మన ఆంధ్ర రాష్ట్రం పచ్చళ్ళకి పెట్టింది పేరు. మన దక్షినాది వాళ్ళు చేసే పచ్చళ్ళు మరి ఉత్తరాదిన చేసేవి కొంచెం భిన్నంగా ఉంటాయి. మన పచ్చళ్ళు కారంగా ఉంటాయి. ఉత్తరాదివి తియ్యగా, పుల్లగా కొద్దిగా కారంగా ఉంటాయి.
ఇవి అన్నం, రొట్టెలు, చపాతీలు, పూరీలు, పరాఠాలు, ఇడ్లి, దోశ, సమోసా, చాట్ ఇలా ఎన్నో వాటితో తినవచ్చు.
రకరకాలైన పచ్చళ్ళు రకరకాలయిన పదార్ధలతొ చేసుకొవచ్చు. మన అమ్మలు, అమ్మమ్మలు బామ్మలు చేసెవే కాకుండా కొత్తవి ఎన్నొ రకాలు నేర్చుకుందాం.
పచ్చళ్ళు రెండు రకాలు:
1. రోజువారి పచ్చళ్ళు
2. నిల్వ పచ్చళ్ళు
1. రోజు వారి పచ్చళ్ళు : వీటిని హిందీలో చట్ని అంటారు. ఇదే పదం మనమంతా కూడా వాడతాము. ఈ పదం ఎంత ప్రాచుర్యం పొందిదంటే ఏకంగా ఆంగ్ల నిఘంటువులో కూడా చోటు సంపాదించుకుంది.
రోజువారీ పచ్చళ్ళ ని రోటి పచ్చళ్ళు, బండ పచ్చళ్ళు అని కూడా అంటారు. ఇవి ఒకటి లేక రెండు రోజులకంటే ఉండవు, ఫ్రిజ్జ్ లో పెడితే తప్ప. కొన్ని మాత్రం నూనె ఎక్కువ వేసి చేస్తే ఒక వారం ఉండవచ్చు.
అయితే ఈ రోజువారి పచ్చళ్ళకి తాజా కూరలు, పళ్ళు మొII వాడతాం. నూనె ఉప్పు కూడా తక్కువగా వాడతాం. ఈ పచ్చళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం నోటికి రుచి కూడాను.
నేనైతే ఇప్పటికీ చాల మటుకు రోలు-రోకలి వాడతాను. మిక్సి లో చేస్తే అంత రుచి ఉండదు. కాకపోతే మనం హడావిడిగా ఏ ఉదయం పూటో చేయాలంటే వేరే మార్గం లేదు.
2. నిల్వ పచ్చళ్ళు: వీటిని ఉరగాయాలని అంటాం. ఆంధ్ర ఉరగాయలు చాల ప్రసిద్ది. అయితే ఉత్తరాదివి కొన్నివెరైటిగా రుచిగా నోటికి చాలా బాగుంటాయి.
మనం అన్ని రకాల పచ్చళ్ళు, అన్ని ప్రాంతాలవి చెప్పుకుందాం.
పచ్చడి అయిన ఉరగాయలైన వాడె దినుసులన్నీ తాజాగా, నాణ్యమైనవి అయితే, రుచీ బాగుంటుంది.
మరి మీరు రెడినా? వచ్చే టపాలలో రుచికరమైన పచ్చళ్ళు సుళువుగా చేసే విధానం తెలుసుకుందాం....

మీ...అనామిక....
No comments:
Post a Comment