టేబుల్ క్లాత్, కుషన్ కవర్స్ , దివాన్ సెట్- ఇలాంటి వాటిపైన అందంగా కనిపించడానికి ఫాబ్రిక్ పెయింటింగ్ వెసుకొవచ్చు. ఎంబ్రాయిడరీ కంటే తక్కువ సమయం పడుతుంది. మనకు వీలుగా చిన్న లేదా పెద్ద డిజైన్లు ఎంపిక చెసుకొవచ్చు.
ఇదిగో ఇది ఎప్పుడో చాలా కాలం కిందట నేను వేసిన డిజైన్. టేబుల్ క్లాత్ పైన వేసాను. దివాన్ సెట్, కుషన్ కవర్స్, టేబుల్ క్లాత్- వీటన్నిటి పైన సముద్రంలోని అండర్ వాటర్ సీన్. అందుకే సీ గ్రీన్ కలర్ క్లాత్ ఎంచుకున్నాను. అది కాటన్ కేసమేంట్ క్లాత్. చాలా మందంగా ఉండటం వలన పెయింట్ వేయటానికి చాలా ఇబ్బంది పడ్డా. కాని చాలా ఏళ్ళు మన్నింది. ఎన్నో సార్లు ఉతికినా చెక్కు చెదరలేదు. కాని కొంత రంగు తగ్గింది. క్లాత్ కూడా వెలిసిపోయింది.
ఇది గోల్డ్ ఫిష్
ఇలా నాలుగు చివర్లలో చేపలను వేసి, మధ్యలో గోల్డ్ ఫిష్ వేసాను.
చాలా పాతది కాబ్బట్టి పెయింటింగ్ కొంత రంగు తగ్గింది. క్లాత్ కూడా వెలిసింది. కాబ్బట్టి కొత్తల్లో ఉన్నంత బ్రైట్ గా లేదు.
మీరు వేసి చూడండి. వేసినవి ఉంటే మీరు మన సఖులందరితో పంచుకోండి. సఖులందరమూ ఎంతో కొంత ప్రేరణ పొందుతాము.
మీ...అనామిక....
No comments:
Post a Comment