నాకు ఎప్పుడు ఏదో ఒక కొత్త కళని నేర్చుకుని కొత్త కొత్తవి తయారు చేయాలని ఆశ. ప్రస్తుతం నేను, ఆభరణాల తయారీలో కొంత కసరత్తు చేస్తున్నా. ఇవన్ని గిల్టువే సుమా. బీడ్స్ మరియు ఎన్నో రకాలైన ఇతర వస్తువులతో ఈ నగలు తయారు చేయటం నాకు చాల సరదా.
ఇది నేను చేసిందే. నా చెల్లికి నల్ల పుసలంటే ఇష్టం. అందుకని మొన్న శ్రావణ శుక్రవారం తనకి కానుకగా పసుపు కుంకం తో ఇవ్వటానికి తయారు చేశాను. దండ మధ్యలో లక్ష్మి అచ్చు ఉన్న కాసు ఉంది. నాకు అన్నిటిలోకి నచ్చింది వెనక ఉన్న డోరి. నేను అది చూసిన వెంటనే నల్లపూసల గొలుసు తాయారు చేస్తే బాగుంటుందని అనిపించింది, ఈ డిజైన్ కూడా స్పురించింది. వెంటనే ఇది చేశాను. ఎలా ఉంది?
మీ...అనామిక....
4 comments:
డోరీ మాత్రం అదుర్స్ అండీ , పెండెంట్ చిన్నది అయింది, ఈ సారి పెండెంట్ పెద్దది చేసి చూడండి. నాకు బాగా నచ్చింది.
మీకు భలే ఓపిక సుమా !!
వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి మీకున్న ఓపిక మాకు ఉండదండీ !!
ధన్యవాదాలు. పెండెంట్ మరీ పెద్దవి ఉన్నాయి.ఈ సైజ్ కి తగట్టుగ లేవు. ఎప్పుడైన దొరికితే మార్చుకొవాలి.
Word verification has been removed thanks for pointing out..:)
చాలా బాగుంది కానీ లాకెట్టు చిన్నదయింది!
ధన్యవాదాలండి
Post a Comment