Showing posts with label Atma Paramatma. Show all posts
Showing posts with label Atma Paramatma. Show all posts

Monday, 7 May 2012

రామాయణ ప్రవచనములు


రామాయణం, మహాభారతం, పురాణాలు ఇవి ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటాయి. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ప్రతిసారి ఏదో ఒకటి మనం నేర్చుకుంటాం. 

బ్రహ్మ శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు మనకి సుపరిచితులే. పౌరాణిక సార్వభౌమ, అభినవ వ్యాసాది బిరుదాంకితులు, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు. వారు ధర్మ సందేహాలు తీర్చినా ధర్మ సూక్ష్మాలు వివరించి చెప్పినా చాలా వివరంగా చెపుతారు. ఇక వారి ప్రవచానాలైతే, పండితులైన పామరులైన మంత్ర ముగ్ధులను చేసి కట్టి పడేస్తాయి. గంటల తరబడి వినాలని పిస్తుంది. పిల్లల నుండి పెద్దల దాకా చాలా ఆశక్తిగా వింటారు.
Moserbaer వారు శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి వాల్మీకి శ్రీ మద్రామాయణ ప్రవచనములు డీవిడీ రూపంలో అందిస్తున్నారు. ఇవి 10 డీవిడీలు, చక్కనైన ప్యాక్ లో చాలా తక్కువ ధరలో అందిస్తున్నారు. మన దగ్గెర తప్పకుండ ఉండ వలసిన ఒక ఆణిముత్యం. కావలసినప్పుడల్లా వినవచ్చును/చూడవచ్చును.


పెద్దలకు, పిల్లకు, స్నేహితులకు ఇలా ఎవరికైనా మనం ఇది కొని ఇస్తే ఒక మంచి పుస్తకం కొని ఇచ్చి నట్లే. 

మరి ఇంకెందుకు ఆలస్యం..మీరు ఒక సెట్టు తెచ్చుకోండి....



మీ...అనామిక....

Wednesday, 2 May 2012

సూర్యాష్టకం



సూర్యుడు గ్రహ రాజు. ప్రత్యక్ష నారాయణుడు. అంటే కంటికి కనిపించే దైవం. సూర్యుని కాంతి , వేడి పైనే ఈ భూమి పైన ఉన్న సకల జీవుల జీవనం ఆధారపడి ఉన్నది. సూర్య కాంతి లేనిదే ఏది లేదు. 

రోజు ఉదయాన్నే శుచి అయి సూర్యాష్టకం చదువుతే శుభం కలుగుతుంది. మీ కోసం....

सुर्याष्टकम 

साम्ब उवाचा :


आदि देव नमस्तुभयं प्रसीद मम भास्करम्   । 
दिवाकर नमस्तुभयं प्रभाकर नमोsस्तुते ॥

सप्ताश्व रथमारूढं  प्रचंडम्  कश्यपात्मजम् । 
श्वेत पदमधरं  देवं  तम सूर्यं प्रणमाम्यहम्  ॥ 

लोहितं रथमारूढं सर्वलोक पितामहम्  । 
महा पाप हरं  देवं  त्वम सूर्यं प्रणमाम्यहम् ॥

त्रैगुण्यं च महाशूरं ब्रह्म विष्णु महेश्वरम्  । 
महा पाप हरं देवं  त्वम सूर्यं प्रणमाम्यहम् ॥

बृंहितम तेजसां पुंजम  वायुराकाशमेव च । 
प्रभुं च सर्वलोकानां तम सूर्यं प्रणमाम्यहम् ॥

बन्धूक पुष्प संकाशं हार कुण्डल भूषितम्  । 
एक-चक्र-धरम देवं  तम सूर्यं प्रणमाम्यहम्

तं  सूर्यं लोक कर्तारं महातेज: प्रदीपनम्  । 
महापाप हरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ॥

तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञान मोक्षदम् I 
महापाप हरं देवं तं सूर्यं प्रणमाम्यहम्II 

विश्वेशं विश्वकर्तारं महातेज प्रदीपनम् I 
महापाप हरं देवं तं सूर्यं प्रणमाम्यहम् II 

फल श्रुति:

सूर्याष्टकं पठेत् नित्यम ग्रह-पीडा प्रणाशनम्  ।
अपुत्रो लभते पुत्रं दरिद्र: धनवान भवेत ॥
आमिषम मधुपानम च य: करोति रवे: दिने । 
सप्त जन्म भवेत रोगी प्रतिजन्म दरिद्रता ॥
स्त्री तैल मधु मांसानि ये त्यजन्ति रवेर दिने । 
न व्याधि: शोक दारिद्रयम सूर्यलोकम गच्छति ॥

इति साम्ब पुराणे रोगापनयने सुर्याष्टकम संपूर्णम् II 

गुह्याति गुह्य गोप्तात्वं 
गृहाणास्मत्कृतं जपं 
सिद्धिर्भवतुमे देव 
त्व प्रसादान्महेश्वर 
एतत् फलम् श्री सूर्यनारायण देवतर्पनमस्तु II 

సూర్యాష్టకం 

సాంబ ఉవాచ :

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే



సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

తం సూర్యం లోకకర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

తం సూర్యం జగతాం నాధం ఙ్ఞానవిఙ్ఞాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

ఫల శృతి :

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా
స్త్రీ తైల మధు మాంసాని ఏ త్యజంతి రవేర్దినే 
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

ఇతి సాంబ పురాణే రోగాపనయనే శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం

గుహ్యాతి గుహ్య గోప్తాత్వం
గ్రుహాణాస్మత్కృతమ్  జపం
సిద్ధిర్భవతుమే దేవ
త్వ ప్రసాదేన్మహేశ్వర 
ఏతత్ ఫలం శ్రీ సూర్యనారాయణ దేవతార్పణమస్తు



మీ...అనామిక....

Tuesday, 11 October 2011

కాలభైరవాష్టకం


భైరవుడు శివుని యుక్క భీకర రూపమని లయ కారకుడని పురాణాలు చెపుతున్నాయి. భైరవుని గురించి ఇంకొక సారి వివరంగా చెప్పుకుందాం.

కలి యుగంలో కాల భైరవాష్టకం రోజు ఒక్క సారైనా చదివినా విన్నా ఎంతో మంచిదని పెద్దలంటారు.

కాలభైరవాష్టకం మీ కోసం...

కాలభైరవాష్టకం

దేవ   రాజ  సేవ్య  మాన పావనాంఘ్రి  పంకజం ,
వ్యాళ యజ్ఞ  సూత్ర  మిందు  శేఖరం  కృపాకరం ,
నారదాది  యోగి  బృంద వందితం  దిగంబరం ,
కాశికాపురధి నాథ   కాలభైరవం  భజే  !1!

భాను  కోటి  భాస్కరం, భవాబ్ది  తారకం  పరం ,
నీలకంఠ  మీప్సిదార్థ   దాయకం  త్రిలోచనం,
కాలకాల  మంబుజాక్ష   మక్ష  శూల  మక్షరం ,
కాశికాపురధి  నాథ   కాలభైరవం  భజే  !2!

శూల  దండ పాశ దండ  పాణి  మాధికారణం,
శ్యామ  కాయ  మాది  దేవమక్షరం  నిరామయం ,
భీమ  విక్రమం  ప్రభుం  విచిత్ర  తాండవ  ప్రియం ,
కాశికా పురధి  నాథ    కాలభైరవం  భజే  !3!

భుక్తి  ముక్తి  దాయకం ప్రశస్తచారు  విగ్రహం,
భక్త  వత్సలం  స్థితం, సమస్త  లోక  విగ్రహం,
వినిక్వణన్మనోఙ్ఞ హేమకింకిణీ  లసత్కటిం ,
కాశికాపురధి నాథ కాలభైరవం భజే  !4!

ధర్మ  సేతు  పాలకం, త్వధర్మ  మార్గ  నాశకం,
కర్మ  పాశ  మోచకం, సుశర్మ  దాయకం  విభుం ,
స్వర్ణ  వర్ణ  కేశ పాశ   శోభితాంగ  మండలం ,
కాశికాపురధి నాథ కాలభైరవం  భజే !5!

రత్న  పాదుక  ప్రభాభిరామ   పాదయుగ్మకం ,
నిత్యమద్విదీయమిష్ట  దైవతం  నిరంజనం,
మృత్యు  దర్ప  నాశనం  కరాళదంష్ట్ర  భీషణం
కాశికాపురధి నాథ కాలభైరవం  భజే !6!

అట్టహాస  భిన్న పద్మజాండ  కోశ  సంతతిం ,
దృష్టి  పాత   నష్ట  పాప  జాల  ముగ్ర  కాననం,
అష్టసిధి  దాయకం  కపాల  మాలికాధరం,
కాశికాపురధి నాథ కాలభైరవం  భజే  !7!

భూత  సంఘ  నాయకం , విశాల  కీర్తి  దాయకం,
కాశి  వాసి   లోక  పుణ్య  పాపా  శోధకం  విభుం,
నీతి  మార్గ  కోవిదం  పురాతనం జగత్ప్రభుం 
కాశికాపురధి నాథ కాలభైరవం  భజే !8!

కలభైరవాష్టకం పఠంతి యే మనోహరం ,
జ్ఞాన  ముక్తి  సాధనం, విచిత్ర  పుణ్య  వర్ధనం,
శోక  మోహ  దైన్య  లోభ  కోప  తాప  నాశనం,
తే ప్రయాంతి  కాలభైరవాంఘ్రి  సన్నిధిం   ధృవం  !9!



Kaalabhairavaashtakam

Deva raja sevya maana paavangri pankajam,
Vyaala yagna suthramindu shekaram krupakaram,
Naaradaadi yogi vrunda vandhitham digambaram,
Kaasika puraadhi naadha Kaalabhairavam bhaje. 1

Bhaanu koti bhaaswaram, bhavaabdhi thaarakam param,
Neelakantha meepsidartha dayakam trilochanam,
Kaalakaala mambujaaksha maksha soola maksharam,
Kaasika puraadhi naadha Kaalabhairavam bhaje. 2

Soola tanga paasa danda paani maadhi kaaraNam,
Syaama kaya madhi devamaksharam niramayam,
Bheema vikramam prabhum vichithra thandava priyam,
Kaasika puraadhi naadha Kaalabhairavam bhaje. 3

Bhukthi mukthi daayakam prasashtha chaaru vigraham,
Bhaktha vatsalam sthitam , samastha loka vigraham,
VinikwaNmanoGya hema kinkiNi lasath kateem,
Kaasika puraadhi naadha Kalabhairavam bhaje. 4

Dharma sethu paalakam, thwa dharma maarga nasakam,
Karma paasa mochakam , susharma daayakam vibhum,
Swarna varna sesha paasa shobithanga mandalam,
Kasika puraadhi naadha Kalabhairavam bhaje. 5

Rathna padukha prabhabhirama padayugmakam,
Nithyamadwidheeyamishta daivatham niranjanam,
Mrutyu darpa nasanam karaLadamshtra mokshanam,
Kaasika puraadhi naadha Kaalabhairavam bhaje. 6

Attahaasa bhinna padma jaanda kosa santhatheem,
Drushti paada nashta papa jaalamugra saasanam,
Ashtasidhi dayakam kapaala maalikandaram,
Kaasika puraadhi naadha Kaalabhairavam bhaje. 7

Bhootha sanga naayakam, vishaala keerthi dayakam,
Kaasi vaasa loka punya paapa shodhakam vibum,
Neethi marga kovidham purathanam jagatpathim,
Kaasika puraadhi naadha Kaalabhairavam bhaje. 8

Kaalabhairavaashtakam pathanthi yea manoharam,
Gyaana mukthi sadhanam , vichithra punya vardhanam,
Shoka moha dainya lobha kopa thaapa nasanam,
The prayanthi Kaalabhairavangri sannidhim dhruvam. 9
Kaasika puraadhi naadha Kaalabhairavam bhaje



మీ...అనామిక....

Wednesday, 28 September 2011

దసరా సంబరాలు

దసరా సంబరాలు 
goddess durga wallpaper ma kali chandi
దుర్గా మాత
దసరా నవరాత్రులు ఇవాల్టి నుండి ప్రారంభం. మననందరినీ  కాపాడే చల్లని తల్లిని అనేక రూపాలుగా కొలుస్తాము. మరి ఈ నవరాత్రులు మనం అమ్మ విశేషాలను గురించి చెప్పుకుందామా ....


చూస్తూ ఉండండి నా బ్లోగని......మరిన్ని విశేషాల కోసం....


మీ అందరికి  నా దసరా శుభాకాంక్షలు... 



మీ...అనామిక....

Thursday, 8 September 2011

ఆత్మా-పరమాత్మా



ఆత్మా-పరమాత్మా  అనే శిర్షికలో ఆధ్యాత్మిక విషయాలు, పురాణాలు, వ్రతాలు, పూజలు, మంత్రాలూ, స్తోత్రాలు, శ్లోకాలు, ఆచార వ్యవహారాలూ, కధలు, నీతులు, సుభాషితాలు, ఋషులు మునులు, మహాత్ముల విశేషాలు , వారు మనకి వదిలి వెళ్ళిన అపురూపమైన, అమూల్యమైన ఆధ్యాత్మిక సంపద , వీటన్నిటి  వెనక ఉన్న Scientific Reasoning, ఇలా ఎన్నో ఎన్నెన్నో... 

నాకు మా అమ్మమ్మ చాల చిన్ననాటే రామాయణ, మహాభారత, భాగవత కథలు, విశేషాలు చక్కగా చెప్పి అందులో రుచి, జిఙ్యాస కలిపించింది. ఇలా చిన్ననాటి నుండి ఉన్న తృష్ణ అంత చదివినా, అన్ని విన్న,  ఎంత  నేర్చుకున్న ఇంకా తెలుసుకోవాలనే  ఉంటుంది. తరువాత నా అదృష్టం కొద్ది మహానుభావులు, గురువులతో, ఙ్ఞానులతో  ఏర్పడిన పరిచయాలు నాకు ఆధ్యాత్మికంగా అంతో ఉన్నతిని ప్రసాదించాయి. ఒక్కొక్కసారి ప్రయాణాలలో అపరిచితులైన తోటి ప్రయాణికుల నుంచికుడా నేను ఎంతో విలువైన విషయాలు నేర్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. 

నాకు తెలిసిన ఈ  కొద్దిపాటి ఙ్ఞానం  మీతో  పంచుకోవాలని నా ఈ ప్రయత్నం....మీరు మెచ్చి ఆదరిస్తారని ఆశ...

In "Atma-Paramatma" I would like to share with you, what ever little knowledge I have about, spirituality, vedic sciences, puranas, vratha-pooja, slokas, mantras, stotras, customs and traditions, great sayings, our great rishis, munis and saints the knowledge they left behind, the scientific reasoning behind our Vedic knowlede and customs and traditions and many more. 

Hope you like my posts and encourage me.

మీ...అనామిక....