Showing posts with label మా తోటలో. Show all posts
Showing posts with label మా తోటలో. Show all posts

Friday, 8 November 2013

ఆకు సంపెంగ


మా తోటలో మొట్ట మొదటగా పూసిన ఆకు సంపెంగ పువ్వు. 
నాకు సంపెంగలంటే చాలా ఇష్టం. మా ఇంట్లో మూడు రకాల సంపెంగలు ఉన్నాయి. ఇదిగో ఇది ఆకు పచ్చ సంపెంగ. మొన్ననే పూసింది మెదటి సారి. చాలా సంతోషం అనిపించింది ఆ పువ్వును చుస్తే. వీటి సువాసన అంటే నాకు చాల ఇష్టం. ఇప్పుడిప్పుడే  మొగ్గలు తోడుగుతోంది. 

మీ...అనామిక....

Sunday, 23 December 2012

సీతాకోక చిలుకాలమ్మా.....

మొన్న ఒక రోజు మా తోటలో సీతాకోక చిలుకలు రెండు సరాగాలాడుకుంటో  నాకు కనిపించాయి. మా తోటంతా హడావిడిగా తిరుగుతూ పువ్వు పువ్వుని పలకరిస్తూ ఉంటే  నేను అలా  కళ్ళప్పగించి చూస్తూ ఉండి పోయాను. కొంచం సేపటికి గుర్తుకు వచ్చి కెమేర  తీసుకుని వచ్చాను. కాని వాటిని ఫోటో తీయటం అంత తేలిక కాదని తెలిసిపోయింది.   

అయినా కొంచం కష్టపడితే ఇదిగో ఇలా చిక్కాయి :


మీ...అనామిక....

Friday, 5 October 2012

అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు-2012


హైదరాబాద్ లో 1-10-12 నుండి 19-10-12 వరకు అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు-Bio Diversity Convention- 2012 - జరుగుతోంది. 

నా వంతు ఏదో ఉడుతా  భక్తీ నేను చేస్తున్నాను...వీటికోసం మొక్కలు పెంచి..

మరి మీరో ??????????

మీ...అనామిక....

Sunday, 23 September 2012

అందం పుట్టిన రోజు

మొన్న వినాయక చవితి నాడు, నేను ఉదయాన్నే ఇలా సీతాకోక చిలక పుట్టుక చూసాను. వెంటనే కేమెరా లో బంధించాను.
తరువాత సాయంత్రానికి ఆ సీతాకోక చిలక ఇలా కనిపించింది. అంతేనా, అది మా తోటలోని పువ్వులను పలకరిస్తో ఉంటే  చాలా సేపు చూసి ఆనందించాను. ఐతే ఇంకా మళ్లి నా కెమేరాకు చిక్కలేదు.
భగవంతుని సృష్టి ఎంత అందమైనదో కదా....

మీ...అనామిక....

Sunday, 26 August 2012

మా అతిథులు

మా తోటలో అప్పుడప్పుడు కొంత మంది అతిథులు వస్తూ ఉంటారు. మవారి వాళ్ళ సందడి మాకు. కొంత కాలక్షేపం కూడా.

నాకు ప్రొద్దునే లేవగానే తోటలో కాసేపు తిరగటం అలవాటు. ఇవాళ నాకు ఇదిగో ఈ సీతా కోక చిలుక కనిపించింది. 
మరి ఆ భగవంతుని సృష్టి ఎంత అందంగా ఉన్నదో చూడండి.
దాని పెద్ద పెద్ద కళ్ళు పొడువైన నాలుక. 

ప్రొద్దున్నే రెక్కలు తడిగా ఉంటాయి. అందుకే సూర్య భగవానుడు ఉదయించాక రెక్కలు విప్పి ఆరబెట్టుకుని అప్పుడు తమ పని చేసుకుంటాయి. 

ఇంకా ఇలాంటి వెన్నో వస్తాయి మా తోటలోకి . మేము పెంచిన చిన్న తోట ఇలా వేరే జీవాలకు కొంతైన ఆశ్రయం కలిపిస్తే చాలా ఆనందంగా ఉంటుంది మరి. 

మీ...అనామిక....

Sunday, 19 August 2012

వానాకాలం


ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండీ, అందుకని, మా తోటని బాగు చేయటం మొదలు పెట్టాం. ఎంత జాగ్రత్తగా ఉన్న వేసవిలో కొన్ని మొక్కలు పోతాయి. నీళ్ళు దొరకకపోవటం ఒక సమస్య. చీడ పీడలు సరే సరి. అందుకని పెంచిన మొక్కలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇవిగో కొన్ని మొక్కలు ఇదివరకు ఉండేవి మా తోటలో. అవి పొతే మళ్లి  కొత్తవి పెట్టాం .


వానలు బాగా పడుతున్నాయి కాబట్టి ఇవి బాగా  నాటుకుంటాయి.  

ఇంకా కొన్ని కొత్త మొక్కలు తెచ్చుకోవాలి. కుండ్ల లో కొత్తమట్టిని నింపాలి.  ఎరువులు వేయాలి. కత్తిరింపులు చేయాలి. ఇలా చాలా పని ఉంటుంది. ఎంత చేసినా,  రోజు కొంత కొంత చేసినా ఇంకా మిగిలే ఉంటుంది. ముఖ్యంగా తోటని శుభ్రం చేయటమంటే ఈ కాలంలో కష్టం. 

అయినా  ఆ పనిలో ఒక ఆనందం-తృప్తి ఉన్నాయి. చెట్లు ఆరోగ్యంగా కళ  కళ  లాడుతూ ఉంటే ఎంతో ఆనందం. పూచిన పూవులు కాసిన  చూసుకుని మురిసి పోతం.  




మీ...అనామిక....

Wednesday, 14 September 2011

చెప్పుకోండి చూద్దాం


మా పెరట్లో ఈ పూల తీగ ఉంది. దీనికి గుత్తులు గుత్తులుగా తెల్లని పూలు పూస్తాయి. ఇవి మంచి వాసనా కలిగి ఉంటాయి. నేను కొన్నప్పుడు ఆ నర్సరీ వాళ్ళు దీని పేరు  "నాగమల్లి " అని చెప్పారు. కానీ నాగమల్లి అంటే "శివలింగ" పుష్పమని నా స్నేహితురాలు అంటోంది. మీకు తెలిస్తే ఇది ఏ తీగో, ఈ పూలను ఏమంటారో దయచేసి చెప్పగలరు.




నేను అంతర్జాలంలో వెతికాను కానీ ఫలితం లేక పోయింది. మీకేమైనా తెలుసోనని  అడుగుత్తున్నా


మీ...అనామిక....

Tuesday, 2 August 2011

ముద్ద మందారం ....

ముద్ద మందారం....ముగ్ద సింగారం....



ముద్దుకే ముద్డొచే మందారం ముద్ద మందారం ముగ్ధ సింగారం....

మా తోటలో పూసిన పువ్వు. వాన దేవుడు కరుణించి వానలు బాగా కురిపిస్తుండటంతో ఇలా మందారాలు కనువిందు చేస్తున్నాయి.




మీ...అనామిక....