Tuesday 19 June 2018

హ్యాండ్ మేడ్ గ్రీటింగ్ కార్డ్స్

చాలా రోజుల తరువాత ఈ  టపాను వ్రాస్తున్నాను. మీరంతా బాగున్నారా? స్కూళ్ళు మొదలయిపోయాయి. అంతా  బిజి  కదా. వేసవి సెలవల తరువాత మళ్ళీ  అందరు ఉరుకులు పరుగులు.

సరే ఇప్పుడు మీతో నేనొక కొత్త విష్యం పంచుకోబోతున్నాను.

పండగలకి, పుట్టిన రోజు, పెళ్లిరోజు, ఇలాంటి సందర్భాలలో ఎవరికైనా మనము శుభాకాంక్షలు చెప్పేందుకు ఒకప్పుడు చక్కటి గ్రీటింగ్ కార్డ్స్ పంపడమో/ఇవ్వడమో చేసేవారము. విదేశాలలో, ధన్యవాదాలు, క్షమాపణలు చెప్పడానికి, వాలెంటైన్ డేకి ఇలా ఇంకా ఎన్నో సందర్భాలలో గ్రీటింగ్ కార్డ్స్ వాడతారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన  తరువాత గ్రీటింగ్ కార్డ్స్ వాడకం  తగ్గింది. కానీ విదేశాలలో ఇంకా వాడుతోనే ఉన్నారు.

అయినా సందర్భానుసారంగా మనం గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తే బాగుంటుంది. మనము సొంతంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్ అయితే ఇంకా బాగుంటాయి. కార్డు లోపలి సందేశం చక్కగా టైపు చేసి ప్రింట్ తీసుకోవచ్చును. అసలు మనమే  వ్రాస్తే ఇంకా బాగుంటుంది. పర్సనల్ టచ్ ఇచ్చినట్లుగా ఉంటుంది. చేతి వ్రాత బాగోలేకపోయిన సరే, చేతితో వ్రాయటమే మంచిదని అంటున్నారు.

నాకు చిన్నప్పటినుండి గ్రీటింగ్ కార్డ్స్ స్వయంగా చేయటం చాలా ఇష్టం. ఇప్పుడు ఎన్నో పరికరాలు, రాకరకాలయిన మెటీరియల్స్ మార్కెట్ లో విరివిగా దొరుకుతున్నాయి. చాలా వరకు ఇంట్లో  ఉన్న వాటి తోనే  మనం కార్డ్స్ చేసుకోవచ్చ్చును.

నేను చేసిన కార్డ్స్ మీ కోసం నా టపాల లో పోస్ట్ చేస్తాను. ఇవాళ ఒక 3D  కార్డు


ముందుగా క్షమాపణలు. ఈ ఫోటో అంత  స్పష్టంగా లేదు. మెసేజ్ వ్రాసిన తరువాత నేను ఫోటో తీయటం మరచి పోయాను.

దీనికి నేను వాడివి; A4 సైజు  టెక్సచర్డ్  కార్డు స్టాక్ మరియు 3D స్టిక్కర్. ఇది చాలా సులువుగా చేసికోవచు. A4 సైజు  కార్డుని సగానికి మడచి, స్టిక్కర్ అంటించాను.

తీరికగా ఉన్నప్పుడు ఇలా కొన్ని కార్డులు, చేసిపెట్టుకుని అవసరమైనప్పుడు కావాల్సిన సందేశం పైన, లోపల వ్రాసి ఇస్తాను.

మరికొన్ని కార్డులు వచ్చే టపాలలో ... మరి చూస్తూ ఉండండి నా బ్లాగ్ ... 

మీ...అనామిక....

No comments: