Monday, 26 January 2015

రంగవల్లి - 199

ఈ రోజు గణతంత్ర దినోత్సవమే కాదు రథ సప్తమి కూడా. అందుకని ఈ ముగ్గు మీ కోసం: 
 27 సరి చుక్కలు 7 వరుసలు.... 7 చుక్కల వరకు 

ఈ రోజు మన ఢిల్లీ పెరేడు కి ముఖ్య అతిథి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారికి స్వాగతం పలుకుతో , అమెరికా పతాకం వారి జాతీయ పుష్పం గులాబీ, మన గణతంత్ర దినోత్సవం కనుక మన త్రివర్ణ పతాకం, మన జాతీయ పుష్పం కమలము, మన జాతీయ పండు మామిడి (ఇంకా పండ లేదండోయ్  :) ) . ఝండా ఎగురవేసిన తరువాత పిల్లలకు పంచే చాక్లెట్లు  కుడా ఉన్నాయి. 

భారత-అమెరికా మైత్రి లో సరి క్రొత్త అధ్యాయం మొదలయ్యింది అనీ, ఉదయించే సూర్యుడు. అంతే  కాదు ఇవాళ రథ సప్తమి కూడా కదా. ఆ పుష్పాంజలి మన సూర్య భగవానునికి కూడా. 

సరే సీతా కోక చిలుకలు మన సంతోషాన్ని, ఉత్సాహాన్ని పండుగ వతావర్ణాన్ని  ప్రతిబింబిస్తో .... .. 

మరి ఈ నా ముగ్గు మీకు నచ్చిందా .... 

ఇది నా సొంత డిజైన్. దయ చేసి దీనిని కాపి చేసి, డౌన్ లోడ్ చేసి, మీ బ్లాగ్ లో కాని సైట్ లో కాని పెట్టకండి. మీకు నచ్చి షేర్ చేయాలను కుంటే ఈ నా బ్లాగ్ లింక్ ఇవ్వండి .... 

మీ అందరికి గణతంత్ర దిన శుభాకాంక్షలు 


మీ...అనామిక....

No comments: