ఈ టపాలో నేను పోస్ట్ చేసే కార్డు ఇది:
ఇది చాలా సులభంగా చేసిన కార్డు.
మరిన్ని రాబోయే టపాలలో ... చూస్తూ ఉండండి నా బ్లాగ్ ...
మీ...అనామిక....
ఇది చాలా సులభంగా చేసిన కార్డు.
- ముందుగా పింక్ అండ్ బ్లాక్ మార్బుల్ డిజైన్ ఉన్న మెటాలిక్ కార్డ్ స్టాక్ A 4 సైజు తీసుకుని, సగానికి ఒక ఇంచ్ తక్కువగా మడిచాను. అంటే పైన ఒక ఇంచ్ తక్కువగా, కింద ఒక ఇంచ్ ఎక్కువగా ఉంటుంది.
- తరువాత నల్లని ప్రింటెడ్ టేప్ ను పై వైపున , క్రింద ఎక్కువగా ఉన్న చోట అంటించాను. ఫోటో చుస్తే అర్ధమౌతుంది.
- ఒక నలుపు కార్డు స్టాక్ ను పైన చూపిన విధంగా కత్తిరించి అంటించాను. దాని పైన బొకే, సీతాకోక చిలుక స్టిక్కర్లు అంటించాను. నాలుగు కోణాలలో మెరిసే క్రిస్టల్స్ అంటించాను.
- అలాగే బర్త్ డే, మెసేజ్ స్టిక్కర్లను కూడా పైన చెప్పిన విధంగా అంటించాను.
ఇలా ఈ కార్డు తయారు అయింది. మీకు ఈ కార్డు నచ్చిందనుకుంటాను.
మీ కామెంట్స్, సలహాలు, సూచనలను నాకు ఈమెయిల్ చేయండి.
మీ...అనామిక....
No comments:
Post a Comment