ఈ శీర్షికలో నాతో క్విల్లింగ్ (Quilling) అనే పేపర్ క్రాఫ్ట్ -కాగితాలతో చేసే కళాకృతులను నేర్చుకోండి. ఇది చాలా అందమైన అద్భుతమైన కళ. చాలా సులభంగా చేసేయచ్చు.
క్విల్లింగ్ అంటే: కాగితపు పీలికలను చుట్టలు చుట్టి, అలంటి చుట్టలను వివిధ ఆకృతులలోకి వంచి, మనకు కావలసిన ఆకారంలో/డిజైన్లో అమర్చి, ఒక ఆధారంఫై (background) అతికించి తయారు చేసే కళ. ఇందులో 3D ఆకృతులు కుడా ఉంటాయి.
ఈ కళ లో పూర్వం క్విల్ అంటే పక్షి ఈకలను (పెద్దవి) ఈ ఆకృతులు తాయారు చేయటానికి వాడేవారట. అందుకే క్విల్లింగ్ అనే పేరు వచ్చింది. ఈ ఈకలను ఘంటంలా (పెన్ను) కూడా వ్రాయటానికి ఉపయోగించే వారని మనకు తెలుసుగా.
ఈ కళని పేపర్ ఫిలిగ్రీ అని కుడా అంటారు.
క్విల్లింగ్ పుట్టు పూర్వొత్తరాలు:
ఈ కళ ఎప్పుడు ఎలా పుట్టిందని ఖచ్హితంగా తెలియదు. కొందరు కాగితం చైనాలో పుట్టింది కాబ్బట్టి అక్కడే క్విల్లింగ్ కూడా పుట్టిందని అంటారు. ఫ్రెంచ్, ఇటాలియన్ నన్నులు/మొన్క్స్ (సన్యాసులు) ఈ కళకి ప్రాణం పోశారు అని అంటారు.
మీకు బంగారం వెండి వంటి ఖరీదైన లోహాలతో ఫిలిగ్రీ వస్తువులను, ఆభరణాలను చేస్తారని తెలుసుకదా. అది చాలా ఖరీదైనది. మన దేశంలో ఇప్పటికి వెండి/ బంగారం ఫిలిగ్రి వస్తువులు, ఆభరణాలు తయారు చేస్తారు. ఇవి అందరికి అందుబాటులో ఉండవు. కేవలం ధనవంతులు మాత్రమే కొని ఆనందిచగలరు.
అందుకని తక్కువ ఖర్చుతో ఈ కళను అందరికి అందుబాటులో ఉండేందుకు ఇనుముతో చేసేవారట. ఎక్కువగా, బాల్కనీ రైలింగ్స్ గాను, కిటికీలకి , తలుపులకీ - ఐరోపా దేశస్తులు -ఫ్రాన్సు, ఇటలీ మొ|| వారు వాడేవారు. అయితే అవి తయారు చేసే ముందు ఇలా కాగితాలతో తయారు చేసి డిజైన్ ఎలా ఉంటుందో అని చూసేవారట. ఇదే తరువాత క్విల్లింగ్ కళగా రుపొందిందంటారు.

18 వ శతాబ్దంలో ఈ కళ ఐరోపాలోని ధనవంతులైన మహిళలు చాల ఆదరించారని అటు తరువాత అమెరికాకు పాకిందని అంటారు.
తరువాత ఈ కళను ఆదరించేవారు కరువైయ్యారు. కాని ఇప్పుడు మళ్లి ఈ కళ ప్రాచుర్యాని పొందుతోంది. వచ్చే టపాలలో ఈ కళకి కావలసిన సామగ్రి, మొదటగా నేర్చుకోవలసిన ప్రాథమిక ఆకారాలు మొ|| నేర్చుకుందాం.
ఈ కళాకృతులను రంగు రంగుల కాగితపు స్ట్రిప్స్ తో తయారు చేసారంటే నమ్మగలమా ?
ఈ కళాకృతులను రంగు రంగుల కాగితపు స్ట్రిప్స్ తో తయారు చేసారంటే నమ్మగలమా ?
మనమూ చేద్దాం వచ్చే టపాలలో .......
మీ...అనామిక....
1 comment:
వావ్! ఎంత బాగున్నాయో! అసలిలా కాదు కానీ ఒకసారి అవన్నీ పట్టుకుని మీ ఇంటికి వచ్చేస్తాను.
Post a Comment