పచ్చి మిరపకాయలు మనం వారానికి ఒక సారి కొని తెచ్చుకుంటాం. అవి ఎక్కువగా నిలువ ఉండవు. నిలువ ఉండాలంటే ఇలా చేయండి:
- కోనే టప్పుడు తాజాగా ఉన్నవి తీసు కోండి. వడిలి పోయి, కుళ్ళి పోయి ఉండకూడదు.
- ఇంటికి వచ్చిన తరువాత , వాటిని నీళ్ళలో బాగా కడిగి, ఒక పలుచని నూలు వస్త్రం పైన ఆరబెట్టండి.
- వడిలినవి/ కుళ్ళినవి ఏరి వేయండి.
- తరువాత తొడిమలు తీసి, ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసి గట్టిగా ముత పెట్టి ఫ్రిజ్ లో పెట్టండి.
- వరం పది రోజుల దాకా ఉంటాయి.
కొన్ని సార్లు పచ్చి మిరపకాయలు పండి నట్లు లేదా వడలినట్లు అవుతాయి. మనం పారేస్తాం. అలా కాక ఎండలో పెట్టి బాగా ఎండే దాకా ఉంచండి. దీనిని పొడి చేసి, కూరల్లో వాడుకోవచ్చును.
మీ...అనామిక....
No comments:
Post a Comment