ఈ వేళ నుండి దసరా నవరాత్రులు ప్రారంభం. మరి అమ్మవారిని అందరం రకరకాలుగా కొలుస్తాము. అందులో నవదుర్గలుగా పూజించుకునే సంప్రదాయం ఒకటి. నవదుర్గ స్తోత్రంలో అమ్మవారి తొమ్మిది రూపాలను ఇలా చెప్పారు.
ఈ స్తోత్రము బ్రహ్మ దేవులు మార్కండేయ మహర్షికి చెప్పినది. అమ్మవారి తొమ్మిది రూపాలు, ఆ దుర్గ పరమేశ్వరి రూపాలుగా "నవ దుర్గలుగా" వర్ణించెను.
ఈ నవదుర్గల శరణు కోరితే, అన్ని కష్టాలు, భయాలు, సంకటాలు, ఉపద్రవాలు, తొలిగిపోతాయని, భూతప్రేత పిశచాల నుండి, భయంకర మృగాల నుండి, శత్రువుల నుండి రక్షణ పొందుతారని, సకల శుభములు కలుగుతాయని వివరించెను. నవ దుర్గలను సదా ధ్యానించు వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని కూడా చెప్పబడినది.
ఆ స్తోత్రం మీ కోసం. ఇది రోజు ఒకసారి స్మరించుకోవచ్చును.
మీ...అనామిక....
No comments:
Post a Comment