Wednesday 2 November 2011

క్విల్లింగ్-2

క్విల్లింగ్  కి కావలసిన సామగ్రి:  

కాగితం:  క్విల్లింగ్ కోసం ప్రత్యేకంగా పేపర్ స్ట్రిప్స్ దొరకుతాయి. ఇవి వాడటం చాల సులభం. వీటిలో  ఎన్నో రంగులు. 
  • Solid Colours: మొత్తం స్ట్రిప్ ఒక రంగు ఉంటుంది
  • Two Toned: ఒక వైపు ముదురు రంగు రెండో వైపు లేత రంగు.
  • Graduated: ముదురు రంగు నుండి లేత రంగు కి లేదా తెలుపు
  • మెటాలిక్: బంగారం వెండి రాగి వంటి రంగులు
  • జువేల్డ్ : నవరత్నాల రంగుల్లో 
ఇలా చాలా రంగులు ఉంటాయి. ఇవి ఒక పాకెట్ లో ఓకే రంగు కానీ లేదా చాలా రంగులు (assorted) కానీ  ఉండవచ్చు ముదురు రంగులు, లేత రంగులు, ఒకే రంగులో వివిధ షేడ్స్ ఇలా అమ్ముతారు. దాదాపు 250 రంగులు ఉన్నాయి  అని  వినికిడి. 

ఈ స్ట్రిప్స్ యొక్క పరిమాణం 2mm, 3mm, 5mm, 8mm ఇంకా 10mm .


ఈ కాగితపు  స్ట్రిప్స్ తోనే రకరకాలైన ఆకారాలు చేస్తాం. 
Single colour packs
Assorted Colours
Assorted Colours-10mm
Graduated Coloured paper
Gold Colour
Quilling Tools


క్విల్లింగ్ టూల్ : ఇందులో రెండు రకాలు. ఒకటి సూది లాగా ఉంటుంది. రెండవది కూడా సూదిలాగా  ఉంటుంది కానీ,  సూది ఫై భాగాన ఒక చీలిక ఉంటుంది. ఈ చీలిక లోంచి కాగితాన్ని దూర్చి పెట్టడం వల్ల జారిపోకుండా ఉంటుంది. రెండు రకాల టూల్స్ కి పట్టుకోవడానికి అనువుగా పిడి ఉంటుంది.


ఈ టూల్స్ లేకపోయినా టూత్ పిక్ కాని, పొడవైన సూదులు కాని లేదా సన్నగా ఉన్న పుల్లను కాని ఉపయోగించవచ్చు.


క్విల్లింగ్ సర్కిల్  టెంప్లేట్  బోర్డ్ : ఇది రకరకాలైన పరిమాణాలలో కాగితపు చుట్టలను తయారు చేయటానికి ఉపయోగ పడుతుంది. ఇది లేక పోయినా మనం ఒక తెర్మోకోల్ షీట్ (1ftX1ft) పైన వివిధ పరిమాణాలలో వృత్తాలను  గీసుకుని వాడుకోవచ్చు.


క్విల్లింగ్ కోమ్బ్: ఇది కొన్ని రకాల ఆకారాలు తయారు చేయటానికి ఉపయోగ పడుతుంది. కాని దీని బదులు మామూలు దువ్వెన కానీ గుండు సూదులు(పెద్దవి) వాడుకోవచ్చును.


సూదులు: పొడవాటి గుండు సూదులు. వీటికి  పైన పూసలు కూడా ఉన్నవి ఉంటాయి. ఇవి కాగితపు చుట్టలను కదలకుండా పట్టి ఉంచడానికి ఉపయోగపడతాయి. 


కత్తెర: చిన్నది, పదునైనది లేదా కాగితాలు కత్తిరించేందుకు మీరు తరుచు వాడే  కత్తెర.


ట్విజర్స్ : సన్నని కొసలు ఉన్న పటకారు. ఇది కాగితపు చుట్టలను వివిధ ఆకారాలలో మలిచే టప్పుడు ఉపయోగ పడుతుంది. 


కొలబద్ద:స్కేల్ చిన్నది లేదా కొలుచుకునే టేప్, కాగితపు స్ట్రిప్స్ ని కావలసిన పరిమాణాలలో కోలుచుకోవటానికి పనికి వస్తుంది. 


బంక: రంగు లేని బంక(Gum) అయితే  బాగుంటుంది, తొందరగా అతికే బంక అయితే మరీ మంచిది. 


మరి వచ్చే టపాలలో మరీ కొన్ని విషయాలు తెలుసుకుందాం....చూస్తూ ఉండండి నా బ్లాగ్ .....
మీ...అనామిక....

No comments: