Tuesday 26 June 2018

గుడ్ లక్ కార్డ్

ఇవాళ నేను మీతో పంచుకుంటున్న కార్డు ఇది :


ఇది కూడా పంచ్ క్రాఫ్ట్ తో తయారు చేసిన కార్డు. 

ముందుగా క్రీమ్ కలర్ లో ఒక టెక్సచర్డ్  A 4 సైజ్ కార్డును సగానికి మడిచాను.  

బోర్డర్ పంచ్ తో బోర్డరును పంచ్ చేశాను. పై వైపు మాత్రమే సుమా. 

తరువాత ముదురు గులాబీ, లేత గులాబీ, బేబీ పింక్ రంగుగల క్రాఫ్ట్ పేపర్ ను పంచ్ తో మూడు సైజులలో పువ్వులను పంచ్ చేసి, ఇలా ఒక దానిలో ఉంకొకటి అతికించాను. 

పసుపు రంగు క్రాఫ్ట్ పేపర్ తో పుప్పొడిని పంచ్ చేసి చివరగా అతికించాను. తరువాత ఆ పూవులని షేప్  చేశాను. ముందుగా ముదురు ఆకుపచ్చ  రంగు పేపర్ ఆకులను కత్తిరించి అంటించి, దానిపై ఈ  పూవులను అంటిచాను. 

అలాగే ఉదా  రంగు పూవులను, లోపల పచ్చని పుప్పొడిని, లేత ఆకుపచ్చ ఆకులను పంచ్ చేసి అతికించాను. బోర్డర్ క్రింది భాగాన గోల్డ్ రిబ్బన్ తప్పును అతికించాను.



డార్క్ బ్రౌన్ రంగు పక్షిని ఆ పూవుల మధ్యన అతికించాను. సర్కిల్ పంచ్ తో పంచ్ చేసిన ఆరంజ్ రంగు గల గుండ్రని పేపర్ పై గుడ్ లక్  అని  ముద్ర వేసి ఆ పక్షి పక్కన అతికించాను. కార్డు పైన కూడా అలాగే ఒక పొడవాటి పేపర్ పై అటు, ఇటు కనబడేటట్లు రెండు గుడ్ లక్  అని ముద్ర వేసి, సగానికి మడిచి అంటిచాను. 

లోపల ఒక క్రీం కలర్ పేపర్ని, సగానికి మడిచి, మెస్సేజ్ వ్రాయటానికి అతికించాను. దింతో నా కార్డు పూర్తీ అయింది. 

మరి ఈ  న కార్డు ఎలా ఉంది? మరి కొన్ని వచ్ఛే టపాలలో ... 

మీ...అనామిక....

No comments: