ఎప్పుడైనా పొరపాటున చెయ్యి జారి కోడి గుడ్డు పగిలి నెల పైన కానీ లేదా బల్ల మిద కాని వంట గట్టు మీద కానీ అందులోని దంతా పరుచుకున్నప్పుడు చాల చికాకు వేస్తుంది. మాములుగా ఏ గుడ్డతోనో తీయాలంటే కష్టం. చేయంతా, ఇల్లంతా అవుతుంది. వాసన వేస్తుంది. నీళ్ళు పెట్టి కడగాలి. ఇదంతా చాల శ్రమతో కూడుకున్నది.
కాని ఒక చిన్న చిట్కాతో చాలా సులభంగా శుబ్రం చెయ్య వచ్చు.
ఒక గుప్పెడు ఉప్పు (టేబుల్ సాల్ట్ ) లేదా సరిపోయేంత ఆ వొలికిన దాని పైన పూర్తిగా చల్లండి. కొద్ది నిముషాల తరువాత అది గట్టి పడుతుంది. అప్పుడు టిష్యు పేపర్తో కాని, గుడ్డతో కాని ఎత్తి వేయండి. చాల సులభంగా వస్తుంది. తరువాత ఆ భాగాన్ని తడి గుడ్డ పై కొన్ని చుక్కలు వినెగర్ (vinegar) వేసి తుడిచి వేయండి.
ఎలాంటి ఇబ్బంది శ్రమ లేదు మరి.
మీ...అనామిక....
No comments:
Post a Comment