Monday, 7 May 2012

రామాయణ ప్రవచనములు


రామాయణం, మహాభారతం, పురాణాలు ఇవి ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటాయి. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ప్రతిసారి ఏదో ఒకటి మనం నేర్చుకుంటాం. 

బ్రహ్మ శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు మనకి సుపరిచితులే. పౌరాణిక సార్వభౌమ, అభినవ వ్యాసాది బిరుదాంకితులు, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు. వారు ధర్మ సందేహాలు తీర్చినా ధర్మ సూక్ష్మాలు వివరించి చెప్పినా చాలా వివరంగా చెపుతారు. ఇక వారి ప్రవచానాలైతే, పండితులైన పామరులైన మంత్ర ముగ్ధులను చేసి కట్టి పడేస్తాయి. గంటల తరబడి వినాలని పిస్తుంది. పిల్లల నుండి పెద్దల దాకా చాలా ఆశక్తిగా వింటారు.
Moserbaer వారు శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి వాల్మీకి శ్రీ మద్రామాయణ ప్రవచనములు డీవిడీ రూపంలో అందిస్తున్నారు. ఇవి 10 డీవిడీలు, చక్కనైన ప్యాక్ లో చాలా తక్కువ ధరలో అందిస్తున్నారు. మన దగ్గెర తప్పకుండ ఉండ వలసిన ఒక ఆణిముత్యం. కావలసినప్పుడల్లా వినవచ్చును/చూడవచ్చును.


పెద్దలకు, పిల్లకు, స్నేహితులకు ఇలా ఎవరికైనా మనం ఇది కొని ఇస్తే ఒక మంచి పుస్తకం కొని ఇచ్చి నట్లే. 

మరి ఇంకెందుకు ఆలస్యం..మీరు ఒక సెట్టు తెచ్చుకోండి....



మీ...అనామిక....

2 comments:

నాగరాజు మద్దినేనీ (Nag) said...

Hi,

Where Can I get this DVD?

I could not able to find it in http://www.moserbaerhomevideo.com/index.htm?keyid=1&langid=11#B

Thanks,
Nag

అనామిక... said...

Nag You can get it from shops that sell DVDs and CDs.

In Hyderabad, you can get from New Bharat Enterprises, Sultan Bazar, Phone 040-24752067, 24750038, 9848040947. You can enquire from them whether they have any outlets/agency in your town.