సూర్యుడు, భాస్కరుడు, భానుడు, రవి, దినకరుడు, దివాకరుడు, ఆదిత్యుడు, మార్తాండుడు, మిత్రుడు ఇలా ఎన్నో నామాలు. సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవమని, కర్మ సాక్షి అని అంటారు. మనం సూర్య నారాయణ మూర్తి అని కొలుస్తాము.
స్వామికి అర్ఘ్యం అంటే ఇష్టం. కాని అందరికి అర్ఘ్యం ఇవ్వటం కుదరదు కదా. అందుకే నమస్కారం చేస్తే చాలు.
అయన నమస్కార ప్రియుడు కూడా. ఈ స్తోత్రం రోజు మూడు కాలాలో పఠిస్తే మంచిది. లేదా రొజూ పూజ చేసే సమయంలో ముమ్మారు పఠించినా చాలు. ముఖ్యంగా ఆదివారం స్వామికి నమస్కారం చేసి ఈ శ్లోకం పఠిస్తే మంచిది.
సూర్యుడు జ్యోతిశ్శాస్త్రము ప్రకారము పితృ, నేత్ర, ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడు. అంతే కాదు, ఆరోగ్యానికి కూడా. అందువల్ల సూర్యునికి నమస్కారం చేసి ఈ శ్లోకం పఠిద్దాం .
మీ...అనామిక....
No comments:
Post a Comment