ఈ పాట నాకు చాలా ఇష్టం. వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది. అంతేనా, రొమాంటిక్ పాట అయినా చక్కని సందేశం కూడా ఉంది.
చిత్రం: ప్రేమించి చూడు
రచన: దాసరథి
గానం : పి. బి. శ్రీనివాస్, పి . సుశీల
స్వరకల్పన: మాస్టర్ వేణు
పల్లవి:
అతడు : వెన్నెల రేయి ఎంతో చలి చలి
వేచ్చనిదానా రావే నా చెలి ॥ వెన్నెల॥
ఆమె: చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరివాడా నీదే ఈ చెలి
చరణం 1:
అతడు: చూపులతోనే మురిపించేవు (2)
ఆటలతోనే మరిపించేవు (2)
చెలిమి ఇదేనా మాటలతో సరేనా (2)
ఆమె: పొరపాటైతే పలకనులే పిలువనులే
దొరకనులే ఊరించనులే ॥ వెన్నెల॥
చరణం 2:
ఆమె నా మనసేమో పదమని సరి సరి
మర్యాదేమో తగదని పదే పదే
మూడు ముళ్ళు పడనీ ఏడడుగులు నడవనీ (2)
అతడు: వాదాలెందుకులే ఔననినా
కాదనినా ఏమనినా నా దానివిలే
ఆమె: చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరివాడా నీదే ఈ చెలి ॥ వెన్నెల॥
మీ...అనామిక....
No comments:
Post a Comment