ముద్ద పప్పు, పెరుగన్నం, లేదా మజ్జిగ పులుసు, మెంతి మజ్జిగ ఇలా ఏదైనా అన్నం తో తినవలసి వస్తే, కొద్దిగా కారంగా ఏదైనా పక్కన ఉంటె బాగుంటుంది అని అనుకుంటాం.ఇదిగో,వాము మరియు ఆవ మిరపకాయలు బాగుంటాయి. చేసి చూడండి.
ముందుగా :
- మిరపకాయలు పచ్చివి, ఆకుపచ్చగా ఉండి, వెడల్పుగా, పొట్టిగా ఉంటే బాగుంటుంది. మరి కారం ఉన్నవి వద్దు. మీరు తినగలిగితే సరే.
- తాజాగా ఉన్నవి, తొడిమెలతో ఉన్నవి తీసుకోండి.
- నీళ్ళల్లో బాగా కడిగి, తడి లేకుండా బట్టతో తుడిచి కొంచెం సేపు ఇంట్లో ఆరబెట్టండి . తడి ఉంటే నిలువ ఉండవు.
- నిలువుగా చీరి అంటే గాటు పెట్టి లోపలి గింజలను అవసరం అనుకుంటే తీసివేయండి.
1. వాము మిరపకాయలు
వాము
కావాలసినవి:
పచ్చి మిరపకాయలు 100 గ్రా
వాము 50 గ్రా
పప్పు నునె 50 గ్రా
పసుపు 1/2 టీ స్పూన్
ఉప్పు తగినంత
నిమ్మకాయ 1
చేసే విధానం :
- వాము ని పొడి చేసుకోండి
- వాము, ఉప్పు, పసుపు బాగా కలపండి
- నిమ్మరసం తీసి ఈ పొదిలో వేసి కలపండి
- పచ్చి మిరపకాయలను నిలువుగా చీరి(గాటు పెట్టి) ఈ పొడిని కూరండి.
- ఒక గాజు సీసాలో మిరప కాయలను పెట్టి పై నుండి నునె పోయండి. బాగా కుదపండి. నునె అన్ని కాయలకు పట్టేలాగా అన్న మాట.
- 2-3 గంటలు ఉరిన తరువాత తినవచ్చు.
- వారం పాటు ఉంటాయి. కాని నిమ్మ రసం వాడాము కనుక ఫ్రిజ్ లో పెట్టుకోండి.
పైన చెప్పినట్లుగానే చేయాలి. వాము బదులు 50 గ్రా ఆవ పొడి వాడండి.
మీ...అనామిక....
No comments:
Post a Comment