కాడ కుట్టు అంటే Stem Stitch, Outline Stitch, Stalk Stitch, South Kensington Stitch, Crewel Stitch అని కూడా అంటారు.
ఇది ఏ డిజైన్ అయిన అవుట్ లైన్ చేయటానికి ఎక్కువగా వాడతారు. అంటే ముద్దా కుట్టు లేదా గొలుసు కుట్టు లేదా ఇంకేదైనా కుట్టుని ఫిల్లింగ్ కోసం వాడినప్పుడు చుట్టురా కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది.
లేదా కేవలం అలా అవుట్ లైన్ లాగా కుట్టి వదిలేయచ్చును. ఇలా రెడ్ వర్క్ లో వాడతారు.
దిని పేరుకు తగ్గట్లుగానే కాడలు, కొమ్మలు, లతలు కుట్టటానికి ఉపయోగిస్తారు. వేరే కుట్ల తో కలిపికుట్ట వచ్చును. బహుశ ఇది అన్నింటి కంటే ఎక్కువగా వాడే కుట్టు అని చెప్పుకోవచ్చు.

ఇది కుట్టటం చాల తేలిక. తొందరగా కుట్ట వచ్చును. ఈ ఫోటోలలో చూడండి.
A దగ్గెర క్రింది నుండి బట్ట పైకి దారం తీయండి.
B దగ్గెర బట్ట క్రిందికి దించి, A - B కి మధ్యన C దగ్గెర నుండి మళ్ళి దారం మళ్ళి పైకి తీయండి. మళ్ళి C నుండి కొంత దూరం D దగ్గెర దారం బట్ట క్రిందికి దించండి. ఇప్పుడు మళ్ళి C - D కి మధ్యన అంటే B నుండి లేదా కొంచెం వదిలి వేరే స్థానం నుండి పైకి రావాలి. ఇలా మనకి కావలిసనంత కుట్టు కోవాలి.
ప్రతి సారి దారం క్రింది వైపునకు మాత్రమె ఉండాలి.
ఇలా కనిపిస్తుంది పూర్తీ అయిన తరువాత.
మీకు అర్ధం అయ్యిందనుకుంటాను.
మీ...అనామిక....
No comments:
Post a Comment