Monday 3 August 2015

శుభలేఖలతో బుక్ మార్క్ ...1

మనని పెళ్లి కని పిలుస్తో ఎన్నో శుభలేఖలు  వస్తాయి. అలాగే ఇతర శుభకార్యాలకి కూడా ఈ మధ్యన పత్రికలు చాలా  గ్రాండ్ గా అచ్చు వేయించి ఇస్తున్నారు. ఇవి చాలా పోగవుతాయి. 

వీటిని ఉప గించి నేను కొన్ని బుక్ మార్క్స్ తయారు చేశాను. ఇదిగో అందులో ఒకటి ఇక్కడ మీకోసం. 

ఇది శుభలేఖ పైన కవరు. ఇందులో నేను పైన భాగం ( మూత  లాగా ఉన్నది) కత్తిరించి క్రిందిది మాత్రం తీసుకున్నాను. 
ఇదిగో ఇలా దానికి ముందు భాగం గోల్డ్ ప్రింట్ ఉన్నది. వెనక సాదాగా ఉన్నది. మడత కూడా ఉన్నది (కవరు కదా). ఈ రెండు బాగాలను అలాగే లోపలిభాగం అతికించాను. బాగా ఆరిన తరువాత పంచర్ తో చిల్లు పొడిచి ఒక చక్కని త్రాడు ఎక్కించి చివరన జారి పోకుండా ముడి వేశాను. 
ఇదిగో బుక్ మార్క్ రెడి. ఇప్పుడు మీరు దీనిని పుస్తకం లో చదివే పేజీని గుర్తు పెట్టుకోవటానికి వాడ వచ్చు.  ఎవరికైనా గిఫ్ట్ చేయచ్చు, పిల్లలు కూడా దీనిని చాలా సులభంగా చేసేస్తారు. 
మరి ఆలస్యం దేనికి? మీరు చేసి చూడండి. 
మరి కొన్ని వచ్చే టపాలలో . ..... 


మీ...అనామిక....

No comments: