Saturday 30 June 2018

బర్త్ డే కార్డు



ముందుగా క్రీం కలర్ A 4 సైజు కార్డు ను సగానికి మడిచాను. తరువాత ప్రింటెడ్ టేప్ ను అతికించాను. 

తరువాత పంచ్ చేసిన పువ్వులు, ఆకులు, పుప్పొడి ఇంకా కాడలను కొంచం షేప్ చేసి అతికించాను. పువ్వుల మధ్యన మెరిసే క్రిస్టల్స్ అతికించాను. 

ఒక ఫెయిరీ 3D  స్టిక్కర్ ను అతికించాను. 

హ్యాపీ బర్త్ డే, మేక్  ఎ  విష్ అనే స్టాంప్ ను ముద్రించాను. 


 ఇదీ  నేను చేసిన కార్డు. మీకు నచ్చిందా?  మీ అభిప్రాయాలను వ్రాయండి.

మరి కొన్ని వచ్ఛే టపాలలో ...

మీ...అనామిక....

ఆణిముత్యాలు -504

ఆణిముత్యాలు-504


మీ...అనామిక....

Wednesday 27 June 2018

పంచ్ క్రాఫ్ట్ కార్డు


ఇవాళ నేను పోస్ట్ చేస్తున్న కార్డు పంచ్ క్రాఫ్ట్ తో చేసినది.


లైట్  గ్రే రంగు టెక్స్చర్డ్ -A 4 సైజ్  కార్డు తీసుకుని సగానికి మడిచాను. 

ముందుగా తెలుపు, గులాబీ రంగు మరియు ఎరుపు పేపర్తో పూవులు పంచ్ చేసికొని పెట్టుకున్నాను, అలాగే ఆకుపచ్చ పేపర్ తో ఆకులు, ముదురు నీలం రంగులో సీతాకోకచిలుకలను పంచ్ చేసి పెట్టుకున్నాను. 

పేపర్ రోప్ - ముదురు బ్రౌన్ రంగుని కొమ్మలుగా అంటించి, తరువాత పూవులు, ఆకులూ, సీతాకోకచిలుకలను  అంటించాను. 3D ఎఫెక్ట్ కోసం, పూవులను కాస్త షేప్ చేసి అంటించాను.  కావలసినప్పుడు సెంటిమెంట్ ను అంటించి, లోపల మెసేజ్ వ్రాసి కార్డు ను ఇవచ్ఛును. 

మరి మీకు ఈ  కార్డు నచ్చిందా? మరిన్ని  కార్డులు వచ్చే టపాలలో ... 


మీ...అనామిక....

ఆణిముత్యాలు -501

ఆణిముత్యాలు-501 


మీ...అనామిక....

Tuesday 26 June 2018

గుడ్ లక్ కార్డ్

ఇవాళ నేను మీతో పంచుకుంటున్న కార్డు ఇది :


ఇది కూడా పంచ్ క్రాఫ్ట్ తో తయారు చేసిన కార్డు. 

ముందుగా క్రీమ్ కలర్ లో ఒక టెక్సచర్డ్  A 4 సైజ్ కార్డును సగానికి మడిచాను.  

బోర్డర్ పంచ్ తో బోర్డరును పంచ్ చేశాను. పై వైపు మాత్రమే సుమా. 

తరువాత ముదురు గులాబీ, లేత గులాబీ, బేబీ పింక్ రంగుగల క్రాఫ్ట్ పేపర్ ను పంచ్ తో మూడు సైజులలో పువ్వులను పంచ్ చేసి, ఇలా ఒక దానిలో ఉంకొకటి అతికించాను. 

పసుపు రంగు క్రాఫ్ట్ పేపర్ తో పుప్పొడిని పంచ్ చేసి చివరగా అతికించాను. తరువాత ఆ పూవులని షేప్  చేశాను. ముందుగా ముదురు ఆకుపచ్చ  రంగు పేపర్ ఆకులను కత్తిరించి అంటించి, దానిపై ఈ  పూవులను అంటిచాను. 

అలాగే ఉదా  రంగు పూవులను, లోపల పచ్చని పుప్పొడిని, లేత ఆకుపచ్చ ఆకులను పంచ్ చేసి అతికించాను. బోర్డర్ క్రింది భాగాన గోల్డ్ రిబ్బన్ తప్పును అతికించాను.



డార్క్ బ్రౌన్ రంగు పక్షిని ఆ పూవుల మధ్యన అతికించాను. సర్కిల్ పంచ్ తో పంచ్ చేసిన ఆరంజ్ రంగు గల గుండ్రని పేపర్ పై గుడ్ లక్  అని  ముద్ర వేసి ఆ పక్షి పక్కన అతికించాను. కార్డు పైన కూడా అలాగే ఒక పొడవాటి పేపర్ పై అటు, ఇటు కనబడేటట్లు రెండు గుడ్ లక్  అని ముద్ర వేసి, సగానికి మడిచి అంటిచాను. 

లోపల ఒక క్రీం కలర్ పేపర్ని, సగానికి మడిచి, మెస్సేజ్ వ్రాయటానికి అతికించాను. దింతో నా కార్డు పూర్తీ అయింది. 

మరి ఈ  న కార్డు ఎలా ఉంది? మరి కొన్ని వచ్ఛే టపాలలో ... 

మీ...అనామిక....

ఆణిముత్యాలు - 500

ఆణిముత్యాలు-500 

మీ అందరికి, నమస్కారాలు . ఈ  "ఆణిముత్యాలు " అనే శీర్షికతో వెలుబడే టపాలలో ఈ  రోజు మరొక మైలు  రాయి చేరుకున్నాను. 

ఇది నా 500వ టపా . 

మీ అందరి ఆదరణకు, ప్రేమరణకు ధన్యవాదాలు. ఎంతోమంది  టపాలు  బాగున్నాయని నాకు మెయిల్ చేస్తూ ఉంటారు. వారందరికీ నా ధన్యవాదాలు. నాకు ఆరోగ్యం సహకరించక నేను ఈ  బ్లాగ్ లో తరచూ టపాలు  వేయలేక పోతున్నాను. అందునా తెలుగులో టైపు చేయడం అంట శుభం కాదు. 

మీతో ఇంకా ఎనో ఎన్నెనో విషయాలు పంచుకోవాలని నా ఆశ. కానీ అది సాధ్యపడట్లేదు. అయినా మీ ఆదరణ ఆప్యాయతలు నన్ను ఎంతగానో ఉత్సహపరుస్తుంటాయి. 

మీరు ఇలాగే  మీ అభిప్రాయాలను, సూచనలను నాకు అందచేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను

మున్ముందు మరిన్ని కొత్త విషయాలను మీతో తరచూ పంచుకోవాలని ఆశిస్తో...  

మీ...అనామిక....

Friday 22 June 2018

Punch Craft Greeting Cards

ఈ  టపాలో నేను పోస్ట్ చేస్తున్న కార్డు  ఇది:



బేస్ కి వాడినది హ్యాండ్ మేడ్ పేపర్ బేబీ పింక్ కలర్. పైన, లైట్ గ్రీన్, పింక్ రంగు  క్రాఫ్ట్ పేపర్ ను అంటించాను. మధ్యలో రాధా-కృష్ణుల  స్టిక్కర్  అంటించాను. దాని చుట్టూ రంగురంగుల క్రిస్టల్స్. క్రింద సీతాకోకచిలుక  పఫ్డ్  స్టిక్కర్. పైన పంచ్ క్రాఫ్ట్ తో తయారు చేయేసినా పువ్వులు. 

పంచ్ క్రాఫ్ట్ పెద్ద కష్టమైనది కాదు . కానీ రక రకాల పంచెస్ కొన్నుకోవాలి. ఇవి కొంచెం ఖరీదైనవి. వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి కూడా. 

ఇచ్చే ముందర నేను రాయవలసిన సెంటిమెంట్  ను కార్డు పైన, మెస్సేజ్ ను లోపల అంటించిన పేపర్ పైన వ్రాసి ఇఛ్చాను. అది నేను ఫోటో తీయలేదు. 

మీకు ఈ  కార్డు నచ్చిందనుకుంటాను. ఇంకొన్ని వచ్చే టపాలలో. మరి నా బ్లాగును చూస్తూ ఉంటారు కాదు...  

మీ...అనామిక....

ఆణిముత్యాలు - 499


ఆణిముత్యాలు -499 

మీ...అనామిక....

Tuesday 19 June 2018

హ్యాండ్ మేడ్ గ్రీటింగ్ కార్డ్స్

చాలా రోజుల తరువాత ఈ  టపాను వ్రాస్తున్నాను. మీరంతా బాగున్నారా? స్కూళ్ళు మొదలయిపోయాయి. అంతా  బిజి  కదా. వేసవి సెలవల తరువాత మళ్ళీ  అందరు ఉరుకులు పరుగులు.

సరే ఇప్పుడు మీతో నేనొక కొత్త విష్యం పంచుకోబోతున్నాను.

పండగలకి, పుట్టిన రోజు, పెళ్లిరోజు, ఇలాంటి సందర్భాలలో ఎవరికైనా మనము శుభాకాంక్షలు చెప్పేందుకు ఒకప్పుడు చక్కటి గ్రీటింగ్ కార్డ్స్ పంపడమో/ఇవ్వడమో చేసేవారము. విదేశాలలో, ధన్యవాదాలు, క్షమాపణలు చెప్పడానికి, వాలెంటైన్ డేకి ఇలా ఇంకా ఎన్నో సందర్భాలలో గ్రీటింగ్ కార్డ్స్ వాడతారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన  తరువాత గ్రీటింగ్ కార్డ్స్ వాడకం  తగ్గింది. కానీ విదేశాలలో ఇంకా వాడుతోనే ఉన్నారు.

అయినా సందర్భానుసారంగా మనం గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తే బాగుంటుంది. మనము సొంతంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్ అయితే ఇంకా బాగుంటాయి. కార్డు లోపలి సందేశం చక్కగా టైపు చేసి ప్రింట్ తీసుకోవచ్చును. అసలు మనమే  వ్రాస్తే ఇంకా బాగుంటుంది. పర్సనల్ టచ్ ఇచ్చినట్లుగా ఉంటుంది. చేతి వ్రాత బాగోలేకపోయిన సరే, చేతితో వ్రాయటమే మంచిదని అంటున్నారు.

నాకు చిన్నప్పటినుండి గ్రీటింగ్ కార్డ్స్ స్వయంగా చేయటం చాలా ఇష్టం. ఇప్పుడు ఎన్నో పరికరాలు, రాకరకాలయిన మెటీరియల్స్ మార్కెట్ లో విరివిగా దొరుకుతున్నాయి. చాలా వరకు ఇంట్లో  ఉన్న వాటి తోనే  మనం కార్డ్స్ చేసుకోవచ్చ్చును.

నేను చేసిన కార్డ్స్ మీ కోసం నా టపాల లో పోస్ట్ చేస్తాను. ఇవాళ ఒక 3D  కార్డు


ముందుగా క్షమాపణలు. ఈ ఫోటో అంత  స్పష్టంగా లేదు. మెసేజ్ వ్రాసిన తరువాత నేను ఫోటో తీయటం మరచి పోయాను.

దీనికి నేను వాడివి; A4 సైజు  టెక్సచర్డ్  కార్డు స్టాక్ మరియు 3D స్టిక్కర్. ఇది చాలా సులువుగా చేసికోవచు. A4 సైజు  కార్డుని సగానికి మడచి, స్టిక్కర్ అంటించాను.

తీరికగా ఉన్నప్పుడు ఇలా కొన్ని కార్డులు, చేసిపెట్టుకుని అవసరమైనప్పుడు కావాల్సిన సందేశం పైన, లోపల వ్రాసి ఇస్తాను.

మరికొన్ని కార్డులు వచ్చే టపాలలో ... మరి చూస్తూ ఉండండి నా బ్లాగ్ ... 

మీ...అనామిక....

ఆణిముత్యాలు - 496

ఆణిముత్యాలు -496 


మీ...అనామిక....