వంటింటి ఆయుధాలు
ఆడవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా మన ధ్యాస ఇల్లు, ఇంట్లో సామాను, పిల్లలు వాళ్ళకి కావలసినవి వీటి మీదనే. మనం ఎంత చదువుకున్నా ఉద్యోగాలు చేస్తున్నా ఇల్లు చక్క దిద్దుకోవటం మానం. నాకు ఇదే మన భారతీయా సంప్రదాయం లో నచ్చేది. ఇల్లు, పిల్లలు, ఇంట్లోని వారు ఆనందంగా ఉంటే గృహమేగా స్వర్గ సీమ అని పిస్తుంది.

మరి గృహాన్ని స్వర్గ సీమ చేసు కోవాలి అనుకుంటే, కొన్ని చిట్కాలు పాటించాలి, కొన్ని వస్తువులు, వసతులు సమకూర్చు కోవాలి. ఎక్కువ ఖర్చు కాదు, మన సమయం ఆదా, శ్రమ కూడా తగ్గించు కోవచ్చు.
ఇది చూడండి. చిన్న scraper-peeler. ఎందుకు లేండి ఇది ఖర్చు దండగ. మన ఇళ్ళలోఇలాంటివి పెద్దవి ఉంటే అనుకుంటున్నారా?
అల్లం వెల్లుల్లి గబుక్కున కోరాలంటే, ఇది చక్కగా ఒక చేత్తో పట్టుకుని, రెండో చేత్తో సరా సరి వంట చేసే పాత్ర లోకి కోరు కోవచ్చు. అలాగే కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయలు ఇలా ఎవైన కొద్దిగా కోరుకోవాలంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. చేతికి అందేటట్టు పొయ్యికి దగ్గెరగా తగిలించి పెట్టు కుంటే చాల పనికొస్తుంది.
టీ చేసున్నప్ప్పుడు కొద్దిగా అల్లం మరిగే నీళ్ళలోకి చెక్కు తీసి కోరుకోవచ్చు.
అలాగే పీలరు కూడా చక్కగా పనికొస్తుంది. బరువు తక్కువ, కడుక్కోవటం తేలికే.
పెద్ద ఖరీదు లేదు. మరి మీరు వాడి చూడండి.
పెద్ద ఖరీదు లేదు. మరి మీరు వాడి చూడండి.
మీ...అనామిక....
No comments:
Post a Comment