Showing posts with label ఆ పాత మధురాలు. Show all posts
Showing posts with label ఆ పాత మధురాలు. Show all posts

Monday, 5 October 2015

పల్లవి-అనుపల్లవి

ఈ పాట నాకు ఇష్టమైన పాటలలో ఒకటి. అలనాటి పల్లెటూరి వాతావరణం ఈ పాటలో ప్రతిబింబిస్తుంది. సాహిత్యం కాని, దానికి తగ్గ సంగీతం కాని మనకి ఆ పల్లెపట్టును  కళ్ళ ముందు ఉంచ్చుతుంది అనిపిస్తుంది. వింటున్నంత సేపు, ఆ పచ్చని పైరులు, చల్లని పైరు గాలి, చేను గట్ల పైన చింతచెట్లు, పక్కన పారే సెలయేరు, వాటి గలగలలు, పిట్టల కిలకిలా  రావాలు.... మా కోనసీమలో ఉన్నట్లే ఉంటుంది. మరి మీకు?

ఈ పాటని మీరు ఇక్కడ వినవచ్చు. 
నాకు ఈ పాటకు వీడియో  దొరకలేదు . మీకు తెలిస్తే దయచేసి నాకు ఆ లింక్ మెయిల్ చేయండి. 

update 9/10/2015:
సత్యగారు, అనూరధగారు విడియో లింక్ పంపించారు. వారికి నా ధన్యవాదాలు. ఆ లింక్ లు ఇక్కడ ఇస్తున్నాను. 
చిలికింత చిగురు సంపంగి గుబురు
చిలికింత చిగురు సంపంగి గుబురు


మీ...అనామిక....

Monday, 14 September 2015

పల్లవి-అనుపల్లవి

భానుమతిగారు  పాడిన ఈ పాట  నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒకటి. మీ కోసం ఈ పాట;


ఈ పాటను ఇక్కడ చూడండి ; ఓ బాటసారీ ....

మీ...అనామిక....

Monday, 31 August 2015

పల్లవి-అనుపల్లవి


పూలు గుసగుసలాడేనని... ఈ పాట నాకు ఇష్టమైన పాటలలో ఒకటి. దిని సాహిత్యం చాలా బాగుంటుంది . ఎప్పుడు విన్నా సంగితమైతే చాలా కొత్తగా ఉంటుంది. మెలోడియస్ కూడా. హిందీ లోని ఆశా భోంస్లే పాడిన ఒక పాట దీనికి మూలం.  దీనిలో కృష్ణ , వాణిశ్రీ ముఖ్య తారాగణం.



ఈ లింక్ లో  పాటను  చూడండి . 

అయితే పాట  3వ చరణం లేదు. మీకు తెలుస్తే నాకు మెయిల్ చేయండి దయ చేసి. నేను వెతుకుతున్నాను. 


మీ...అనామిక....

Thursday, 23 July 2015

పల్లవి - అనుపల్లవి

ఈ పాట  నాకు చాలా  ఇష్టం. వినడానికి ఎంతో  హాయిగా ఉంటుంది. అంతేనా,  రొమాంటిక్ పాట  అయినా చక్కని సందేశం కూడా  ఉంది. 

చిత్రం: ప్రేమించి చూడు
రచన: దాసరథి
గానం : పి. బి. శ్రీనివాస్, పి . సుశీల
స్వరకల్పన: మాస్టర్ వేణు


పల్లవి:
అతడు :   వెన్నెల రేయి ఎంతో  చలి చలి 
               వేచ్చనిదానా రావే నా చెలి           ॥ వెన్నెల॥ 

ఆమె:      చల్లని జాబిలి  నవ్వెను మరీ  మరీ
               అల్లరివాడా  నీదే ఈ చెలి
చరణం 1: 
అతడు:    చూపులతోనే మురిపించేవు   (2)
               ఆటలతోనే మరిపించేవు   (2)
               చెలిమి ఇదేనా మాటలతో సరేనా (2)
ఆమె:       పొరపాటైతే పలకనులే పిలువనులే
               దొరకనులే  ఊరించనులే  ॥ వెన్నెల
చరణం 2: 
ఆమె       నా మనసేమో పదమని  సరి సరి
             మర్యాదేమో   తగదని పదే  పదే
             మూడు ముళ్ళు పడనీ  ఏడడుగులు నడవనీ (2)
అతడు:    వాదాలెందుకులే  ఔననినా
               కాదనినా  ఏమనినా  నా దానివిలే
ఆమె:      చల్లని జాబిలి  నవ్వెను మరీ  మరీ
               అల్లరివాడా  నీదే ఈ చెలి   ॥ వెన్నెల


మీ...అనామిక....

Saturday, 8 September 2012

పల్లవి- అనుపల్లవి

పాటంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? మంచి పాటను వింటే మనసు కరగని వారు ఉంటారా? ఈ పాట నాకు చాలా ఇష్టం 

చిత్రం: పెళ్లి కానుక 
తార గణం: అక్కినేని నాగేశ్వర రావు, బి. సరోజా దేవి, కృష్ణ కుమారి
రచన: ఆచార్య ఆత్రేయ
గాయకులూ : జిక్కి
స్వరకల్పన: ఎ. ఎం. రాజా


పులకించని మది పులకించు
వినిపించని కధ వినిపించు
కనిపించని ఆశల నించు
మనసునే మరపించు
గానం మనసునే మరపించు (పులకించని)(2)

రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం(2)
రేపు రేపను తీపికలలకు రూపమిచ్చును గానం
చెదరిపొయే భావములను చేర్చి కూర్చును గానం
జీవమొసగును గానం మదీ చింత బాపును గానం (పులకించని)

వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును (2)
కూలిపోయిన తీగలైనా కొమ్మనలమీ ప్రాకును
కన్నెమనసు ఎన్నుకొన్నా తోడు దొరికిన మురియు
దోరవలపే కురియు, మదీ దోచుకొమ్మని పిలుచు (పులకించని)

మనసునే మరపించు ప్రేమా మనసునే మరపించు

మీ...అనామిక....

Sunday, 6 November 2011

పల్లవి - అనుపల్లవి


మీర జాలగలడా ...

ఈ పాట నాకు చాల చాల ఇష్టం. ఇందులో తెలుగుతనం ఉట్టి పడుతుంది. అంతే కాదు రంగస్థలం లో మన తెలుగు వారికున్న ప్రత్యేకత-"పద్యము" ని గుర్తుకు తెస్తుంది. సుశీలగారు ఆ బాణిలో ఈ పాటను పాడి ఈ పాటను ఒక ఆణిముత్యం లా మనకి కానుక ఇచ్చారు.

చిత్రం: శ్రీ కృష్ణ తులాభారము 
తార గణం: N T R, జమున, అంజలి దేవి, కాంతా రావు
రచన: చందాల కేశవదాసు సిద్ధాంతి
గాయకులూ : సుశీల
స్వరకల్పన: పెండ్యాల


మీర జాలగలడా...
మీర జాలగలడా నా యానతి
వ్రత విధాన మహిమన్ సత్యాపతి(3) 

నటన సూత్ర ధారీ మురారి
యెటుల దాట గలడో నా యానతి
వ్రత విధాన మహిమన్ సత్యాపతి (2)

మీర జాలగలడా నా యానతి
వ్రత విధాన మహిమన్ సత్యాపతి 

సుధా ప్రణయ జలధిన్ వైదార్పితి ఈడ తావు గలదే
నాతోనిక వాదులాడ గలడా సత్యాపతి (2)

మీర జాలగలడా నా యానతి
వ్రత విధాన మహిమన్ సత్యాపతి
మధుర మధుర మురళీగానరసా స్వాదనమున
ఆ ఆ ఆ .......
మధుర మధుర మురళీగానరసా స్వాదనమున
ఆధార సుధారసమును మదినేగ్రోలగా(2)

మీర జాలగలడా నా యానతి
వ్రత విధాన మహిమన్ సత్యాపతి(2)


మీ...అనామిక....

Saturday, 29 October 2011

పల్లవి-అనుపల్లవి

చిత్రం: బంధిపోటు 
తార గణం: N T R, కృష్ణ కుమారి
రచన: Dr C నారాయణ రెడ్డి
గాయకులూ : ఘంటశాల, సుశీల
స్వరకల్పన: ఘంటశాల


ఊహలు గుస గుస లాడే
నా హృదయం ఊగిస లాడే (2)
వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నే తలచు
తొలి ప్రేమ లొ బలముందిలే
అది నికు మునుపే తెలుసు II ఊహాలు...II

నను కోరి చేరిన బేలా
దూరన నిలిచేవెలా
నీ ఆనతి లేక్కున్నచో
విడలేను ఊపిరి కూడా II ఊహాలు...II

దివి మల్లె పందిరి వేసే
భువి పెళ్లి పీటను వేసే
నెర వెన్నెల కురిపించుచు
నెల రాజు పెండ్ళిని చేసే

ఊహలు గుస గుస లాడే
మన హృదయములూయలూగే 


మీ...అనామిక....

Sunday, 23 October 2011

పల్లవి-అనుపల్లవి


ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒకటి. ఎంత బాగా రాసారు ఆత్రేయగారు. మంచి స్వరకల్పన. అంతే గొప్పగా పాడారు బాలు.

చిత్రం: ఇంద్రధనస్సు
తార గణం: కృష్ణ, శారద
రచన: ఆచార్య ఆత్రేయ
గాయకులూ : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం
స్వరకల్పన: కె. వి. మహాదేవన్ 

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది (2 )
నేనొక ప్రేమ పిపాసిని....

తలుపు మూసిన తల వాకిట నే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులే రాక అలసి తిరిగి వెళ్ళుతున్నా(2)
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని....

పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమ భిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగి పోయాను

నేనొక ప్రేమ పిపాసిని....

పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుత్తున్నా నీ చెవిన పడితే చాలు
నీ ఙ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని....

ఇదొక ఆణిముత్యం. మీ కోసం....


మీ...అనామిక....

Sunday, 11 September 2011

పల్లవి -అనుపల్లవి

నీ పైన నాకెంతో అనురాగా ముందని ..నాకెంతో ఇష్టమైన పాట. అందులోని భావం ఎంత మధురంగా వ్రాసారు దాశరథి. చక్రవర్తిగారు సమకుర్చిన స్వర కల్పన అద్భుతం. అంతే తియ్యగా పాడారు బాలు. వెరసి ఒక ఆణిముత్యం.

చిత్రం: అభిమానవతి
తార గణం: కృష్ణ, వాణిశ్రీ
రచన: దాశరథి.
గాయకులూ : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం
స్వరకల్పన: చక్రవర్తి


నీ పైన నాకెంతో అనురాగా ముందని (2)
నిను వీడి క్షణమైనా నేనుండ లేనని
ఎలా, ఎలా నీకెలా తెలిపేది ( 2) !! నీ పైన!!

నీలి నింగిలో కోటి తారలు మాలల్లల్లి తేనా
అందమైన ఆ చందమామ నీ కురుల తురుమ వలెనా (2)
అణువణువున నీవే వ్యపించినావని (2)
ఎలా, ఎలా నీకెలా తెలిపేది (2) !! నీ పైన!!

వలపు తెలియని మనసులోనికి ఎందుకోసమని వచ్చావు
మనసు దోచుకుని మమత పంచుకొని మరలి వెళ్లి పోతున్నావు
నిన్నే హృదాయన నిలిపాను నేనని
ఎలా, ఎలా నీకెలా తెలిపేది (2 ) !! నీ పైన!!

మీరు విని ఆనందించండి...




మీ...అనామిక....


నాకు నచ్చిన ఆ పాత మధురాలు

నాకు నచ్చిన ఆ పాత మధురాలు  ఎన్నో ఎన్నెనో. వెస్ట్రన్, హిందీ తెలుగు, తమిళం ఇలా భాష ఎదైన ఆ భావం, ఆ స్వర మాధుర్యం, పాట చిత్రీకరణ-నా మనసు ఫై చెరగని ముద్ర వేసాయి...అందులోంచి కొన్ని మీతో పంచుకుంటాను.


కే సర సర ...అనే పాట నాకు చాల ఇష్టం. మొదటిసారిగా మా నాన్నగారు నాకు ఈ పాట ని పరిచయం చేసారు. ఆయిన ఇంగ్లీష్, హిందీ  సినిమాలు చాల చూసేవారు. ఆయనకీ ఇంగ్లీష్, హిందీ సాహిత్యంతోనూ  బాగా పరిచయం ఉంది.  నాకు చిన్నపట్టినుంచే మంచి సాహిత్యం, పాటలు, పద్యాలు, సినిమాలు పరిచయం చేసే వారు. ఇలా నాకు కలిగిన రుచి ఇప్పటికి కొనసాగుతోంది. ఈ విధంగా నేను చాల అదృష్టవంతురాలిని. 

ఈ పాటలోని సాహిత్యం చాలా simple కాని చాలా అర్ధవంతమైనది. ఇందలోని భావం: ఏది ఎలా జరగాలని ఉంటె అలా జరుగుతుంది. భవిష్యత్తు గురించి మనం ఆలోచించ కూడదు.

ఈ పాట ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అనే ప్రఖ్యాత డైరెక్టర్- సస్పెన్సు త్రిల్లెర్ సినిమాల డైరెక్టర్, తీసిన  సినిమా "The Man Who Knew Too Much" లోనిది.1934లొ ఆయన  తీసిన సినిమానే మళ్లీ 1956లొ తీసారు. అందులో డోరిస్ డే అనే అభినేత్రి పాడిన పాట ఇది. దీనిని రే ఎవాన్స్ మరియు జే లివింగ్ స్టన్ రచించారు. 


కే సర సర అనే పదాలు ఇటాలియన్ ఫిలిం " ద బేర్ ఫుట్ కన్టేస్సా" లోనివి. కే అనే పదాన్ని స్పానిష్ భాషలోకి మార్చారు-ఎందుకంటే స్పానిష్. మాట్లాడే వారు ఎక్కువగా  ఉన్నారు.


ఈ పాటకు 1956 లో ఆస్కార్ అవార్డు ఇచ్చారు. ఇప్పటికి ఈ పాట చాలా జనాదరణ పొందిన పాటగా పేరుంది.


దీనిని భానుమతి తోడూ-నీడ చిత్రంలో అత్త ఒడి పువ్వు వలె మెత్తన్నమ్మ అనే పాటలో పాడారు.

This song is from Alfred Hitchcock's The Man Who Knew Too Much, remade in 1956 of his own 1934 film. The song was written by Ray Evans and Jay Livingston and sang by Doris Day.


The phrase "Que Sera, Sera" meaning what ever will be, will be-came from the film "The Barefoot Contessa"  as "Che Sera, Sera." (Italian) , but  "Che" was changed by the lyrist to "Que" because there were more Spanish people.


This song won the 1956 Oscar for Best Song.  This song was again used in 1960 film Please Don't Eat the Daisies.



LYRICS:


When I was just a little girl
I asked my mother, what will I be
Will I be pretty, will I be rich
Here's what she said to me.

Que Sera, Sera,
Whatever will be, will be
The future's not ours, to see
Que Sera, Sera
What will be, will be.

When I was young, I fell in love
I asked my sweetheart what lies ahead
Will we have rainbows, day after day
Here's what my sweetheart said.

Que Sera, Sera,
Whatever will be, will be
The future's not ours, to see
Que Sera, Sera
What will be, will be.

Now I have children of my own
They ask their mother, what will I be
Will I be handsome, will I be rich
I tell them tenderly.

Que Sera, Sera,
Whatever will be, will be
The future's not ours, to see
Que Sera, Sera
What will be, will be. 


These are the additional lyrics(not in the song sung by Doris Day in the film) as second stanza:

When I was just a child in school
I asked my teacher what should I try
Should I paint pictures
Should I sing songs
This was her wise reply


Que Sera, Sera,
Whatever will be, will be
The future's not ours, to see
Que Sera, Sera
What will be, will be.


తెలుగు అనువాదం :


నేను చిన్నపిల్లగా ఉన్నపుడు మా అమ్మని అడిగాను, నేను పెద్దయిన తరువాత ఎలా ఉంటాను? అందంగా ఉంటానా, ధనవంతురాలిని  అవుతానా? అప్పుడు మా అమ్మ అన్నది- ఏది ఎలా జరగాలని ఉంటే, అలా జరుగుతుంది. భవిష్యత్తు గురించి మనం ఆలోచించ కూడదు అని.

నేను యవ్వనంలోకి అడుగు పెట్టిన తరువాత ప్రేమలో పడ్డాను. నా ప్రియుడిని అడిగాను- మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? మన కోసం రోజు ఒక హరివిల్లు విరుస్తుందా? అప్పుడు తను ఎమ్మన్నాడు అంటే -ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. భవిష్యత్తు గురించి మనం ఆలోచించ కూడదు అని.

ఇప్పుడు నాకు పిల్లలున్నారు, వాళ్ళు నన్ను అడుగుతారు,  నేను పెద్దయిన తరువాత  అందంగా  ఉంటామా,  ధనవంతులం అవుతామా ?  అప్పుడు నేను సున్నితంగా చెప్తాను-ఏది ఎలా జరగాలని ఉంటే, అలా జరుగుతుంది. భవిష్యత్తు గురించి మనం ఆలోచించ కూడదు అని.

మీరుకూడా విని ఆనందిస్తారుగా...

మీ...అనామిక....

Saturday, 10 September 2011

పల్లవి-అనుపల్లవి

ఈ సంధ్యలో కెంజాయలో



ఈ మధ్యన  నేను ప్రయాణం చేస్తుండగా నా కెమేరాకి ఈ  దృశ్యం చిక్కింది. సాయంకాలం సంధ్య సమయం, చల్లని పిల్ల గాలి, ఆకాసంలో సూర్యాస్తమయం వేళ ఆ కెంజాయ రంగు కాంతులు చూస్తోంటే ఈ పాట గుర్తుకొచ్చింది. ఈ పాట చాల ఇష్టం నాకు. మీరు విని ఆనందించండి  మరి....

చిత్రం:  మూగ ప్రేమ
నటి నటులు : వాణిశ్రీ, శోభన్ బాబు 
పాట :  ఈ సంధ్యలో, కెంజయలో
రచన: ఆత్రేయ
స్వరకల్పన: చక్రవర్తి 
గాయని:  పి. సుశీల, S P బాల సుబ్రహ్మణ్యం 

ఈ సంధ్యలో కెంజాయలో
ఈ సంధ్యలో కెంజాయలో  చిరు గాలుల కెరటాలలో    (2)
ఎ మల్లి మరుల్లెల  ఎదబోసేనో ఎ రాజు ఎద లోతు చవి చుసేనో  
హ హ హ హ !! ఈ సంధ్యలో !!  

ఈ మేఘమే రాగ స్వరమో ఆ రాగమే మూగ పదమో  (2)

ఓ...... ఈ చెంగు ఎ వయసు పొంగో ఆ పొంగు ఆపేది ఎవరో
ఎవరో అదెవరో రెప రెప రెప రెప......!! ఈ సంధ్యలో !!

పులకించి  ఒక కన్నె మనసు,  పలకింది తొలి తీపి  పలుకు  (2)

ఓ.... చిలికింది అది లేత  కవిత,  ఒదిగింది తనలోనే మమత
మదిలో మమతలే రిమ ఝిమ రిమ ఝిమ రిమ ఝిమ.....!! ఈ సంధ్యలో !!

నా కళ్ళలో ఇల్లరికము, నా గుండెలో రాచరికము  (2)

ఓ...  నిదేను నిదేను నిజము, నేనుండు నీలో సగము
సగమే  జగముగా కల కల కల కిల కిల కిల !! ఈ సంధ్యలో !!

ఈ పాటలో ఎవైన తప్పులుంటే దయచేసి నాకు చెప్పగలరు. నేను  సరి  చేస్తాను. 


తెలుగు చిత్ర గీతాలు ఆ పాత మధురాలు 

మీ...అనామిక....