Wednesday, 26 October 2011

డిజైనర్ దీపాలు

దీపావళి వచ్చిందంటే సందడే సందడి,  ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకుని అందంగా తీర్చి దిద్దుకుంటాం. అన్నిటి  కంటే ముఖ్యం రాత్రి వేళ దీపలతొ ఇంటిని, ఇంటి బయట అలకరించటం. 

ఎంత గొప్పవారైన వెండి, బంగారం ఇత్తడి కుందులు పెట్టినా తప్పని సరిగా మట్టి తో చేసిన ప్రమిదెలు పెట్టవలసిందే. ఇప్పుడు అందారు మోజు పది కొనుక్కునేవి అలకరించిన డిజైనర్ ప్రమిదెలు. రంగులతో, చెమ్కీలతొ అలంకరించి అంతో ఆకర్షనీయంగా తయారు చేస్తున్నారు. కాని కొనాలంటే బోలెడు ఖరీదు. అదే ఇంట్లో మనమే చేసుకుంటే, ఆదా కి ఆదా మనమే సొంతంగా చేసుకున్నామని ఒక తృప్తి  కూడా.

మరి ఇంకెందుకు ఆలస్యం. నాతో కలసి మిఇరు చేయండి.

కావలసినవి:

మట్టి ప్రమిదెలు
రంగులు 
కుంచెలు

మట్టి ప్రమిదెలు (టెర్రకోట)అనేక రకాలైన ఆకారాలు, సైజులు మరియు డిజైన్లలో దొరుకుతున్నాయి. ధర కూడా మన బడ్జెటు ని బట్టి పెట్టవచ్చు.

రంగులు-ఎనామిల్ కాని, లేదా వాస్త్రాల పై వాడే ఫ్యాబ్రిక్ (Acrylic) రంగులు  కానీ  వాడవచ్చు. నాకు, ఎనామిల్ కంటే Acrylic అంటేనే ఇష్టం. ఏనామేల్ లో రంగులు(షేడ్స్) చాల తక్కువ. Acrylic రంగులు  చాల  హాయి.  మాములు సాదా రంగులలో అనేక షేడ్స్ కాక, మెటాలిక్, పెరల్ లో కూడా చాల షేడ్స్ ఉన్నాయి. కేవలం నీళ్లు కలిపి వాడు కోవచ్చు.

ముందుగా ప్రమిదెలను ఒక టబ్ లో పేర్చి బాగా ఫై దాక నీళ్లు పోసి, ఒక రాత్రి నాన నివ్వాలి. తరువాత మరుసటి రోజు  తీసి ఒక గంట బోర్లించి, ఒక గంట మామూలుగాను ఆరనివ్వాలి.

తరువాత మీకు నచ్చిన విధంగా రంగులతో అలంకరించండి. రంగు తడిగా ఉండగానే, గ్లిటర్ పొడి; ఇవి, బంగారం, వెండి, ఇత్తడి, వంటి మెటాలిక్ రంగులే  కాక  మామూలు రంగులలో కూడా దొరకుతాయి. ఇవి   చల్లుకోవచ్చు. 3D కోన్స్ తో చుక్కలు, గీతలు, లతలతో అలంకరించ్చ వచ్చు.  చాల సులభం. కొద్దిగా అలవాటు పడితే త్వరగా తయారు చేసుకోవచ్చు.

ఇదిగో చుడండి నేను చేస్తున్నవి కొన్ని:









వీటికి  ఇంకా  ఫైనల్  టచెస్ ఇవాలి. అయిన మీతో పంచుకోకుండా ఉండలేకపోయాను. 


మీరు చేసి చూడండి. కార్తిక మాసం అంతా దీపాలు వెలిగించాలిగా ....

మీ...అనామిక....

2 comments:

Chinni said...

అనామిక గారు, బాగుందండీ మీ బ్లాగు విభిన్న అంశాలతో.

అనామిక... said...

Thanks andi