Tuesday 31 July 2018

Celebrate Card

ఇవాళ నేను పోస్ట్ చేసే కార్డు ఇది:



ఈ  కార్డు కోసం నేను వాడినవి:

  • లేత గులాబీ రంగు Textured  Card  Stock  A 4 సైజ్ 
  • 3D  స్టిక్కర్లు 
  • నీలం రంగు ప్రింటెడ్ టేప్ 
  • రైన్ బో రంగు గల గ్లిట్టర్ టేప్ 
  • మల్టీ కలర్డ్  థ్రెడ్ (ట్వైన్ )
  • నీలం రంగు, లేత గులాబీ రంగు  క్రాఫ్ట్ పేపర్ చిన్న ముక్కలు 
  • జిగురు , dimensional  టేప్ 
  • Celebrate  స్టాంప్ , నల్ల ఇంకు

మీకు ఈ  కార్డు నచ్చిందా ? మీ కామెంట్స్ తెలియచేయండి ... 


మీ...అనామిక....

ఆణిముత్యాలు -516

ఆణిముత్యాలు-516 


మీ...అనామిక....

Saturday 28 July 2018

కార్టూన్ బొమ్మల గ్రీటింగ్ కార్డ్స్

ఈ  టపాలో నేను పోస్ట్ చేసిన కార్డు కార్టూన్ బొమ్మలతో బర్త్ డే కార్డు . ఇలాంటి కార్డులు చిన్న పిల్లలకి బాగా నచ్చుతాయి . 

గ్రీటింగ్ కార్డ్స్

ఈ  కార్డు కోసం నేను వాడినవి :

  • లేత గులాబీ రంగు Textured Card
  • బ్లు రంగు గ్లిట్టర్ టేప్ 
  • కార్టూన్ బొమ్మలు ఉన్న 3D  స్టిక్కర్ మార్కెట్ లో దొరుకుతాయి 
  • బర్త్ డే  విషెస్ తెలిపే స్టాంప్ 
  • ఇంకు  బ్లు, రైన్ బౌ  రంగులలో 
  • క్రిస్టల్-పూసల టేప్ 

ఈ  కార్డును చాలా సులువుగా చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? 
మరికొన్ని వచ్ఛే టపాలలో.. 

మీ...అనామిక....

ఆణిముత్యాలు -513

ఆణిముత్యాలు-513 

మీ...అనామిక....

Thursday 19 July 2018

Good Luck Card

ఈ టపా  లో ఒక Good Luck Card పోస్ట్ చేస్తున్నాను.


ఇది చాలా సులభంగా చేసుకోవచ్చును.

  • పింక్ అండ్ బ్లాక్ మార్బుల్ డిజైన్ ఉన్న మెరిసే (metallic) A 4 సైజు కార్డును సగానికి మడిచి బేస్ గా తీసుకున్నాను. 
  • దీనికి సిల్వర్ పై బ్లాక్ ఆనిమల్ ప్రింట్ (జీబ్రా చారలు) ఉన్న టేపు ను  ఎంచుకున్నాను. 
  • అలాగే సిల్వర్, బ్లాక్  క్రాఫ్ట్ పేపర్ నుండి సీతాకోక చిలుకలు పంచ్ చేసి పెట్టుకున్నాను. 
  • ప్రింటెడ్ టేపును పై విధంగా కార్డు పైన అంటించి, సీతాకోకచిలుకలు కూడా అంటించాను. 
  • తరువాత ఒక చిన్న తెలుపు క్రాఫ్ట్ పేపర్ పై గుడ్ లక్ స్టాంపును వేసి, చివర సగం సీతాకోకచికలు  మాత్రం వచ్చేటట్లు  పంచ్ చేసి, అంటిచాను. 
  • దానికి పైన, క్రింద ప్రింటెడ్ టేపును అంటించాను. 
  • ఇలా నా కార్డు చాలా సులభంగా తయారు అయింది. 
మీకు నచ్చిందనుకుంటాను ... 

వచ్చే టపాలలో మరికొ న్ని ... 



మీ...అనామిక....

ఆణిముత్యాలు -509

ఆణిముత్యాలు-509 

మీ...అనామిక....

Tuesday 17 July 2018

బర్త్ డే కార్డు

ఈ  టపాలో నేను పోస్ట్ చేసే కార్డు ఇది:


ఇది చాలా సులభంగా చేసిన కార్డు.

  • ముందుగా పింక్  అండ్ బ్లాక్  మార్బుల్ డిజైన్ ఉన్న మెటాలిక్ కార్డ్  స్టాక్  A 4 సైజు తీసుకుని, సగానికి ఒక ఇంచ్ తక్కువగా మడిచాను. అంటే పైన ఒక ఇంచ్ తక్కువగా, కింద ఒక ఇంచ్ ఎక్కువగా ఉంటుంది. 
  • తరువాత నల్లని ప్రింటెడ్ టేప్ ను పై వైపున , క్రింద ఎక్కువగా ఉన్న చోట అంటించాను. ఫోటో చుస్తే అర్ధమౌతుంది. 
  • ఒక నలుపు కార్డు స్టాక్ ను పైన చూపిన విధంగా కత్తిరించి అంటించాను. దాని పైన బొకే, సీతాకోక చిలుక స్టిక్కర్లు అంటించాను. నాలుగు కోణాలలో మెరిసే క్రిస్టల్స్ అంటించాను. 
  • అలాగే బర్త్ డే, మెసేజ్ స్టిక్కర్లను కూడా పైన చెప్పిన విధంగా అంటించాను. 
ఇలా ఈ  కార్డు తయారు అయింది. మీకు ఈ  కార్డు నచ్చిందనుకుంటాను. 

మీ కామెంట్స్, సలహాలు, సూచనలను నాకు ఈమెయిల్  చేయండి. 

మరిన్ని రాబోయే టపాలలో ... చూస్తూ ఉండండి నా బ్లాగ్ ...

మీ...అనామిక....

ఆణిముత్యాలు -507

ఆణిముత్యాలు-507 

మీ...అనామిక....