గృహమే కదా స్వర్గ సీమా అన్నాడో కవి. నిజమే కదండీ. ఇంట్లో ఉండే వాళ్ళైనా, బయటకు వెళ్లి, చదువుకునే వాళ్లైనా లేదా ఉద్యోగం చేసుకునే వాళ్లైనా, ఇల్లు పదిలంగా ఉంటే అంతా సంతోషం. ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో నివసించే వారికి సుఖమూ శాంతి.
కాని ఇది సాధ్యమా. ఎన్నో కలతలు. ఎన్నో కష్టాలు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య చికాకులు, గొడవలు. మరి ఇల్లు నరకమే.
అయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరగడానికి, సఖ్యతగా ఉండాడానికి శంకరాచార్యులవారు రచించిన ఈ శ్రీ గణపతి స్తోత్రం చదువుకుంటే చాలు.
ఇది అనుభవ పూర్వకంగా చెప్తున్నాను. ఎంతో మంది చేసి ఋజువు చేసుకున్నారు.
కలహాలు ఎక్కువగా ఉన్నపుడు రోజుకి 3 సార్లు చదువుకొవచ్చును. లేదా ఓపికను బట్టి, అవసరాన్ని బట్టి 11 సార్లు, 21 సార్లు చేసి, పరిస్థితి చక్క బడిన తరువాత రోజూ ఒక్క సారి చదువుకుంటే చాలు. మరి మీరూ చేసి నాకు ఫలితం చెప్పండి.
No comments:
Post a Comment