నేను ఖాళీగా ఉన్నప్పుడు, నా గాతాన్ని నెమరు వేసుకుంటాను. ముఖ్యంగా నా బాల్యం. మా అమ్మమ్మ గారి ఇంట్లో, మా బామ్మా గారి ఇంట్లో, మేన మమల ఇంట్లో, సెలవలకి, ఎవైన శుభకార్యాలకి, పండగలకి, పబ్బాలకి వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో. నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన ఇళ్లు, నా స్నేహితులు, చుట్టాలు పక్కాలు ముక్యంగా మా బాల బృందం (మేనమామ/పిన్నిపిల్లలు/అ వీధిలోని పిల్లలు) మేము ఆడుకున్న ఆటలు, చేసిన అల్లరులు ఇవన్ని తలచుకుంటే, మళ్లీ కాలం వెనక్కి వెళిపోతే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది.
మా అమ్మమ్మ గారి ఇంట్లో పెద్ద పెరడు. నిండా ఎన్నో పళ్ళ చెట్లు, పూల చెట్లు. మామిడి, నారింజ, జామ, బాదాం, కొబ్బరి, మందార, మల్లె, జాజి ఇంకా ఎన్నో చెట్లు. బాదాం, జామ చెట్ల క్రింద కూర్చుని రామ చిలుకలు కొట్టి పడేసిన పళ్ళు ఏరుకునే వాళ్ళం. చిలుకమ్మ చిలుకమ్మ పండు ఇవ్వు అని అడిగేవాళ్ళం. వెంటనే పండు పడితే అదేదో మా మాట విని పడేసింది అనుకునేవాళ్ళం. చాల పళ్ళు క్రింద పడేవి. అన్ని పంచుకుని తినే వాళ్ళం.
మా అమ్మమ్మగారి ఇంట్లో ఇంట్లో నెమల్లు పావురాళ్ళు ఇంకా రంగు రంగుల పక్షులు పెంచే వాళ్ళు. కాని నాకు మాత్రం ఇష్టమైనవి పిచుకలు, కాకులు. పిచుకలంటే చాల ఇష్టం. అవే నాకు నేస్తాలు. మీలో చాలా మందికి కూడా అవి అంటే ఇష్టం కదూ?
ఉదయాన్నే, వంటింటి వెనుక ఉన్న వసారలోనో లేదా ముందు ఉన్న వసరలోనో గుంపులు గుంపులుగా వచ్చి గోల చేస్తూ ఉండేవి. వాటి కోసం ఎప్పుడు మా అమ్మమ్మ కొంత ధాన్యపు గింజలు వెదజల్లేది. నూకలు, ఇతర ధాన్యపు గింజలు పెరడులో చిన్ని బుట్టలలో ఉంచేది. లేదా పనికిరాని పాత్రలలో పోసి ఉంచేది. వేసవిలో మట్టి ముకుళ్ళలో నీళ్లు నింపి అక్కడక్కడ ఉంచేది. నుతి గట్టు దెగ్గర బొక్కేనలో నీళ్లు పెట్టి ఉంచే వాళ్ళు.
నీటిలో ఆ పిచుకలు జలకాలడుతుంటే మాకు చాలా వింతగా ఉండేవి. ఇంట్లోనూ వసారాలో పెంకుల క్రింద దూలాలలొ ఎన్నో గుళ్ళు పెట్టేవి. వాటి లో గుడ్లు, అవి తరువాత పిల్లలుగా మారడం, వాటికీ ఏ పురుగో ధాన్యపు గింజలో తల్లి తండ్రి తెచ్చి నోట్లో పెట్టడం...ఇవ్వన్ని మాకు వింతలూ.
ముఖ్యంగా మా అమ్మమ్మగారి ఇంట్లో పెద్ద అద్దం ఉండేది. అప్పట్లో టేకు చెక్కలో నవిషీలు చెక్కి అందంగా ఉండేది. ఆ అద్దంలో తన ప్రతి బింబాన్ని చూసుకుని అవి వేరే పిచుకలనుకుని ముక్కు నుండి రక్తం కారేదాకా అద్దాన్ని పొడవటం చుస్తే అబ్బో ఎంత కోపమో అనుకునేవాళ్ళం.
మేము ఉన్న ఉళ్లలో కూడా చాలా చూసే వాళ్ళం. ఒక 10 ఏళ్ళ క్రితం వరుకు మా ఇంట్లో కూడా అవి తిరగాడుతూ ఉండేవి. ఉన్నట్లుండి మాయం అయిపోయాయి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అవి మన నేస్తాలు. మనికి మేలు చేస్తాయి.
విచక్షణ రహితంగా పోలాలో రసాయన పురుగుల మందు వాడటం, విత్తాన్న శుద్ధికి రసాయన మందులు వాడటం, పిచుకలకు వాసయోగ్యమైన పాడుబడిన భవనాలు లేదా తుప్పలు, పొదలు, చెట్లు, లేకపోవటం కొన్ని కారణాలు. మన ఇళ్లు కూడా ఒకప్పుడు, దూలాలు, పెంకులతో ఉండేవి. ఇప్పుడు ఈ సిమెంట్ కట్టడాలలో వాటికి స్థలం ఏది? వేరే పక్షులతో తిండికి పోతిపడటం, unleaded petrol వాడకం సెల్ టవర్ల నుండి వేలు బడే రేడియో తరంగాలు వంటివి కూడా కారణాలే.
పిచుకల గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ లో చూడండి
పిచుకలను మనం రక్షించుకోకపోతే మన ప్రకృతిని రక్షించుకోలెం. మరి ప్రకృతి లేక పొతే మన మాటేంటి. మన తరువాతి తరాలు పిచుకలంటే జూలో చూడాలేమో? అసలు అదీ సాధ్య పడదేమో? దయ చేసి మీరు ఆలోచించండి. మార్చి 20 న Save Sparrow Day గా జరుపుకుంటాం ప్రతి ఏడాది.
నా వంతు గా నేను కొంత చేస్తున్నాను. మరి మీరు? ఈ క్రింది లింక్ లో చూడండి. మీకు నచ్చిన విధంగా మీ వంతు చేయండి.
అంతే కాదు మీ చుట్టాలు, మీ స్నేహితులు, మీకు తెలిసిన వాళ్ళు -అందరిని జాగృతం చేయండి. ప్రతి చిన్న అడుగు, ప్రతి చిన్న చేయి, చేయుతమవుతుంది మన నేస్తలను మళ్లీ మన మధ్యన నిలపటానికి.
మీ...అనామిక....
2 comments:
మీ బాల్యం లాగే నాదికూడా ఈ రోజే ఓ 10 పుటలు వ్రాసుకున్నాను.బ్లాగులో ఉంచటానికి.మీ ఆవేదన నిజమే ఇళ్ళ మీద cell tower వుంటే మనుషులకే ప్రమాదం .మనిషి వికృతమయిన క్రీడకు ప్రకృతి అంతా బలి అవుతుంది.చక్కగా వ్రాశారు.మా బళ్ళో ఎన్ని పిచుకలో !వాటిని సంరక్షించాలి.
Dhyanavaadaalandi.
Post a Comment