రామాదాస కృత సుప్రసిద్ధ మంగళహారతి
ఈ కృతిని ఇక్కడ వినవచ్చును.
ఈ కృతి తెలియని వారు తెలుగునాట ఉండరేమో. మా ఇంట్లో మా చిన్నపుడు మా అమ్మమ్మ గారు పని చేసుకుంటో ఇలా రామదాస కీర్తనలు, త్యాగరాజ కృతులు, భజనలు, సాంప్రదాయ కీర్తనలు-భజనలు ఇలా ఎన్నో పాడుకుంటో ఉండేవారు. పనికి పని, భక్తికి భక్తీ. మాకూ అదే అలవాటు. ఇంకా వేరే పూజలు చేసినా, చేయకపోయినా ఇబ్బంది లేదు అనిపిస్తుంది. దైవస్మరణ ఎల్లప్పుడూ చేసుకోవటానికి ఇది ఒక మంచి మార్గం కాదా?
ఇలా పాడుకుంటో ఉంటే మనసుకి హాయిగా ఉంటుంది.
ఈ శీర్షికలో నాకు తెలిసినవి కొన్ని మీతో పంచుకుంటాను. మీకు నచ్చుతుందని ఆశిస్తో ....
No comments:
Post a Comment