ఇది కాడ కుట్టులోనే ఇంకొక రకం. ఇది కాడలు లతలు, కొమ్మలు వెడల్పుగా కావాలనుకున్నప్పుడు కుట్టు కోవచ్చును.
ఇది కాడ కుట్టులాగానే కుట్టాలి కాని కుట్టు కొంచెం ఏటవాలుగా అంటే క్రాస్ గా. ఇలా మనకి కావలసినంత వెడల్పు కుట్టవచ్చు. కాని మరి ఎక్కువైతే బాగుండదు.
మాములు కాడ కుట్టు సన్నగా ఉంటే ఇది వెడల్పుగా ఉంటుంది. తేడాను గమనించండి.
ఈ కుట్టుని మాములు బట్ట పై సులభంగా కుట్ట వచ్చు. మ్యాటి మీద అయితే, కుట్టే పధతి మీకు సులభంగా అర్ధమవుతుందని కుట్టాను అంతే.
మీ...అనామిక....
No comments:
Post a Comment