వెండి మెరుపులు
ఈ శీర్షికలో నాకు తెలిసిన, నేర్చుకున్న కొన్ని చిట్కాలు మీ కోసం.....
సధారణంగా వెండి వస్తువులు నల్ల పడుతూ ఉంటాయి. వాటిని మాములుగా తోమితే అంతగా మెరవవు. మెరుపు రావాలంటే ఈసారి ఇలా చేసి చూడండి:
ఈ శీర్షికలో నాకు తెలిసిన, నేర్చుకున్న కొన్ని చిట్కాలు మీ కోసం.....
సధారణంగా వెండి వస్తువులు నల్ల పడుతూ ఉంటాయి. వాటిని మాములుగా తోమితే అంతగా మెరవవు. మెరుపు రావాలంటే ఈసారి ఇలా చేసి చూడండి:
ఒక పెద్ద పాత్ర లో బాగా నీళ్లు పోయండి. అవి పొయ్యి మీద పెట్టి బాగా మరిగే దాకా వేడి చేయ్యండి.ఇప్పుడు సెగ బాగా తగ్గించి లేదా ఆర్పి వేయండి. ఆ నీళ్లలో లో 2-3 టేబుల్ చెంచాల వంట సోడా వెయ్యండి. అది ఒక్కసారిగా పొంగినట్టు అవుతుంది. జాగ్రత్త సుమా. ఇప్పుడు వెంటనే అందులో మీ వెండి వస్తువులు వేయండి. అవి పూర్తిగా ములగాలి. 3-5 ని. తరువాత వాటిని తీసి, తడి పోయే దాకా తుడిచి, ఎర్ర కాగితంలో చుట్టి జాగ్రత్త చెయ్యండి లేదా వాడుకోండి. వెండి వస్తువులు ఎంత తళ తళమని మెరుస్తాయో మీరు చూసి చెప్పండి.
మీ...అనామిక....
No comments:
Post a Comment