పుస్తకాలు మన నేస్తాలు. నాకు చిన్నప్పటి నుండి పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. అసలు ఒక్క పేజీ అయిన చదువని రోజు ఉండదు. ఇలా నేను ఎన్నో పుస్తకాలు చదివాను. హిందీ, ఇంగ్లీష్, తెలుగు- ఈ మూడు భాషలలో మంచి మంచి పుస్తకాలు చదవడమంటే నాకు ఇష్టం. రక రకాలైన విషయాల పై చదువుతాను.
కొన్ని పుస్తకాలను చదివి అందులోని విషయాన్ని మర్చిపోతాము, కొన్ని చదివి గుర్తు పెట్టుకుంటాం, కొన్ని మాత్రం ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు - అలాంటివి కొని జాగ్రత్త చేసుకుంటాం.
అలంటి పుస్తకం ఇది. ఎవరు ఇస్తే చదివాను. నాకు చాల నచ్చింది. కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం గారు రచించిన విధి విన్యాసం. ఇది ఒక మహా తపస్వి అద్భుత గాథ. నిజంగా అంత బాగుంది. చదువుతూ ఉంటే అసలు పుస్తకం కింద పెట్టాలనిపించదు. తరువాత ఏమిటి అని, ఆ కాలంలో ఉన్న దేశ కాల పరిస్తితుల వర్ణన మనని కట్టి పడేస్తుంది. ఆ తపస్వికి కృష్ణ పరమాత్ముడు, నారదుడు వంటి మహాను భావులు సక్షాత్కరించటం వంటి ఘటనలు మనని మరల మరల చదివిస్తాయి.
ఈ పుస్తకం కొనుకుందాం అనుకుంటే ఆ ప్రతులు నాకు దొరక లేదు. చాలా ప్రయత్నం చేసాను. దయ చేసి మీకు ఇవి ఎక్కడ దొరుకుతాయో తెలిస్తే నాకు మెయిల్ చేయ గలరు.
ప్రతులకు ఈ అడ్రెస్స్ ఇచ్చారు. కాని ఫోన్ నంబరు ఇవ్వలేదు.
మికెవరికైనా తెలిస్తే దయ చేసి నాకు వివరాలు మెయిల్ చేయండి. ఆంగ్ల మూలం కూడా తెలిస్తే నాకు తెలుపగలరు.
మీ...అనామిక....
No comments:
Post a Comment