Monday 26 January 2015

రంగవల్లి - 199

ఈ రోజు గణతంత్ర దినోత్సవమే కాదు రథ సప్తమి కూడా. అందుకని ఈ ముగ్గు మీ కోసం: 
 27 సరి చుక్కలు 7 వరుసలు.... 7 చుక్కల వరకు 

ఈ రోజు మన ఢిల్లీ పెరేడు కి ముఖ్య అతిథి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారికి స్వాగతం పలుకుతో , అమెరికా పతాకం వారి జాతీయ పుష్పం గులాబీ, మన గణతంత్ర దినోత్సవం కనుక మన త్రివర్ణ పతాకం, మన జాతీయ పుష్పం కమలము, మన జాతీయ పండు మామిడి (ఇంకా పండ లేదండోయ్  :) ) . ఝండా ఎగురవేసిన తరువాత పిల్లలకు పంచే చాక్లెట్లు  కుడా ఉన్నాయి. 

భారత-అమెరికా మైత్రి లో సరి క్రొత్త అధ్యాయం మొదలయ్యింది అనీ, ఉదయించే సూర్యుడు. అంతే  కాదు ఇవాళ రథ సప్తమి కూడా కదా. ఆ పుష్పాంజలి మన సూర్య భగవానునికి కూడా. 

సరే సీతా కోక చిలుకలు మన సంతోషాన్ని, ఉత్సాహాన్ని పండుగ వతావర్ణాన్ని  ప్రతిబింబిస్తో .... .. 

మరి ఈ నా ముగ్గు మీకు నచ్చిందా .... 

ఇది నా సొంత డిజైన్. దయ చేసి దీనిని కాపి చేసి, డౌన్ లోడ్ చేసి, మీ బ్లాగ్ లో కాని సైట్ లో కాని పెట్టకండి. మీకు నచ్చి షేర్ చేయాలను కుంటే ఈ నా బ్లాగ్ లింక్ ఇవ్వండి .... 

మీ అందరికి గణతంత్ర దిన శుభాకాంక్షలు 


మీ...అనామిక....

Thursday 15 January 2015

రంగవల్లి -198



అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ కోసం రథం ముగ్గు. 

మీ...అనామిక....

రంగవల్లి -197

23 చుక్కలు  -5 వరుసలు, సరి చుక్కలు 5 వరకు. 



మీ...అనామిక....

Saturday 10 January 2015

రిబ్బన్ వర్క్


రిబ్బన్ వర్క్  అంటే రిబ్బన్ తో కుట్టే వర్క్ . ఇది సిల్క్ లేదా సాటిన్ రిబ్బన్ తో కుడతారు. ఇదిగో నేను కుట్టిన ఒక డిజైన్ :

దీనిని ఒక వృత్తాకారపు కాటన్ వస్త్రం పై కుట్టాను. సాటిన్  రిబ్బన్ , కాటన్ దారాలు, పెర్ల్ దారాలు, సిల్క్ దారాలు వాడాను. రకరకాల కుట్లను ఉపయోగించాను . 
మీ అభిప్రాయాలు, సూచనలు తప్పక వ్రాయండి. అవే కదా రచయితలకు టానిక్  లాగా పనిచేస్తాయి.  :) :)..... 
చూస్తూ ఉండండి నా బ్లాగ్ మరిన్ని కొత్త కొత్త విషయాల కోసం ....... 


మీ...అనామిక....

రంగవల్లి -195

స్వస్తిక్ ముగ్గు 



మరిన్ని రంగవల్లుల కోసం చూస్తూ ఉండండి  నా టపాలు

మీ...అనామిక....

Wednesday 7 January 2015

రంగవల్లి - 194


21, 19, 17, 15- 5 సార్లు , 5, 3, 1 చుక్కలు. 
చూస్తూ ఉండండి నా బ్లాగ్ మరిన్ని ముగ్గుల కోసం 


మీ...అనామిక....