Showing posts with label Back Stitch Family. Show all posts
Showing posts with label Back Stitch Family. Show all posts
Monday, 9 April 2012
వెనుక కుట్టు - Back Stitch-5
Triple Back Stitch or Hungarian Stitch
ఇది కూడా ఈ కుటుంబానికి చెందినది. దీనిలో మూడు వరుసలో కుట్లు వస్తాయి.
కుట్టు ని మధ్య గీత నుండి ప్రారంభించాలి.
A నుండి B కి ఒక కుట్టు.
పైన C నుండి D కి.
మల్లి క్రింద E నుండి F కి. తిరిగి B దగ్గెర నుండి.
ఇలా ప్రతిసారి మధ్య గీత నుండి మొదలు పెట్టి పైన క్రింద కుట్టాలి. అంతకు మునుపు ముగించిన చోటునుండి కుట్టాలి.
కుట్టు ఇలా కనిపించాలి.
వెనుక ఇలా క్రాస్ స్టిచ్చ్ లాగ రావాలి.
ముందుగా మ్యాటి బట్ట పై నేర్చుకుని తరువాత మామూలు బట్ట పై కుట్టవచ్చును. మాములు బట్ట పై కుట్టి నప్పుడు పెన్సిల్తో గీతలు గీసుకుని గని లేదా పైన నెట్ బట్ట ఉంచి కాని కుట్టు కో వచ్చు.
ఈ కుట్టు ని దూరంగా, దగ్గెరగా లేదా మధ్యన ఎడం ఉంచీ, ఇలా రక రకాలుగా కుట్టు కోవచ్చు. ఇది బార్డర్ గా పనికి వచ్చే కుట్టు. లేదా వేరే కుట్ల తో కలిపి వెడల్పాటి బార్డర్ కుట్ట వచ్చు. చీరె అంచులకు, చున్నిలకు, పిల్లల ఫ్రాక్, తువాళ్ళకు ఇలా దేని పై నైనా కుట్ట వచ్చు.
దీనిని మళ్లీ Whipped, Threaded, Double Threaded, పేటర్న్ లాగా కుట్ట వచ్చును. రంగు రంగు దారాలు వాడుకోవచ్చు. అవి మనం తరువాత చెప్పుకుందాం
మరి మీరు ఈ కుట్లు సాధన చేస్తున్నారనుకుంటాను.
Saturday, 7 April 2012
వెనుక కుట్టు - Back Stitch-4
Double Threaded Back Stitch
ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా ముందు Threaded Back Stitch కుట్టు కోవాలి. అదే దారాన్ని అటు చివరినించీ ఇటు వైపుకి మళ్లీ పూర్వం లాగా కుట్లలో నుండి దూర్చి తీస్తూ రావాలి. బట్టలోనికి దూర్చ కూడదు.
ఈ కుట్టు చైన్ స్టిచ్ -గొలుసు కుట్టు లాగ కనిపిస్తుంది.
కుట్టే విధానం
పైవి రెండు Threaded Back Stitch, క్రిందిది Double Threaded Back Stitch
Back Stitch దగ్గెర గాను దురంగాను వేస్తే ఈ కుట్టు ఎలా ఉంటుందో చూడండి.
ఇది కూడా అవుట్ లైన్ గానూ, బార్డర్ గానూ కుట్టుకోవచ్చు.
Friday, 6 April 2012
వెనుక కుట్టు -Back Stitch-3
Threaded Back Stitch
ముందుగా ఒక వరుస Back Stitch కుట్టుకుని తరువాత ఇంకొక రంగు దారాన్ని లచే లాగా ఇలా ఈ కుట్లలో నుండి దూర్చి తీయాలి. బట్ట లోనికి మాత్రం సూదిని దుర్చకూడదు. కేవలం కుట్లలోనుండి మాత్రమే సుమా.
ఇలా చూడండి దగ్గెర, దూరంగా వేసిన Back Stitch కుట్లు. తేడాను గమనించండి.
ఈ కుట్టుని అవుట్ లైన్ లా కాని బార్డర్ లా కాని లేదా ఇతర కుట్లతో కాని కలిపి ఉపయోగించ వచ్చు.
మీకు నా ఈ టపాలలో చెప్పేవి స్పష్టంగా అర్ధం అవుతున్నయనుకుంటాను...
ఇంకొన్ని వచ్చే టపాలలో....
Thursday, 5 April 2012
వెనుక కుట్టు -Back Stitch-2
Whipped Back Stitch
Back Stitch కుటుంబానికి చెందిన కుట్టు ఇది. ముందుగా Back Stitch కుట్టుకుని క్రింద చూపిన విధంగా దారాన్ని ఈ కుట్లలో నుండి దూర్చి తీయాలి. బట్ట లోనికి మాత్రం సూదిని దుర్చకూడదు. కేవలం కుట్లలోనుండి మాత్రమే సుమా.
ఈ కుట్టు అవుట్ లైన్ గా ఉపయోగించుకోవచ్చు. లేదా బార్డర్ గా ఉపయోగించ వచ్చు. లావు దారం కానీ లేదా ఊల్ వాడినా బాగుంటుంది. చాల సులభంగా కుట్ట వచ్చును.
మరి కొన్ని వచ్చే టపాలలో....
Tuesday, 3 April 2012
వెనుక కుట్టు -Back Stitch-1
వెనుక కుట్టు -Back Stitch
ఈ కుట్టు టాకా కుట్టు కుట్టులాగే ఉంటుంది. కాని వెనుకకి కుడతారు. కుట్టుకి కుట్టికి మధ్య ఎడం లేకుండా కుట్ట వచ్చు. కావాలనుకుంట కుట్టు కుట్టుకీ మధ్యన కావాలనుకుంటే ఎడం ఉంచవచ్చు.
ఎలా కుడతారో చూద్దాం
A నుండి దారం బట్ట క్రింది నుండి పైకి తీయాలి
A కి కొద్దిగా వెనుకన B నుండి క్రిందికి తీసి మరల C దగ్గెర పైకి తీయాలి
C నుండి మరల A దగ్గెర క్రిందికి దించాలి. ఇలా అన్ని కుట్లు వెనుకకి కుట్టుకోవాలి.
అన్ని కుట్లు ఒకే పొడవు ఉంటే బాగుంటాయి. లేదా ఒక పద్దతిగా పొడుగు పోటి తో డిజైన్ కుట్ట వచ్చు.
ఈ కుట్టు outline లాగా వాడుకోవచ్చు. Cross Stitch, Assisi Embroidery, Black Work లలో వాడతారు.
Subscribe to:
Posts (Atom)


ELS.jpg)
ELS.jpg)
ELS.jpg)
ES.jpg)
ES.jpg)

ELS.jpg)
-ELS.jpg)
ES.jpg)




ES.jpg)
ES.jpg)
ES.jpg)
ELS.jpg)
ELS.jpg)
ELS.jpg)
ES.jpg)