Thursday, 15 August 2013

రంగవల్లి -159

వర లక్ష్మి వ్రతం స్పెషల్ 

21 చుక్కలు 3 వరుసలు, సరి చుక్క 3 వరకు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, జేగురు రంగు వాడాను.-శుభకార్యం కదా. కొద్దిగా నిలం రంగు వాడాను-అన్ని రంగులు చాలా బ్రైట్ గా ఉన్నాయని. 

ఇది మంగళ వారాలకు కూడా వేసుకొవచ్చును. 

లక్ష్మి దేవి కటాక్షము మన అందరి పైన ఉండాలని, విద్య, ధన, వస్తు, వాహన, ఆయురారోగ్య-ఐశ్వర్యములు కలిగి మనం అందరం చల్లగా ఉండాలని కోరుకుంటో ...... 

మీ...అనామిక....

Wednesday, 14 August 2013

రంగవల్లి-158

ఆగష్టు 15- స్వాతంత్ర  దినోత్సవం స్పెషల్ 

మధ్యన 13 చుక్కలు 5 వరుసలు. 4 చుక్కలు అటు ఇటు వదిలి 5 చుక్కలు 4 వరుసలు. చిన్న ముగ్గు కావాలనుకునే వారు, మధ్యలో నున్న ఝండా-దీపాలు(5X5) వేసుకోవచ్చు. 
13X13 చుక్కలు 

పైన ఉన్న 13X13 కి- ఝండాలు -5 చుక్కలు 4 వరుసలు చప్పున అన్ని వైపులా పెట్టు కోవాలి 

          మీ అందరికీ       
  స్వాతంత్ర దినోత్సవ 
         శుభాకాంక్షలు     

మీ...అనామిక....

Tuesday, 13 August 2013

ఆణి ముత్యాలు -7


మనం మనకి చెప్పని/అందని క్షమాపణలను అంగీకరించినప్పుడే మన జీవితం సుగమ మౌతుంది. (నాకు అంత బాగా తర్జుమా చేయటం రాదు.)

జీవితం హాయిగా బతికేయటానికి ఇది ఒక చిట్కా. మనకి ఎవరైనా కష్టం కాని నష్టం కాని కలిగించినప్పుడు, వారి మిద మనకు కోపం కలగటం సహజమే. మనమూ  మనుషులమేగా. వారు తమ తప్పును తెలుసుకుని మనకు క్షమాపణలు చేపితే సరే. లేదంటే మనకు బాధ కసి రెండూ కలగవచ్చును. అయితే కాలమే ఆ గాయాన్ని మన్పుతుంది. 

కాని కొంత మంది ఆ విషయాన్నే పడే పదే గుర్తుకు తెచ్చుకుని లోలోనే రగిలిపొతారు. కసి కాస్తా  ద్వేషంగా మారుతుంది.  పగ ద్వేషాలతో రగిలిపోయే హృదయం అల్లకల్లోలంగా ఉంటుంది. విచక్షణ కోల్పోతుంది.

ఇంకొక అడుగు ముందుకి పడితే ప్రతీకారం తీర్చుకోవాలని కుడా అనిపిస్తుంది. కొంతమంది ఆవేశపరులు తీర్చుకుంటారు కూడా. అయితే దీని వలన నష్ట పోయేది మనమే అని ఎంత మంది ఆలోచిస్తారు? 

మనకు మానసిక ప్రశాంతత ఉండదు. దిని వలెనే అనేక రోగాలు వస్తాయి- బీపి, షుగరు, కేన్సర్, హార్ట్ ఎటాక్ వంటివి. ప్రతీకార చర్యగా కొట్టుకోవడమో, చంపుకోవడమో జరిగిందంటే, ఇహ జీవితం అయిపొయినట్లే. పోలీస్ స్టేషన్, కోర్ట్ , జైలు -వీటిలో చిక్కు బడి పోతాం. 

అదే మనం ఎదుటివారి తప్పులని వారు క్షమాపణ చెప్పక పోయినా, వారిని క్షమించి వదిలేస్తే మనకి మంచిది. క్షమా అనేది చాల గొప్ప గుణం అని అన్ని మాతాలు బోధిస్తాయి. ఇది చెప్పినంత తేలిక కాక పోయినా, ఆచరిస్తే మన జీవితమే హాయిగా ఉంటుంది. లేదా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వారం అవుతాము. 


మీ...అనామిక....

Monday, 12 August 2013

రంగవల్లి - 157

శ్రావణ మాసం స్పెషల్

21 నుండి 1 సరి చుక్క. చివర కావాలంటే, కొబ్బరి పీచుకి, అన్ని వైపులా   1 చుక్క అదనంగా పెట్టుకోండి. కలశం, స్వస్తిక, పద్మం అమ్మవారికి ఇష్టమైనవి. అందు వలన ముగ్గు లో అవి వాడాను. 

మరిన్ని వచ్చే టపాలలో .... 
మీ...అనామిక....

Sunday, 11 August 2013

రంగవల్లి -156

శ్రావణ మాసం స్పెషల్ 

శ్రావణం వచ్చేసింది.  మంగళవారాలు గౌరి దేవికి , శుక్రవారాలు లక్ష్మి దేవికి  మనం పూజ చేస్తాం. ముఖ్యంగా ఈ పూజకి కలశం పెట్టుకుంటాం. కాబ్బట్టి, నేను ఈ ముగ్గులకి "కలశం" అనే అంశానికి ప్రాధాన్యతను ఇచ్చాను. 

ముందుగా కలశం ఎలా గిసానో చూడండి. వీటిలో ఇంకా రక రకాలుగా గిసినవి ఉన్నాయి. అవి తరువాతి టపాలలో చూపిస్తాను. ఇలా ఒక్క కలశం పూజ మందిరం ముందర గాని, లేదా హాల్ లో మధ్యన గాని  గిసి, రంగులు నింపితే బాగుంటుంది. అలాగే పెద్ద ముగ్గులు వేసుకో లేని వారు, ఇంటి ముందర కూడా గిసుకోవచ్చును. 

మరి  ముగ్గులు తరువాతి టపాలలో చూడండి ..... 

మీ...అనామిక....

Saturday, 10 August 2013

ఆణి ముత్యాలు -6

ఇది రోజుకి ఒక సారైనా గుర్తుచేసుకో తగ్గ ఆణి ముత్యం. ముఖ్యంగా ఎప్పుడైనా నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు తప్పక గుర్తు చేసోకోవాలి. 

నేను ఎప్పుడైనా నిరాశ- నిస్పృహలకు లోనైనప్పుడు ఇలాంటి మంచి మాటలను చదివి ఉత్తేజం పొందుతాను. 

ప్రతీ వ్యక్తీ తన జీవితంలో కొన్ని మంచి పనులు చేసి ఉండవచ్చు. ఏంతో కొంత ఘనత సాధించి ఉండవచ్చు.  ఎన్నో కష్టాలను ఓర్చు కుంటో, అడ్డంకులను అధిగమించి, శ్రమించి ఈ విజయాలను సాధించి ఉంటారు. అప్పుడప్పుడు ఇలా మనం సాధించిన విజయాలను, వాటి కోసం పడిన కష్టం, తపన నెమరు వేస్తే మనకి నూతన ఉత్సాహం  వస్తుంది. అబ్బో అప్పుడు అంత  చేయగలిగితే, ఇప్పుడు మనం చేసేది ఎంత అనిపిస్తుంది.  ఏదైనా చేయగలం అని అనుకుంటాం. 

అలాగే ముందు ముందు మనం ఇంకా చాలా సాధించ గలం  అని మన మీద,  స్వశక్తి పైన, మనకి  నమ్మకం ఉండాలి. భగవంతుని(నమ్మేవారు) పైన కూడా నమ్మకం ఉంచాలి. ఇలాగే మహాత్ములంతా ఎంతో  సాధించగలిగారు. మనం కూడా వారి బాటలో నడుదాం. 


మీ...అనామిక....

Wednesday, 7 August 2013

అమ్మమ్మ చిట్కాలు -9

షాంపు తో-1

మొన్న ఒక రోజు మా పక్కింట్లో ఉన్న పంకజం గారి ఇంటికి వెళ్ళాను. తనూ, నేను చిన్ననాటి స్నేహితులం. నేను వెళ్లే సరికి పంకజం, తన మనమరాలు  లావణ్యతో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని మాట్లాడుతోంది. నన్ను చూడగానే పంకజం నవ్వుతూ అహ్వనించింది. నేను ఒక కుర్చీ లాక్కుని కూర్చున్నా. 

ఇంతలో పంకజం కోడలు లక్ష్మి వంటింట్లోంచి తొంగి చూసి "బాగ్గున్నారా అండీ?" అని ప్రేమగా పలకరించింది. "ఆ బాగున్నానమ్మా. ఏమిటి విశేషాలు?"అని అడిగా. " మీరు అత్తయ్య తో మాట్లాడుతూ ఉండండి కాఫీ తెస్తాను" అని   బదులు చెప్పి వంటింట్లోకి అదృశ్యం అయ్యింది. 

నేను పంకజం కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉండగానే కాఫీ తీసుకొచ్చి ఇచ్చి "ఇప్పుడే వస్తాను" అని వంటింట్లోకి వెళ్ళింది. అప్పుడు చూశాను పంకజం ముందర టేబుల్ పైన బోలెడు షాంపూ పేకట్లు ఉన్నాయి-అవేనండి, రూపాయికి, రెండు రూపాయలకి అమ్ముతారు చూశారా అవి. 

"ఏంటి ఇన్ని పేకట్లు?"  అని అడిగాను. లావణ్య అందుకుంది "అదికాదు అమ్మమ్మగారు మా స్టోర్ రూమ్ క్లీన్ చేస్తుంటే ఇవి దొరికాయి. సబ్బు, పేస్ట్ లేదా పవుడరు తోనో ఫ్రీగా వచ్చినవి. వీటిని ఏం  చేస్తాము చెప్పండి? పారేద్దామని నేను, ఇన్ని డబ్బులూ, వస్తువులు  వేష్ట్ చేయకూడదని మా బామ్మా వాదించుకుంటున్నాము". 

"అవునమ్మా, పారేయటం ఎందుకు? వీటిని రక రకాలుగా ఉపయోగించ వచ్చును" అన్నా నేను. అయితే చెప్పండి ఎలాగో అంది లావణ్య . మరి నేను చెప్పినవి ఏమిటో మీరు చూడండి: 

మంచివి, ఖరీదైనవి, బ్రాండెడ్, సాఫ్ట్ లేదా బేబీ షాంపు వంటివి ఎక్స్ పైరి  డేటు చూసి ఒక పక్కన పెట్టుకోండి. వాటిని ఇలా వాడచ్చు: 

 • ఇంట్లో ఎవైరనా వాడుకోండి. ఎప్పుడూ  వాడే  షాంపు ఎంత కడిగినా, వాడిన ప్రతీ సారీ మన జుట్టు పైన కొంచెం ఉండి  పోతుందట. అందువలన వేరే షాంపు  పెట్టి తలంటుకోవాలని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలా వాడుకోవచ్చు . 
 • మొగవాళ్ళకి తక్కువ జుట్టు ఉంటుంది కాబట్టి మంచి షాంపు  పేకట్లు వాళ్ళు వాడుకోవచ్చును. 
 • ఇంటికి వచ్చిన అథితులకు కూడా వాడుకోవడానికి ఇవ్వవచ్చు. 
 • మనం ప్రయాణాలు చేసేటప్పుడు వాటిని వెంట తీసుకు వెళ్ల వచ్చు. బరువు తక్కువ, ఒలుకుతుందన్న భయం ఉండదు. 
 • లిక్విడ్ సోప్ అంటే బాడీ వాష్ లాగా వాడ వచ్చును. 
 • కొద్దిగా (సాఫ్ట్ లేదా బేబీ)షాంపు లో, తగినంత చక్కిర (మరి గండ్రగా ఉండ కూడదు. సన్నగా ఉండాలి)/టేబుల్ సాల్ట్/సీ సాల్ట్/ బొంబాయి రవ్వ-ఏదో ఒకటి  వేసి, ముఖానికి, శరీరానికి స్క్రబర్ లాగా వాడవచ్చును. మరీ గట్టిగా కాకుండా సున్నితంగా రుద్దాలి. ఉప్పు మాత్రం మండుతుంది సుమా. 
 • పెడిక్యూర్/మేని క్యూర్ కి వాడుకోవచ్చును. ఇవి మురికి తొలగించటమే కాక చర్మాన్నిమృదువుగా చేస్తాయి. 
 • సాఫ్ట్ లేదా బేబీ షాంపూ ఫేస్ వాష్ లా వాడ వచ్చు. ముక్యంగా డ్రై చర్మం కలవారు. 
 • సాఫ్ట్ లేదా బేబీ షాంపూ మేకప్ తీసివేయటానికి వాడ  వచ్చు. 
 • సాఫ్ట్ లేదా బేబీ షాంపూ మేకప్ బ్రషులు వంటివి శుభ్రం చేయటానికి వాడ  వచ్చు. 
 • సాఫ్ట్ లేదా బేబీ షాంపూ పెట్స్ స్నానానికి వాడ  వచ్చు. 
 బ్రాండెడ్ కానివి, డేటు అయిపోయినవి ఇలా వాడుకోవచ్చును 
 • చేతులు కడగటానికి  హ్యాండ్ వాష్ లాగా ఉపయోగించు కోవచ్చు. 
 • చేతికి అంటిన నూనె, మరకలు, వంటివి చక్కగా కడిగి వేస్తాయి. 
 • పెయింట్ మరకలను, దుస్తుల పైనుండి కాని చేతుల నుండి కాని కడిగి వెయ వచ్చు. 
 • చేతి రుమాళ్ళు ఉతకవచ్చును.
 • లో దుస్తులు కూడా ఉతక వచ్చు. 
 • ఉన్ని దుస్తులు, షాల్స్  ఉతక వచ్చు. సాఫ్ట్ లేదా బేబీ షాంపూ అయితే మంచిది. 
 • పట్టు లేదా ఖరీదైన బట్టలు ఉతక వచ్చు. సాఫ్ట్ లేదా బేబీ షాంపూ అయితే మంచిది. 
 • సాక్సు, టైట్స్ వంటివి ఉతక వచ్చును. 
 • బాత్రూం లో సింక్, బాత్ టబ్, అద్దం వంటివి శుభ్ర పరచ వచ్చును 
 • బాత్రూం టైల్స్ కి పట్టిన జిడ్డు, మురికి షాంపుతో  బాగా వదుల్తాయి. 
 • అలాగే వంటింట్లోని, సింక్, గట్లు, నేల, టైల్స్ వంటివి శుభ్ర పరచవచ్చు. 
 • జుట్టుకి స్ప్రే వాడేవారు, ఆ స్ప్రే గోడల మిద  కాని, డ్రెస్సింగ్ టేబుల్ మిద కాని పడితే దానిని శుభ్రం చేయటానికి వాడ  వచ్చు. 

గమనిక: చుండ్రు ని అరికట్టే షాంపూ(పాదరసం లాంటి కెమికెల్స్ ఉండవచ్చు)  లేదా కండీషనర్ ఉన్న షాంపూ(ఇవి జిడ్డుగా ఉండవచ్చు) మాత్రం పైన చెప్పిన వాటిలోని కొన్నిటికి పనికి రావు. 

మరి కొన్ని తరువాతి టపాలలో ..... 


మీ...అనామిక....

ఆణి ముత్యాలు - 5


చిన్న సందేసమే కాని ఇందులో జీవిత సత్యం దాగి ఉంది. 

గతాన్ని,  గతించిన కాలాన్నీ విడిచిపెట్టాలి. అయ్యిందేదో అయ్యింది. దానిని తిరిగి తీసుకు రాలేం కదా. వర్తమానానికి మనం లొంగి పొవాలి. అంటే వర్తమానం మన చేతులో ఉంది. దానిని పూర్తిగా అనుభవించాలి.  ఏమి చెయ్యాలన్న ఇప్పుడు ఈ క్షణం మనది. ఈ క్షణం గడిస్తే అది గతం. మన చేతుల్లో లేదు. అలాగే రాబోయే కాలం-భవిష్యత్తు-దానిలో అంతా మంచే జరగాలి, జరుగుతుంది అన్ని నమ్మాలి. అదే ఆశ. ఆశ లేనిదే మనిషి లేడు. 

గతించిన నిన్నని   వదిలి, ఈ క్షణం/ఈరోజు లో లీనమై, రాబోయే రేపు లో నమ్మకం/ఆశ  కలిగి  ఉంటే  మన జీవితం సుఖమయం కాదా ? 

మీ...అనామిక....

Tuesday, 6 August 2013

పండంటి జీవితానికి ......

15 సూత్రాలు -3

3. Give up on blaming others: ఇతరులపై నిందలు వేయటం అపాలి. 

మనం సాధారణంగా మనకు జరిగిన కష్ట-నష్టాలకు ఇతరులను దోషులను చేస్తాం. ఇతరులను కారణంగా చూపించి, మన వైఫల్యాలకు వారిని బాధ్యులను చేస్తాం. ఇలా చేసి హమ్మయ్య మన తప్పు లేదు అని అనుకుంటాం. ప్రతి వైఫల్యానికి పరిస్థితులనో, సమాజాన్నో లేదా ఇతరులనో దోషులుగా నిలబెడతాం.  అది ఆత్మా వంచన- మనని మనము మోసం చేసుకున్నట్లే.  మనం చేసిన పనులకు మనమే బాధ్యులం అన్నది సత్యం. ఇదేగా మన పెద్దలు చెప్పిన కర్మ సిద్ధాంతం కూడా. 

సమయానికి చేరుకో లేక పొతే ట్రాఫిక్ ను నిందిస్తాం. అంతే కాని మనం తొందరగా బయలుదేరవచ్చుగా అని అనుకోం. మార్కులు తక్కువ వస్తే అధ్యాపకులను, జీవితంలో ఆశించిన ఎత్తుకు ఎదగ లేక పొతే తల్లి-తండ్రులను, సమాజాన్ని నిందిస్తాం. అయితే దీని వలన ఏమి సాధిస్తాం? 

దీని వలన మనకే నష్టం. మనం చేసిన తప్పొప్పులను మనం గ్రహించగలిగితే, మనని మనం సరిదిద్దుకుని సరి అయిన మార్గంలో ముందుకు పోగలుగుతాం.  

ఒక వేళ నిజంగా ఎవరివల్లనైన నష్టం జరిగినా, వారిని నిందిస్తూ కూర్చుంటే లాభం ఉండదు కదా. మనం తప్పు చేసినా సరే, ఈ సూత్రం వర్తిస్తుంది. చేసిన తప్పును తెలుసుకుని దానినుండి మనం పాఠం నేర్చుకుని ముందుకు సాగిపొవాలి. అంతే  కాని మనని మనం నిందిస్తూ కూర్చుంటే ఎలా? 

పరిస్థితులు కాని, సమాజం కాని లేదా మన చుట్టూ ఉన్నవారు కాని మనని నిరంతరం ప్రభావితం చేస్తూ ఉంటారు. మంచి-చెడు రెండూ ఉంటాయి. ఎంతోమంది ఎన్నో చెప్తారు. అన్ని విని పరికించి మంచి-చెడ్డ అలోచించి ఆచరణలో పెట్టాలి. ఏదైనా క్రియ చేసేది మనమే కాబ్బట్టి, దాని ఫలితం కూడా మనమే అనుభవించాలి. 

మంచి చెడు తేడాలను తెలుసుకోగల తెలివిని మానవులకు మాత్రమే ప్రసాదించిన వరం. మరి మనకిచ్చిన తెలివితేటలను ఉపొయొగించకున్ద ఇతరులను నిందిస్తూ కూర్చుంటే మనం సంతోషంగా ఉండలేం. 

అందుకని ఈ అలవాటుని మానుకుని మనం చేసిన/చేస్తున్న క్రియను, తీసుకున్న నిర్ణయాలను విశ్లేషించుకుని ఎక్కడ తప్పు చేసామో చూసుకుని, మనకున్న పరిధిలో మనని మనం సరి అయిన మార్గంలో పెట్టుకుంటే విజయాలు తప్పక మనవే. 

నేనూ ఈ నిజాన్ని ఆలస్యంగా ఒప్పుకున్నా. కొంత వరకు ఆచరణలో పెట్టా. ఏదైనా అలవాటు, అదీ చెడు అలవాటు తొందరగా మార్చలేము కదా. దీని వలన కొంత వరకు ప్రశాంతత పొందా,  ప్రగతిని సాదించా. 

కొన్ని సందేశాలు మీ కోసం:

All blame is a waste of time, no matter how much fault.

Blaming others is excusing yourself. 

Never blame any one in life:
Good people give happiness,
Bad people give experiences,
Worst people give a lesson,
Best people give memories.

మరి మీరు నాతొ ఏకిభావిస్తారా ?


మీ...అనామిక....Monday, 5 August 2013

పండంటి జీవితానికి ......

15 సూత్రాలు -22. Give up your need for control: అంతా మన ఆధీనం/స్వాధీనం/అదుపు లో ఉండాలనుకోవటం మానుకోవాలి. 

ప్రతీది మన అదుపులో ఉండదు. మనని మనం అదుపులో ఉంచుకోవడం మంచిదే. మన పిల్లలనో, మన కుటుంబ సభ్యులనో అదుపు చేయడం మంచిదే-అది కొంత వరకు మాత్రమే. అదీ వారు ఏదైనా చెడు త్రోవ పడితే. 

కాని కొంత మంది ఉంటారు -వారికి అందరిని అదుపు చేయాలని ఉంటుంది. తెగ తాపత్రయ పడిపొతారు. ఎదుటి వారి భావాలను, వారి ఇబ్బందిని కాని పట్టించుకోరు. ఇంట, బయట, ప్రతిదీ వారు చెప్పినట్లు ఉండాలనే అంటారు. అది అన్నివేళల సాధ్యం కాదు. అందరు మనం చెప్పినట్లే ఉండాలనో మన మాట వినాలనో అనుకోవటం తప్పు. అది జరగదు. దాంతో చికాకు పడటం, ఎదుటి వారిని తిట్టటం, వారితో పోట్లాడటం చెస్తారు. ఇది మనకే నష్టం కదా. 

అందుకే చైనాకి చెందిన ప్రఖ్యాత తత్వ వేత్త లావ్ డ్జీ (Lao Tse) ఇలా అంటారు: By letting it go, it all gets done. 

అత్తలు, కోడళ్ళు ఒకరి పై ఒకరు, అలాగే కొడుకు/భర్త పైన కంట్రోల్ కోసం పడే పాట్లు మనం చూస్తూనే ఉంటాం. 

ముఖ్యంగా ఇప్పటి యువత ప్రేమ పేరుతో ఎదుటి వారిని వేదించి, విసిగిస్తారు. వినక పొతే దాడులు చేయటం ఎక్కువ అయిపోతోంది. వారి పై దాడి చేసి, వారి జీవితాలని, తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ ఎంత సున్నితమైన భావము, బలవంతంగా ఒకరి మనసులో దానిని పుట్టించగలమా అని ఒక్క క్షణం ఆలొచించాలి. వద్దన్న వారిని వదిలి ముందుకు సాగాలి. ఏమో ఇంతకంటే మంచి వారు మనని ప్రేమించే వారు గౌరవించే వారు ఎదురు పడవచ్చుగా?

అలాగే గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మనికి నష్టాన్ని, కష్టాన్ని కలిగించి ఉండవచ్చు. గతం నేర్పిన పాఠం మనకి గుణ పాఠం కావాలి కాని, గతం లోనే ఉండిపోతే ముందుకు సాగలేము. గతాన్ని వదిలి ముందుకు పోవాలి. 

ఇది చెప్పినంత తేలిక కాదు కాని మనం సంతోషంగా ఉండాలి అంటే ముందుకు సాగక తప్పదు కదా. మహాత్ములు మనకి ఇచ్చిన కొన్ని సందేశాలు చూడండి ;

Letting go does not mean giving up, but accepting that there are things that cannot be.

Giving up does not always mean that you are weak, sometimes, it just means that you are strong enough to let it go.If you love something, let it go, if it comes back to you it is yours. If it does not, it never was and it was not meant to be.

Holding on is believing that there is only a past; letting go is knowing that there is a future.

Sometimes letting go provides you with an opportunity to gain something better.

Life is a balance of holding on and letting go. 

పట్టు-విడుపు తెలిసి ఉండి, దేనిని గట్టిగా పట్టుకోవాలి, దేనిని వదలాలి అని అలోచించి, కొన్ని సార్లు, కొన్ని మనం వదిలి ముందుకు అడుగు వేస్తేనే ప్రగతి. మనం సంతోషంగా సంతృప్తిగా జీవితం అనుభవించగలము. 

మరి మీరు ఏమంటారు?

మిగిలినవి తరువాతి టపాలలో .... 

మీ...అనామిక....