి. మనం వాటిని  కొన్న తర్వాత మడిచి కూరల సంచిలో పెట్టుకుంటాం. అలా మడవకుండా ఉండాలి. మడిస్తే ఆకులు నలిగి పోయి, తెగిపోయి మనకి కావలిసిన రీతిలో ఉండవు. 

ఉల్లి కాడలను నీళ్ళలో ముంచి మట్టి పోయేట్లుగా కడగాలి. కడిగేటప్పుడు ఆకులు నలిగి పోకుండా, చిరిగి పోకుండా జాగ్రత్తగా, నెమ్మదిగా కడగాలి. తరువాత ఆ నిరు పూర్తిగా పోయేదాకా ఒక పలుచటి బట్ట మీద ఆరనివ్వండి. 

కత్తి చిన్నదిగా ఉండి, చివర కోన దేలి ఉండి బాగా పదునుగా ఉండాలి. పిడి మన చేతిలో  సరిపోయేంతగా ఉంటే బాగుంటుంది. లేదా మనం రోజు వాడె కూరలు తరిగే కత్తి అయిన సరే. చివర మాత్రం మొనదేలి కోసుగా ఉంటేనే మంచిది.


కొబ్బరి చీపురు పుల్లలు, బలంగా ఉండి ఒక వైపు కోన దేలి ఉన్నవి  ఎంచుకోవాలి. ఇవి బలంగా ఉండి కావలిసిన పొడవు ఉన్నవి తీసుకోండి. వెదురు పుల్లలు అయితే ఇంకా బాగుంటుంది. ఇవి కూడా సన్నగా ఉండి చివర సూది లాగా ఉండాలి. Bamboo skewers అని దొరకుతాయి- అంటే కబాబ్ చేయటానికి వాడేవి. లేదా పుల్లలను ఒక వైపు మనమే కత్తితో చెక్కి సుదిలగా చేసుకోవచ్చు. 

చేసే పధ్ధతి :
  • ఉల్లిపాయలను కాడల నుండి కత్తిరించి వేరు చేయండి. ఇలా చేసేటప్పుడు, పాయలు కనీసం 5 -7 cms ఉండాలి. అలాగే ఆకులు(పోరకలు) విడి పడకుండా గుత్తిగా ఉంటే బాగుంటుంది. ఒక వేళ విడి పడితే కంగారేమీ లేదు. వాటిని టూత్ పిక్స్ పెట్టి కలిపి పెట్టవచ్చు.
  • ముందుగా ఒక ఉల్లిపాయ వేళ్ళని కత్తిరించి (పలుచని slice చేసి) తీసివేయండి.కానీ జాగ్రత్త సుమా ఎక్కువ కత్తిరిస్తే పాయ పొరలుపొరలుగా విడి పోతుంది. 
  • పైన ఎండిపోయిన పొట్టు ఉంటే తీసి వేయండి.
  • ఇప్పుడు అ భాగం మీ నుండి బైట వైపుకి పట్టుకుని, అటు  నుండి   1cm వడిలి క్రింది వరకు  కత్తితో పొడుగ్గా చిల్చండి.
  • ఈ చీలిక, పాయ మధ్య వరకు ఉండాలి సుమా. 
  • పాయను తిప్పుతో దగెరగా చిలుస్తూ మొత్తం పాయ అంత చిల్చండి.
  • ఈ చిలికలను వేళ్ళతో నెమ్మదిగా కొద్దిగా వేరు చేయండి.
  • ఇలా మీకు  కావలసినన్ని పాయలు చేసుకోండి.
  • వీటిని ఒక పాత్రలో చల్లటి (ఐస్ కోల్డ్) నీళ్ళలో ముంచి 15-20  నిం. పాటు ఫ్రిజ్జి లో ఉండనివ్వండి. డీప్ ఫ్రిజ్జిలో పెట్టవద్దు. 
  • పాయలు ఇలా  పువ్వుల లాగా విచ్చుకుంటాయి. వాటిని నీళ్ళ నుండి  తీసేసి నిరు పూర్తిగా కారిపోయేంత వరకు ఒక పలుచటి బట్ట మిద పెట్టి ఉంచండి.
  • ఈ లోపల పుల్లలను (సూది లాగా ఉన్న భాగం) ఉల్లి కాడలు(పోరకలు) లోంచి ఒక దానిలోనికి నెమ్మదిగా అడుగు నుండి లోపలికి దూర్చండి. కాడలు గుత్తిగా ఉంటె మధ్యగా ఉన్న కాడలోంచి లేదా విడి పడిపోతే కావలసినంత పొడవు ఉన్న కాడను  ఉపయోగించండి.  ఇలా చేసేటప్పుడు ఆ కాడ చిలిపోకుండా చూసుకోండి.
  • ఇప్పుడు  ఈ కాడ పై భాగాన ఒక ఉల్లి పువ్వుని గుచ్చండి. 
  • ఇలా మీకు కావలసినన్ని తయారు చేసుకోండి. 
  • వీటిని ఒక గ్లాసులో కాని వాజులో కాని అమర్చుకోండి. వీటికి ఇంకొన్ని ఉల్లి కాడలను ఆకుల లాగా అమర్చుకోవచ్చు. 
పార్టిలకి డిన్నర్లకి ఈ అలంకరణ డైనింగ్ టేబుల్ పై అమరిస్తే చాల బాగుంటుంది. మీరూ చేసి చూడండి.


మీ...అనామిక....

2 comments:

జ్యోతిర్మయి said...

మీ బ్లాగు ఎప్పుడూ కొత్త అందాలతో అలరిస్తూ ఉంటుంది
అనామికగారూ..

అనామిక... said...

ధన్యవాదలు జ్యొతిర్మయిగారు. నాకు ఎప్పుడు కొత్తగ ఎదైన చెయ్యాలని తపన.