మీకు తెలుసా? మన రాష్ట్రంలో పిచుకల సంఖ్యా 80% తగ్గిందని ఒక అంచనా. రాబందులు, సైబీరియన్ క్రేన్...ఇలా ఎన్నో. కొన్ని అసలు లుప్తమైపోతే కొన్ని దాదాపుగా ఆ దశకు చేరుకుంటున్నాయి. ఈ లింక్ లో చూడండి:
వీటన్నిటికి కారణం మానవుని స్వార్ధం, అత్యాశ, విచక్షణా రహితంగా అడవులు, చెట్లు నరికి వేయటం, అడవులను నరికి వేసి, సాగు భూములుగా వాడటం, చెట్లు నాటకపోవటం ఇలా ఎన్నో.
ఇప్పుడైనా కళ్ళు తెరిచి, మనం కొంతైన పశు పక్షాదులని ఆదుకోవాలి. ముఖ్యంగా నగరాలలో పట్టణాలలో వీటికి తిండి నీరు దొరకదు. పిచుకలు, చిన్న చిన్న పక్షులు, చిలకలు ఇలాంటివాటికి పళ్ళు గింజలు కావాలి.అసలు మన నగరాలలో మొక్కలే పెంచట్లేదు. ఇహ చెట్లా?
మీరు ఉన్నది చిన్న ఇల్లైన, ఫ్లాట్ అయిన గుప్పెడు ధాన్యపు గింజలు, గుక్కెడు మంచినీళ్ళు అందుబాటులో ఉంచ గలిగితే చాలు. కొన్ని పళ్ళ ముక్కలు కూరల ముక్కలు పెట్టవచ్చు.
స్థలం ఉంటే మొక్కలు నాటండి, చెట్లు పెంచండి. చిన్న కుండీలలో అయిన సరే.
పూల మొక్కలు, తుమ్మెదలు, సీతాకోక చిలకలు, తేనెటీగలు సందడి చేస్తాయి. పళ్ళ మొక్కలుంటే, చిలుకలు ఇతర పక్షులు మిమ్మలిని పలకరిస్తాయి.
ధాన్యం గింజలు తినే పక్షులకి నీరు చాల అవసరం. అంతే కాదు వేసవిలో తాపం నుండి రక్షణకు నీళ్ళలో ఒక మునకైన అవసరం. లోతు ఎక్కువలేని వెడల్పు గల మట్టి ముకుళ్ళ లో నీళ్లు పోసి పెట్టవచ్చు.
ఇవిగో నేను మా ఇంట్లోని తోటలో, కిటికీలలో ఇలా చాలా చోట్ల పెడతాను:
ఇలా మూకుడులో గింజలు, నీళ్లు పెట్టచ్చు.
లేదా ప్రమిదలో
పనికిరాని డబ్బాలలో...శుబ్రం చేసి పెట్టండి.
ఇంకా ఓపికుంటే ఇలాంటి అందమైన మట్టి పాత్రలను మీ తోటలో పెట్టుకోవచ్చు.
ఏవైనా ఈ పాత్రలను తరుచు శుబ్రపరిచి, శుబ్రమైన నీరు గింజలు ఉంచాలి. ఇలా తరుచు చేస్తూ ఉంటే, పక్షులు, ఉడుతలు వంటివి మనని పలకరిస్తాయి.
మరి చేస్తారుగా?
మీ...అనామిక....
No comments:
Post a Comment