Sunday, 15 December 2013

రంగవల్లి -171


రేపటి నుండి ధనుర్మాసం మొదలు. మరి మన వాకిళ్ళు శుభ్ర పరచి, అలికి, చక్కని ముగ్గులు వేయాలి. అదికూడా సూర్యుడు ఉదయించ కుండా సుమా. అప్పుడే ఆ స్వామీ, ఆ విష్ణు మూర్తి, ఆ గోపాల కృష్ణుడు మన  ఇంటికి వచ్చి మనని  చల్లగా చూస్తాడని, సుఖ-శాంతులు, భోగ-భాగ్యాలు, ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలకు కొదవ ఉండదని మన పెద్దలు చెపుతారు. మరి నేను నా రంగవల్లులతో రెడి. మీరు? 

ఇదిగోండి మొదటిది ... 

21, 19, 17, 15, 15, 11, 9, 9, 5, 3, 1-సరి చుక్కలు. 

ఇది చాలా సులభంగా వెసుకొవచ్చు. నేను రోజు ఒక రంగవల్లి పోస్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. 

మరి రోజు నా టపాలు  చూస్తూ ఉండండి .... ఎన్నో ఎనెన్నో అందమైన రంగవల్లులు .... 

మీ సూచనలు, సలహాలు, కామెంట్స్ నాకు టానిక్ లా పని చేస్తాయి  :) మరిన్ని రంగవల్లులు గీయటానికి  ఉత్సాహాన్ని ఇస్తాయి. మరి తప్పక కామెంట్ చేయండి .... 

ముగ్గు వేసేటప్పుడు భగవంతుని స్మరణ తప్పక చేయండి- శ్రీ రామ అనో గోవింద అనో ఇంకేదైనా సరే మీ ఇష్టం. 


మీ...అనామిక....

No comments: