Wednesday, 31 July 2013

పండంటి జీవితానికి ......

15 సూత్రాలు -1


ప్రతి మనిషి తన జీవితం హాయిగా ఎలాంటి కష్టాలు లేకుండా సాగి పొతే  బాగుంటుంది అని అనుకుంటాడు. అసలు కష్టాలు, దు:ఖాలు లేకుండా జివింతం ఉండదు, సాధ్యం కాదు. ఉన్నా మనం ఆనందించ లేము. మన జీవితంలో కష్ట నష్టాలను ఎదురుకుంటో, పరిస్థితులను మనకి కావలసిన రీతిలో మలచుకుంటూ జీవించటం లోనే ఒక ఆనందం, ఒక తృప్తి. అసలు అదే ఒక సవాల్. 

కొన్ని సూత్రాలు పాటిస్తే, జీవితం హాయిగా ఆనందంగా గడపవచ్చు. కొంతైన మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. ఎన్నో సూత్రాలు ఉన్నయి.  

ఇప్పుడు మాత్రం పండంటి జీవితానికి 15 సూత్రాలను చెప్పుకుందాం. 

1. Give up your need to be always right: నేను చెప్పినదే సరి అయినది లేదా నేను చెప్పినదే సత్యం అనే ఆలోచన/పధ్ధతి మానుకొవలి. 

మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏదో ఒక మాట అంటాం. మనం చెప్పింది అక్షరాలా నిజమే అయి ఉండవచ్చును. మనం చెప్పింది మంచి మాటే కావచ్చు. కాని ఎదుటి వ్యక్తి దానిని ఒప్పుకోకపోవచ్చును- సరిగ్గా అర్ధం చేసుకోలేక కాని, తనకు నచ్చక కాని. కొంత మందికి ఎదుటి వారు చెప్పినదంతా ఖండిచడమే పని. ఎదురు వాదిస్తారు. 

మనం మంచికి చెప్పినా ఒకటికి రెండు సార్లు చెప్పి ఊరుకోవాలి. మృదువుగా చెప్పాలి. అలా  కాక వాళ్లతో వాదం పెట్టుకుంటే మాట మాట పెరుగుతుంది. చూస్తూ ఉండగానే చిన్న మాట పెద్దదై పోట్లాటల వరకు దారి తీస్తుంది. బంధువులతో కాని స్నేహితులతో కాని వివాదాలకు పొతే చిన్న మాటతో సంబందాలు తెగే  దాకా రావచ్చును.  

మనం చెప్పిన ప్రతి దానితో ఎదుటి వారు ఏకీభవించాలని లేదు. వారు చూసే కోణం కాని లేదా వారి అనుభవం వలన కాని మనం చెప్పేది వారికి సరి అనిపించక పొవచ్చును. 

కాని కొంతమంది మాత్రం తానూ చెప్పింది ఎదుటి వారు ఒప్పుకున్నాదాకా వదలరు. కొందరు విసిగి పోయి చివరికి వీరు చెప్పినది అయిష్టంగా ఒప్పుకుంటారు. 

ఇలా చేసినందు వల్ల ఆ నిమిషంలో మనం గెలిచినా, వారితో నున్న సంబంధాలు దెబ్బతింటాయి. ఇది భార్య-భర్తల మధ్యన గొడవలకి ఒక కారణం కూడా

అందుకే మన పెద్దలు ఒక మాట అన్నారు: The more arguments you win, the more friends you loose అని. కాబట్టి మనం మరీ  తెగే దాక కాక, మృదువుగా చెప్పి ఒప్పించ గలిగితే సరి. లేదా అంతటితో ఆ మాటను వదిలేయాలి. 

మరి మీరేమంటారు?

వచ్చే టపాలలో మిగిలినవి..... 


మీ...అనామిక....

ఆణి ముత్యాలు - 4


మన కోసం భగవంతుని దెగ్గర :

ప్రతీ  సమస్యకి ఒక సమాధానం, 
ప్రతీ  చీకటికి ఒక చిరు దివ్వె,
ప్రతీ  దు:ఖానికి ఒక సాంత్వన,
ప్రతీ రేపటికి ఒక ప్రణాళిక,
                            ఉన్నది... 
అందుకని సదా  భగవంతుని స్మరిద్దాం ...... 

మీ...అనామిక....

Monday, 29 July 2013

పిల్లల కోసం -2

ఇదిగోనండి ఇంకొన్ని చెవి దుద్దులు పిల్లల/టీన్స్  కోసం. ఇవి బటన్స్ లాగా  ఉన్నాయి. 


ఫైబర్ తో చేసినవి. 

మీ...అనామిక....

Sunday, 28 July 2013

పిల్లల కోసం -1


పిల్లలకి ఎక్కువ ఖరీదు పెట్టి నగలు కొని పెట్టలేము. అసలు బంగారం అయితే  ఇప్పుడు పెట్టాలన్న భయం. అదీ కాక వాళ్ళు డ్రెస్ కి నప్పాలని మాచింగ్ అని గొడవ పెడతారు. లేటెస్ట్ వి కావాలని కొరుకుంటారు. 

మరి పిల్లల కోసం లేటెస్ట్ చెవి కమ్మలు ఇదిగో ఇవి చూడండి:
ఇవి సీతాకోకచిలుకల ఆకారం లో ఉన్నయి. సైజు బాగా చిన్నవి. అన్నీ ఫ్లోరోసెంట్ రంగులె. చిన్న పిల్లలకి, టీన్ ఏజ్ వాళ్ళకి నప్పుతాయి. 

మరి కొన్ని వచ్చే టపాలలో 


మీ...అనామిక....

Friday, 26 July 2013

ఆణిముత్యాలు - 3


రెండే ముక్కల్లో ఎంతో సత్యం చెప్పారు. 

మన జీవితం లో చాలా సమస్యలు రెండిటి వలన కలుగుతాయి - ఆలోచించ కుండా చేసే పనులు, పనులు చేయ కుండా ఆలోచిస్తూ కూర్చోవడం. 

ఆలోచించకుండా ఏ పని చేసినా, అసలు ఒక్క మాట మాట్లాడినా ఎంతో కష్టం. ఒక మాట అనే ముందు ఆచి, తూచి, అలోచించి అనాలని మన పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే అనాలోచితంగా మాటలనేసి ఆ తరువాత నాలిక కర్చుకుంటే ఏమి లాభం? అసలు ఇలాంటి మాటల వలన చాలా నష్టం జరగడం అనేది మనం రోజు ఎదురుకుంటూ ఉంటాం. నోరు జారిన తరువాత అయ్యో అని చెంపలు వేసుకున్న సందర్భాలు ఎన్నొ. ఒక్క మాట మనసుని నొప్పించినంతగా బహుశ ఒక దెబ్బ కూడా నొప్పించక పొవచ్చు. 

ఇహ చేతల విషయానికి వస్తే ఏ పని అయినా అన్ని జాగ్రత్తగా అలోచించి, ఇతరుల(పెద్దలు, అనుభవగ్యులు) సలహా కూడా అవసరమైతే అడిగి మరీ చేస్తేనే మంచిది. దీని వలన శ్రమ, సమయం మరియు డబ్బు వృధా అవకపోవడమే కాక మంచి ఫలితాన్ని పొంద వచ్చు. 

ఆలోచించి చేయాలి కదా అని ఆలోచిస్తూ కూర్చుంటే కూడా నష్టమేగా. కొంత మంది అలా ఆలోచిస్తూ జాప్యం చెస్తారు. ఏ పాటికి ఒక నిర్ణయం తీసుకోరు. ఇది ఇబ్బందే. చేయవలసిన పని సకాలంలో చేయక పొతే చేసినట్లే కాదు కదా. 

అందుకే బాగా అలోచించి, ఉన్న పరిస్తితులను బట్టి సకాలంలో నిర్ణయం తీసుకుని సరి అయిన సమయం లో ఆచరిస్తేనే  సరి అయిన ఫలితం ఉంటుంది. 

మరి మీరేమంటారు ?

మీ...అనామిక....

ఎంబ్రాయిడరి కుట్లు -కావలసినవి-4

3-దారాలు-2

ఇంతకూ ముందు మనం చెప్పుకున్నవి ఇక్కడ ఒకసారి చూడండి :


3. సిల్క్, జరి దారాలు -Silk, Metallic and Zari mixed Threads

పైవి సిల్క్ దారాలు-విచ్చెలు, చేతి తో కుట్టటానికి అనువుగా ఉంటాయి. మనకు కావలసినన్ని పోచలతో కుట్టు కోవచ్చును. రక రకాల రంగులలో దొరుకుతాయి. డబుల్ షేడ్స్ లో కూడా ఉంటాయి. 
ఇవి కూడా సిల్క్ దారాలే కాని మెషీన్ ఎంబ్రాయిడరి కోసం. ఇవి చాలా సన్నగా ఉంటాయి. వీటిల్లో కూడా సింగిల్, డబుల్ ఇంకా మల్టీ షేడ్స్ లో దొరుకుతున్నయి. 
ఇవి నీం జరి దారాలు. సిల్క్ పోచతో పాటు జరి దారం కూడా కలిసి  ఉంటుంది. ఇవి చేత్తో కుట్టటానికి  బాగుంటాయి. 

ఇవి మెటాలిక్ జారి దారాలు. మెషీన్ తో కుట్టటానికి 
ఇవి మెటాలిక్ దారాలు, కొద్దిగా మందంగా ఉండి, చేత్తో కుట్టటానికి అనువుగా ఉంటాయి. 

మరి కొన్ని వచ్చే టపాలలో చెప్పుకుందామా?...... 


మీ...అనామిక....

Thursday, 25 July 2013

I Want To Spend My Lifetime Loving You .....


Mask of Zorro లోని ఈ పాట నాకు చాలా ఇష్టం. Tina Arena, Marc Anthony పాడగా Antonio Banderas, Catherine Zeta Jones పై చిత్రీకరించారు.  ఆ చిత్రం గురించి చదవాలనుకుంటే ఈ లింక్ లో చూడండి

http://en.wikipedia.org/wiki/The_Mask_of_Zorroఆ పాట లోని భావం కాని, ట్యూన్ కాని, పాడిన తీరు కాని మనని ఎక్కడికో తీసుకు వెళుతుంది. ఆహా ప్రేమ ఎంత మధురం అని అనిపిస్తుంది. 

ఆ పాట మీ కోసం .... 

I Want To Spend My Lifetime Loving You .....

Moon so bright, night so fine
Keep your heart here with mine
Life's a dream we are dreaming 
Race the moon, catch the wind
Ride the night to the end
Seize the day, stand up for the light 
I want to spend my lifetime loving you
If that is all in life I ever do 
Heroes rise, heroes fall
Rise again, win it all
In your heart, can't you feel the glory 
Through our joy, through our pain
We can move worlds again
Take my hand, dance with me 
I want to spend my lifetime loving you
If that is all in life I ever do

I will want nothing else to see me through
If I can spend my lifetime loving you 
Though we know we will never come again
Where there is love, life begins
Over and over again 
Save the night, save the day
Save the love, come what may
Love is worth everything we pay 
I want to spend my lifetime loving you
If that is all in life I ever do
I want to spend my lifetime loving you
If that is all in life I ever do
I will want nothing else to see me through
If I can spend my lifetime loving you 

దేశం ఏదైనా, సంస్కృతి ఏదైనా, భాష ఏదైనా,  ప్రేమ ఏంతో పవిత్రమైనది, ఏంతో ఉన్నతమైనది. మీరూ ఈ పాట వింటూ, పాడుతూ ఆనందించండి ..... 


మీ...అనామిక....

Wednesday, 24 July 2013

గురు పాదుకా స్తోత్రం

శ్రీ ఆది శంకరాచార్యులు వారు రచించిన గురు పాదుక స్తోత్రం మీ కోసం: 


సంస్కృత లిపిలో 

अनंत संसार समुद्र तार नौकायिताभ्यां गुरुभक्तिदाभ्यां।
वैराग्य साम्राज्यद पूजनाभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥१॥

कवित्व वाराशि निशाकराभ्यां दौर्भाग्यदावांबुदमालिक्याभ्यां।
दूरीकृतानम्र विपत्तिताभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥२॥

नता ययोः श्रीपतितां समीयुः कदाचिदप्याशु दरिद्रवर्याः।
मूकाश्च वाचसपतितां हि ताभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥३॥

नाली कनी काशपदाहृताभ्यां नानाविमोहादिनिवारिकाभ्यां।
नमज्जनाभीष्टततिब्रदाभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥४॥

नृपालिमौलि ब्रज रत्न कांति सरिद्विराज्झषकन्यकाभ्यां।
नृपत्वदाभ्यां नतलोकपंक्ते: नमो नमः श्री गुरु पादुकाभ्यां॥५॥

पापांधकारार्क परंपराभ्यां पापत्रयाहीन्द्र खगेश्वराभ्यां।
जाड्याब्धि संशोषण वाड्वाभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥६॥

शमादिषट्क प्रदवैभवाभ्यां समाधि दान व्रत दीक्षिताभ्यां।
रमाधवांघ्रि स्थिरभक्तिदाभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥७॥

स्वार्चा पराणामखिलेष्टदाभ्यां स्वाहासहायाक्ष धुरंधराभ्यां।
स्वान्ताच्छ भावप्रदपूजनाभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥८॥

कामादिसर्प व्रजगारुडाभ्यां विवेक वैराग्य निधि प्रदाभ्यां।
बोध प्रदाभ्यां दृत मोक्ष दाभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥९॥

తెలుగు లిపి లో 

అనంత సంసార సముద్ర తార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం
వైరాగ్య సామ్రజ్యద పూజనాభ్యాం  నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం  ॥1॥

కవిత్వ వారాశి నిశాకరభ్యాం దౌర్భాగ్యదావాంబుధమాలికాభ్యాం
దూరికృతానమ్ర విపత్తితాభ్యాం  నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం ॥2॥

నతా యయో: శ్రీ పతితాం సమీయు: కదాచిదప్యాశు దరిద్రవర్యా: 
మూకాశ్చ వాచస్పతితాం హితాభ్యాం  నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం ॥3॥

నాలీ కనీకాశపదాహృతా భ్యాం నానా విమోహాది నివారికాభ్యాం 
నమజ్జనాభీష్ట తతిబ్రదాభ్యాం  నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం ॥4॥

నృపాలిమౌళి బ్రజ రత్నకాంతి సరిద్విరాజ ఝషకన్యకాభ్యాం 
నృపత్వదాభ్యాం నతలోక పంక్తే:  నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం ॥5॥

పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్ర్యయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం
జాడ్యాబ్ధిసంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం ॥6॥

శమాదిషట్క ప్రదవైభావాభ్యాం సమాధి దాన వ్రత దీక్షితాభ్యాం 
రమాధవాంఘ్రి స్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం ॥7॥

స్వార్చా పరాణామఖిలేష్టదాభ్యాం స్వాహాసహాయాక్ష ధురంధరాభ్యాం
స్వాంతాఛ్చ భావ ప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం ॥8॥

కామాది సర్ప  వ్రజగారుడాభ్యాం వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యాం 
బోధ ప్రదాభ్యాం హృత మోక్షదాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం ॥9॥


మీ...అనామిక....

లేటెస్ట్ చెవి దుద్దులు- కమ్మలు -4

లేటెస్ట్ చెవి లోలకులు ఇవి. 

ఇవి మెటల్ పైన చెమ్కి అద్దినట్లుగా ఉన్నాయి, తేలికగా ఉండి వివిధ ఆకారాలలో, రంగులలో  దొరుకుతున్నాయి. సగం సిల్వర్ రంగు సగం వేరే రంగులు ఉంటాయి. గ్లిట్టర్ ఉన్నా చాలా క్లాస్ గా ఉన్నాయి. 

సైజు మాత్రం ఇలా పెద్దగానే ఉన్నాయి. టీన్ ఏజ్ అమ్మాయిలకి నప్పుతాయి. పెద్దవాళ్ళు కూడా ట్రెండీగా కనిపించాలను కునే వారికి ఇవి బాగుంటాయి. ఇప్పుడు అన్ని-దుస్తులు, బాగ్, చెప్పులు, గాజులు - గ్లిట్టర్ (చెమ్కి) ఫ్యాషన్ కాబట్టి, వాటికీ ఇవి బాగా నప్పుతాయి. 

మరి కొన్ని వచ్చే టపాలలో ..... 

మీ...అనామిక....

Monday, 15 July 2013

లేటెస్ట్ చెవి దుద్దులు- కమ్మలు -3

 ఇవిగోనండి ఇవి చూసారా ?

పూసల తో చేసిన లొలాకులు.
నీలం, ఆకుపచ్చ  రంగులు నాకు నచ్చాయి. 
రక రకాల రంగులలో దొరుకుతున్నాయి.  ధర కూడా ఎక్కువ ఏమి కాదు. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకి-టీనేజ్ పిల్లలకి నప్పుతాయి. కొంచెం పెద్దవాళ్ళైన ట్రెండిగా ఉండే నగలను ఇష్ట పడేవారికి నచ్చుతాయి.   దుస్తులకు సరి పోయే రంగులలో కొనుక్కొవచ్చును. 

మరికొన్ని వచ్చే టపాలలో...  చూస్తూ ఉండండి ..... 

మీ...అనామిక....