Threaded Running Stitch
ముందుగా టాకా కుట్లు కుట్టి, వాటిలోనుండి దారాన్ని క్రింద చూపిన విధంగా తీయాలి:
రెండు దారాలు, ముదురు లేత రంగులు కాని లేదా కాంట్రాస్ట్ కాని అయితే బాగుంటుంది. అలాగే ఎక్కువ తక్కువ పోచలు కాని లేదా సన్నగా లావుగా ఉన్న దారాలతో కుట్ట వచ్చు. ఇలాంటి కొన్ని వరుసలు దగ్గరగా, దూరంగా, ఒకే రంగులో వివిధ చాయల దారాలను
దగ్గరగా వాడినా బాగుంటుంది. ఎక్కువగా కుట్ట వలసిన భాగాని తొందరగా నింపవచ్చు.
ఈ కుట్టు బార్డర్ గా కాని లేదా అవుట్ లైన్ గా కాని వడ వచ్చు. దిండు గలేబులు, కుషన్ కవర్స్, టేబుల్ క్లాత్, టేబుల్ క్లాత్ వంటి వాటికే కాక, పిల్లల పరికిణీలు వంటి వాటికి వాడ వచ్చును. చీరలకి, చున్నీలకి, కుర్తాలకి కూడా వాడ వచ్చు. చాలా సులభంగా తొందరగా కుట్టేయవచ్చు.
1 comment:
ఈ కుట్లు చాలా బాగున్నాయి. సులభంగా కుట్టవచ్చు, ఎక్కువ సమయం పట్టదు.
Post a Comment