Wednesday, 14 September 2011

చెప్పుకోండి చూద్దాం


మా పెరట్లో ఈ పూల తీగ ఉంది. దీనికి గుత్తులు గుత్తులుగా తెల్లని పూలు పూస్తాయి. ఇవి మంచి వాసనా కలిగి ఉంటాయి. నేను కొన్నప్పుడు ఆ నర్సరీ వాళ్ళు దీని పేరు  "నాగమల్లి " అని చెప్పారు. కానీ నాగమల్లి అంటే "శివలింగ" పుష్పమని నా స్నేహితురాలు అంటోంది. మీకు తెలిస్తే ఇది ఏ తీగో, ఈ పూలను ఏమంటారో దయచేసి చెప్పగలరు.




నేను అంతర్జాలంలో వెతికాను కానీ ఫలితం లేక పోయింది. మీకేమైనా తెలుసోనని  అడుగుత్తున్నా


మీ...అనామిక....

4 comments:

ప్రియ said...

ఇవి పూవెలగ పూలు (పూత వెలగ )
వర్షం పడినపుడు పూస్తాయ్ ..చక్కని సువాసన కలిగి ఉంటాయి

అనామిక... said...

Priya gaaru Thanks. Ippatiki mi valana telusukogaligaanu

Anonymous said...

పూత వెలగ, నాగమల్లి, నాగలింగం(శివలింగం) మూడూ వేరు వేరే. మీ ఇంట్లోది పూత వెలగ. నాగమల్లి కొంచెం గోవర్థనం లేదా నంది వర్థనం లా తెల్లగా ఉండి మంచి సువాసన ఉంటుంది నాగలింగం ఎర్రగా ఉండి గొడుగులా పడగ పండుగ కింద శివలింగాకృతి కలిగి పసుపు పుప్పొడి మందారకాడకి ఉన్నట్లు ఉంటుంది

అనామిక... said...

Thanks andi. Vipulanga chepparu.