Showing posts with label Stem Stitch Family. Show all posts
Showing posts with label Stem Stitch Family. Show all posts
Monday, 30 April 2012
Saturday, 28 April 2012
కాడ కుట్టు -Stem Stitch-5
Long Stem Stitch
కాడ కుట్టు కుటుంబానికి చెందిన మరొక కుట్టు నేర్చుకుందామా?
మామూలు కాడ కుట్టు లాగానే కుట్టాలి కాని కాడ కుట్టులో అంతకుముందు కుట్టిన కుట్టు దగ్గెర నుండి కుడతాం కదా. అంటే A నుండి B కి కుట్టి A-B కి మధ్యలో C నుండి D కి. తరువాత B నుండి E కి ఇలా అన్నమాట. దారం క్రింది వైపునకి ఉండాలి. పై వైపునకి ఉంటే అవుట్ లైన్ కుట్టు.
ఈ కుట్టులో ఇలా B నుండి కాకుండా కొంత దూరం వదిలి కుట్టాలి. ఎంత వదిలి కుట్టాలన్నది, మనము ఉపయోగించే దారం యొక్క మందము/పోచల పై ఆధారపడి ఉంటుంది.
ఈ కుట్టు ఇలా కనిపిస్తుంది.
ఇది పెద్దపెద్ద లతలు కుట్టటానికి ఉపయోగ పడుతుంది. ఏదైనా ఒక ఆకారం -పువ్వు, ఆకు లాంటివి, ఎక్కువ భాగం ఫిల్లింగు చేయాలంటే ఈ కుట్టు ఉపయోగపడుతుంది. త్వరగా కుట్ట వచ్చు.
ఫ్రాన్సు లో ఈ కుట్టుని ఎక్కువగా ఫిల్లింగ్ కి ఉపయోగిస్తారు. ఒక లైను తరువాత ఒకటి బాగా దగ్గెరగా బట్ట కనిపించకుండా కుండా కుడతారు. ముద్ద కుట్టుకంటే చాల సులభంగా తక్కువ శ్రమతో, తక్కువ సమయంలో కుట్టవచ్చు. అచ్చు ముద్ద కుట్టు లాగానే ఉంటుంది.
ఒక పువ్వు కాని ఒక ఆకు కాని, లేదా జంతువుల బొమ్మలు -ఇలా ఏదైనా కుట్టేటప్పుడు, ఒకే రంగు లో వివిధ షేడ్స్ వాడితే ముద్ద కుట్టులో లాగా అందంగా ఉంటుంది. ఇది మనం తరువాత చెప్పు కుందాం.
మరి నా ఈ టపాలు మీకు నచ్చుతున్నయనీ, సులభంగా అర్ధం అవుతున్నాయని అనుకుంటున్నాను.
Sunday, 22 April 2012
కాడ కుట్టు -Stem Stitch-4
Alternating Stem Stitch.
కాడ కుట్టు లోనే ఇంకొక కుట్టు చూద్దామా?
కాడ కుట్టు లో దారం క్రింది వైపుకి ఉంచి కుడతాం కదా. మొదట చెప్పుకున్నది ఇక్కడ ఒక సారి చూడండి.
అలాగే అవుట్ లైన్ కుట్టు లో దారం పై వైపుకి ఉంచ్చి కుడతాం. ఈ పాఠం ఒక సరి చూడండి.
ఈ కుట్టు లో దారాన్ని ఒకసారి పైకి ఒకసారి క్రిందికి పెట్టి కుట్టాలి. అందుకే దీనిని Alternating Stem Stitch అంటారు.
ఇలా ఇదే కుట్టుని వెరైటీ గా కుట్టుకోవచ్చు. బోర్డర్ లాగా, పిల్లల గావున్ల కీ, బ్లోవుజ్ లకీ, చీరెలు చున్నీల కీ, గాలేబుల కీ ఇలా వేటికైనా వాడుకోవచ్చు. వేరే ఇతర కుట్లతో నూ కలిపి కుట్టుకోవచ్చు.
మరి మీరు కుట్టి చూడండి. వీటిలో వెరైటీలు తరువాత చెప్పుకుందాం.
Thursday, 19 April 2012
కాడ కుట్టు -Stem Stitch-3
Outline Stitch
ఇది కుడా కాడ కుట్టులో ఒక రకం.
కాడ కుట్టు లాగానే కుట్టాలి. కాడ కుట్టులో దారం క్రింది వైపుకి ఉంచి కుడితే, ఈ కుట్టు లో దారం పై వైపుకి ఉంచి కుట్టాలి. మిగతా అంతా కాడ కుట్టు లానే.
మనం ఇప్పటి వరకు నేర్చుకున్న కాడ కుట్లు.
ఈ కుట్టు అవుట్ లైన్ కీ, కాడలు, లతలు కొమ్మలు కుట్టటానికి బాగా పనికొస్తుంది.
మరి మీరు ఈ కుట్లని బాగా సాధన చేయండి....ఇంకా చాలా చెప్పుకోవలసి నవి ఉన్నాయి.
Tuesday, 17 April 2012
కాడ కుట్టు- Stem Stitch-2
ఇది కాడ కుట్టులోనే ఇంకొక రకం. ఇది కాడలు లతలు, కొమ్మలు వెడల్పుగా కావాలనుకున్నప్పుడు కుట్టు కోవచ్చును.
ఇది కాడ కుట్టులాగానే కుట్టాలి కాని కుట్టు కొంచెం ఏటవాలుగా అంటే క్రాస్ గా. ఇలా మనకి కావలసినంత వెడల్పు కుట్టవచ్చు. కాని మరి ఎక్కువైతే బాగుండదు.
మాములు కాడ కుట్టు సన్నగా ఉంటే ఇది వెడల్పుగా ఉంటుంది. తేడాను గమనించండి.
ఈ కుట్టుని మాములు బట్ట పై సులభంగా కుట్ట వచ్చు. మ్యాటి మీద అయితే, కుట్టే పధతి మీకు సులభంగా అర్ధమవుతుందని కుట్టాను అంతే.
Sunday, 15 April 2012
కాడ కుట్టు-Stem Stitch-1
కాడ కుట్టు అంటే Stem Stitch, Outline Stitch, Stalk Stitch, South Kensington Stitch, Crewel Stitch అని కూడా అంటారు.
ఇది ఏ డిజైన్ అయిన అవుట్ లైన్ చేయటానికి ఎక్కువగా వాడతారు. అంటే ముద్దా కుట్టు లేదా గొలుసు కుట్టు లేదా ఇంకేదైనా కుట్టుని ఫిల్లింగ్ కోసం వాడినప్పుడు చుట్టురా కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది.
లేదా కేవలం అలా అవుట్ లైన్ లాగా కుట్టి వదిలేయచ్చును. ఇలా రెడ్ వర్క్ లో వాడతారు.
దిని పేరుకు తగ్గట్లుగానే కాడలు, కొమ్మలు, లతలు కుట్టటానికి ఉపయోగిస్తారు. వేరే కుట్ల తో కలిపికుట్ట వచ్చును. బహుశ ఇది అన్నింటి కంటే ఎక్కువగా వాడే కుట్టు అని చెప్పుకోవచ్చు.
లేదా కేవలం అలా అవుట్ లైన్ లాగా కుట్టి వదిలేయచ్చును. ఇలా రెడ్ వర్క్ లో వాడతారు.
దిని పేరుకు తగ్గట్లుగానే కాడలు, కొమ్మలు, లతలు కుట్టటానికి ఉపయోగిస్తారు. వేరే కుట్ల తో కలిపికుట్ట వచ్చును. బహుశ ఇది అన్నింటి కంటే ఎక్కువగా వాడే కుట్టు అని చెప్పుకోవచ్చు.
ఇది కుట్టటం చాల తేలిక. తొందరగా కుట్ట వచ్చును. ఈ ఫోటోలలో చూడండి.
A దగ్గెర క్రింది నుండి బట్ట పైకి దారం తీయండి.
B దగ్గెర బట్ట క్రిందికి దించి, A - B కి మధ్యన C దగ్గెర నుండి మళ్ళి దారం మళ్ళి పైకి తీయండి. మళ్ళి C నుండి కొంత దూరం D దగ్గెర దారం బట్ట క్రిందికి దించండి. ఇప్పుడు మళ్ళి C - D కి మధ్యన అంటే B నుండి లేదా కొంచెం వదిలి వేరే స్థానం నుండి పైకి రావాలి. ఇలా మనకి కావలిసనంత కుట్టు కోవాలి.
ప్రతి సారి దారం క్రింది వైపునకు మాత్రమె ఉండాలి.
ఇలా కనిపిస్తుంది పూర్తీ అయిన తరువాత.
మీకు అర్ధం అయ్యిందనుకుంటాను.
Subscribe to:
Posts (Atom)
ES.jpg)





ES.jpg)

ES.jpg)


ES.jpg)


ES.jpg)
ES.jpg)
ES.jpg)