Showing posts with label ఆత్మా-పరమాత్మా. Show all posts
Showing posts with label ఆత్మా-పరమాత్మా. Show all posts

Tuesday, 13 March 2018

శ్రీ హనుమంతుని ద్వాదశ నామములు

రామ భక్తుడు, అంజనీ సుతుడు, మహాబలవంతుడు అయిన హనుమంతుని ఆరాధన పిల్లల నుండి పెద్దల దాకా అందరికి మేలు చేస్తుంది. ఎలా స్తుతి చేసినా, పూజ చేసినా స్వామి తప్పక అనుగ్రహిస్తాడని ప్రతీతి.

మీ కోసం శ్రీ హనుమంతుని ద్వాదశ నామములు;
శ్రీ హనుమంతుని ద్వాదశ నామములు

ఈ  ద్వాదశ నామములు రాత్రి నిదురించే ముందు మరియు, ప్రయాణం చేసేటప్పుడు తప్పక పఠించాలని మన పెద్దలంటారు. 

రాత్రి నిదురపోయే  ముందు పఠిస్తే  దుఃస్వప్నములు రావని, ప్రయాణం  చేసేటప్పుడు పఠిస్తే  కార్యసిద్ధి , క్షేమంగా ప్రయాణం సాగుతుందని అంటారు.  

మీ...అనామిక....

Saturday, 5 November 2016

శ్రీ దామోదర స్తోత్రం


కార్తీక మాసంలో విష్ణుమూర్తిని శ్రీ తులసీధాత్రీ  సహిత దామోదర స్వామి గా కొలుస్తారు. ధాత్రి అంటే ఉసిరిక చెట్టు. ఈ మాసమంతా శ్రీ తులసీధాత్రీ  సమేత  దామోదర వ్రతం చేస్తారు. అంత చేయాలేని వారు కనీసం చతుర్దశి రోజునైనా ఈ వ్రతం ఆచరిస్తారు. 

మరి ఈ రోజుల్లో మనము ఇవన్నీ చేయాలేము కాబట్టి కనీసం స్తోత్ర పారాయణం అన్న చేస్తే మంచిది. అందుకే మీ కోసం ఈ  స్తోత్రం. 

పూర్వము సత్యవ్రతుడు అనే బ్రాహ్మణుడు కార్తీక మాసంలో వ్రతం చేయుచు ఈ స్తోత్రం చదివి భగవంతుని సాక్షాత్కారము పొందెనని ప్రతీతి. 
 శ్రీ దామోదర స్తోత్రం
మీరంతా కూడా ఈ  స్తోత్ర పారాయణ ఈ  మాసమంతా చేసి స్వామి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తో .....


మీ...అనామిక....

Saturday, 27 February 2016

మంత్రాత్మకం శ్రీమారుతి స్తోత్రం


మనవి:  నేను పోస్ట్ చేస్తున్న స్తోత్రాలు, మంత్రాలూ, శ్లోకాలలో చాలా  జాగ్రత్తలు తీసుకుని ప్రచురించినా కొన్ని అచ్చు తప్పులు కానీ ఇంకా ఎవైన తప్పులు కాని ఉండ వచ్చును. ఏవైనా  తప్పులు ఉంటే దయ చేసి నాకు మెయిల్ చేయండి. సరి చేసి మళ్లి  పోస్ట్ చేస్తాను. 

మీ...అనామిక....

Tuesday, 17 November 2015

తులసీ షోడశనామాలు

తులసిని పూజించటం మనకి అలవాటు. ప్రతి రోజు ప్రొద్దున, సాయంత్రం తులసికోట దగ్గర దీపం వెలిగిస్తుంటాము. కొంత మంది చక్కగా పద్దతిగా తులసి పూజ చేస్తారు. అది చేయటానికి విలులేనప్పుడు కనీసం ఈ నామాలు చదువుకోవచ్చును. అందునా కార్తిక మాసంలో తులసికోట దగ్గర దీపం పెడితే ఇంకా మంచిది అంటారు మన పెద్దలు.


మీ...అనామిక....

Tuesday, 13 October 2015

నవ దుర్గాస్తోత్రం

ఈ వేళ నుండి దసరా నవరాత్రులు ప్రారంభం. మరి అమ్మవారిని అందరం రకరకాలుగా కొలుస్తాము. అందులో నవదుర్గలుగా  పూజించుకునే సంప్రదాయం ఒకటి. నవదుర్గ స్తోత్రంలో అమ్మవారి తొమ్మిది రూపాలను ఇలా చెప్పారు. 


ఈ స్తోత్రము  బ్రహ్మ దేవులు మార్కండేయ మహర్షికి చెప్పినది. అమ్మవారి తొమ్మిది రూపాలు, ఆ దుర్గ పరమేశ్వరి రూపాలుగా "నవ దుర్గలుగా" వర్ణించెను. 

ఈ నవదుర్గల శరణు కోరితే, అన్ని కష్టాలు, భయాలు, సంకటాలు, ఉపద్రవాలు, తొలిగిపోతాయని, భూతప్రేత పిశచాల నుండి, భయంకర మృగాల నుండి, శత్రువుల నుండి రక్షణ పొందుతారని, సకల శుభములు కలుగుతాయని వివరించెను. నవ దుర్గలను  సదా  ధ్యానించు వారికి  కోరిన కోర్కెలు నెరవేరుతాయని కూడా చెప్పబడినది. 

 ఆ స్తోత్రం మీ కోసం. ఇది రోజు ఒకసారి స్మరించుకోవచ్చును.

మీ...అనామిక....

Saturday, 10 October 2015

శని దశ విధనామ స్తోత్రం

ఇవాళ శని త్రయోదశి. ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శని లేదా శని మహా దశ  అంతర్ దశ  ఉన్నవారు శనికి  శాంతిని జరిపించుకోవాలి. 

ప్రతి శనివారము శనికి  19 ప్రదక్షిణములు చేయటం మంచిది. 

ప్రతి శనివారము పైన చెప్పిన స్తోత్రము రావి చెట్టు వద్ద పఠించినా, రావి చెట్టుకి 7 సార్లు ప్రదక్షిణములు చేస్తో 7 సార్లు ఈ స్తోత్రమును పఠిస్తే  మంచి ఫలితము ఉంటుంది. 

మీ...అనామిక....

Friday, 2 October 2015

మాంగల్యరక్షణకై పఠించవలసిన మహామంత్రం

సువాసిని స్త్రీలు, మాంగల్యరక్షణ కొఱకు  ప్రతినిత్యము పఠించవలసిన మహామంత్రము. 


మీ...అనామిక....

Thursday, 1 October 2015

కష్ట నివారణ శ్రీ సాయినాథ దశనామ స్తోత్రము

కష్టాలు ఎవరికీ ఉండవు? కష్టాలనుండి రక్షించమని మనం భగవంతుణ్ణి వేడుకుంటాం. కష్టనివారణకు ఉన్న ఉపాయాల్లో శ్రీ సాయి దశ నామ స్తోత్రం ఒకటి. 

సాయినాథుడు భక్తవత్సలుడు. ఆయనను కొలిచే వారికీ తెలుసు అయన భక్తులను ఎలా ఆదుకుంటారో అని. ఇవాళ గురువారం. అందుకని ఈ స్తోత్రం మీ కోసం. 

ఈ స్తోత్రం రోజూ త్రిసంధ్యలలో పఠించడము ఉత్తమం. లేదా రోజుకి 3 సార్లు కానీ కనీసం ఒక్క సారి పఠించినా చాలు. ఏదైనా కష్టాల నుండి త్వరగా బయటపడాలంటే రోజుకి 11 సార్లు చదువుతే త్వరిత ఫలితం లభిస్తుంది. 

ఈ శీర్షికలోని టపాలు  మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. మీ సలహాలు సూచనలు సదా శిరోధార్యములే. 

మీ...అనామిక....

Tuesday, 29 September 2015

కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలను పెంపొందించే శ్రీ గణపతి స్తోత్రం

గృహమే కదా స్వర్గ సీమా అన్నాడో కవి. నిజమే కదండీ. ఇంట్లో ఉండే వాళ్ళైనా, బయటకు వెళ్లి, చదువుకునే వాళ్లైనా లేదా ఉద్యోగం చేసుకునే వాళ్లైనా, ఇల్లు పదిలంగా ఉంటే  అంతా  సంతోషం. ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో నివసించే వారికి  సుఖమూ  శాంతి. 

కాని ఇది సాధ్యమా. ఎన్నో కలతలు. ఎన్నో కష్టాలు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య చికాకులు, గొడవలు. మరి ఇల్లు నరకమే. 

అయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరగడానికి, సఖ్యతగా ఉండాడానికి శంకరాచార్యులవారు రచించిన ఈ శ్రీ గణపతి స్తోత్రం చదువుకుంటే చాలు. 
ఇది అనుభవ పూర్వకంగా చెప్తున్నాను. ఎంతో మంది చేసి ఋజువు  చేసుకున్నారు. 

కలహాలు ఎక్కువగా ఉన్నపుడు రోజుకి 3 సార్లు చదువుకొవచ్చును.  లేదా ఓపికను బట్టి, అవసరాన్ని బట్టి 11 సార్లు, 21 సార్లు చేసి, పరిస్థితి చక్క బడిన తరువాత రోజూ  ఒక్క సారి చదువుకుంటే చాలు. మరి మీరూ  చేసి నాకు ఫలితం చెప్పండి. 

మీ...అనామిక....