Showing posts with label చెవి దుద్దులు. Show all posts
Showing posts with label చెవి దుద్దులు. Show all posts

Monday, 29 July 2013

పిల్లల కోసం -2

ఇదిగోనండి ఇంకొన్ని చెవి దుద్దులు పిల్లల/టీన్స్  కోసం. ఇవి బటన్స్ లాగా  ఉన్నాయి. 


ఫైబర్ తో చేసినవి. 

మీ...అనామిక....

Sunday, 28 July 2013

పిల్లల కోసం -1


పిల్లలకి ఎక్కువ ఖరీదు పెట్టి నగలు కొని పెట్టలేము. అసలు బంగారం అయితే  ఇప్పుడు పెట్టాలన్న భయం. అదీ కాక వాళ్ళు డ్రెస్ కి నప్పాలని మాచింగ్ అని గొడవ పెడతారు. లేటెస్ట్ వి కావాలని కొరుకుంటారు. 

మరి పిల్లల కోసం లేటెస్ట్ చెవి కమ్మలు ఇదిగో ఇవి చూడండి:
ఇవి సీతాకోకచిలుకల ఆకారం లో ఉన్నయి. సైజు బాగా చిన్నవి. అన్నీ ఫ్లోరోసెంట్ రంగులె. చిన్న పిల్లలకి, టీన్ ఏజ్ వాళ్ళకి నప్పుతాయి. 

మరి కొన్ని వచ్చే టపాలలో 


మీ...అనామిక....

Wednesday, 24 July 2013

లేటెస్ట్ చెవి దుద్దులు- కమ్మలు -4

లేటెస్ట్ చెవి లోలకులు ఇవి. 

ఇవి మెటల్ పైన చెమ్కి అద్దినట్లుగా ఉన్నాయి, తేలికగా ఉండి వివిధ ఆకారాలలో, రంగులలో  దొరుకుతున్నాయి. సగం సిల్వర్ రంగు సగం వేరే రంగులు ఉంటాయి. గ్లిట్టర్ ఉన్నా చాలా క్లాస్ గా ఉన్నాయి. 

సైజు మాత్రం ఇలా పెద్దగానే ఉన్నాయి. టీన్ ఏజ్ అమ్మాయిలకి నప్పుతాయి. పెద్దవాళ్ళు కూడా ట్రెండీగా కనిపించాలను కునే వారికి ఇవి బాగుంటాయి. ఇప్పుడు అన్ని-దుస్తులు, బాగ్, చెప్పులు, గాజులు - గ్లిట్టర్ (చెమ్కి) ఫ్యాషన్ కాబట్టి, వాటికీ ఇవి బాగా నప్పుతాయి. 

మరి కొన్ని వచ్చే టపాలలో ..... 

మీ...అనామిక....

Monday, 15 July 2013

లేటెస్ట్ చెవి దుద్దులు- కమ్మలు -3

 ఇవిగోనండి ఇవి చూసారా ?

పూసల తో చేసిన లొలాకులు.
నీలం, ఆకుపచ్చ  రంగులు నాకు నచ్చాయి. 
రక రకాల రంగులలో దొరుకుతున్నాయి.  ధర కూడా ఎక్కువ ఏమి కాదు. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకి-టీనేజ్ పిల్లలకి నప్పుతాయి. కొంచెం పెద్దవాళ్ళైన ట్రెండిగా ఉండే నగలను ఇష్ట పడేవారికి నచ్చుతాయి.   దుస్తులకు సరి పోయే రంగులలో కొనుక్కొవచ్చును. 

మరికొన్ని వచ్చే టపాలలో...  చూస్తూ ఉండండి ..... 

మీ...అనామిక....

Monday, 24 June 2013

లేటెస్ట్ చెవి దుద్దులు- కమ్మలు -2

టీనేజ్ అమాయిలకీ,  ట్రెండీ గా కనిపించాలనుకునే వారి కోసం ..... ఫైబర్ జ్యువలరీ 



ఇవి ఫైబర్ తో చేసినవి అనుకుంటాను. బరువు చాల తక్కువ, రకరకాలైన రంగులు, ఆకారాలలో లభ్యం. ధర కూడా తక్కువే. 

మరి కొన్ని వచ్చే టపాలలో ....... 

మీ...అనామిక....

Friday, 21 June 2013

లేటెస్ట్ చెవి దుద్దులు - కమ్మలు -1

ప్రస్తుతం మార్కెట్ లో  ఉన్న లేటెస్ట్ చెవి దుద్దులు,  కమ్మలు 
ముదురు ఆకు పచ్చ , మజెంత రంగులలో .. 
ఇవి రకరకాలైన ఆకారాలలో/డిజైన్ల లో  దొరుకుతున్నయి. కాని రంగులు మాత్రం ఇవే కనిపించాయి మరి.  పెద్ద ఖరీదు కాదు. బాగున్నాయి కదూ ? టీనేజ్ వాళ్ల  నుండి 40+ వరకు కూడా పెట్టు కొవచ్చును. 

మరి కొన్ని వచ్చే టపాలలో ..... 

మీ...అనామిక....