Saturday 16 November 2013

అమ్మమ్మ చిట్కాలు - 10


షాంపు  తో  - 2 

షాంపు తో ఎన్నో ఉపయోగాలో.  ఇవి చూడండి :

  • టబ్  స్నానం చేసే వారు షాంపును బాత్ సాల్ట్ , బబుల్ బాత్ బదులు వాడ వచ్చును. 
  • బ్యాండ్ ఎయిడ్ పట్టి అతుక్కుని తీయటం కష్టం అయినప్పుడు కాటన్ బడ్ తో కొంచం షాంపు  ను పట్టిపైన అద్ది, కొంచం సేపు వదిలి వేయండి. షాంపు  లోనికి వెళ్లి జిగురును కరిగిస్తుంది. ఇప్పుడు నొప్పి లేకుండా పట్టీని సులభంగా తీయవచ్చును. 
  • జిప్ తీయటానికి కష్టం అయినప్పుడు, ఒక కాటన్ బడ్ షాంపూలో ముంచి కొద్ది కొద్దిగా జిప్ అంతా పూయండి. తరువాత జిప్ లాగితే సులభంగా వస్తుంది. 
  • షేవింగ్ క్రీం బదులు షాంపు  వాడవచ్చును. ఇది చర్మానికి హాని కలిగించదు. సాఫ్ట్ లేదా బేబీ షాంపు  వాడితే మంచిది. 
  • పాదాలకి రాత్రి పడుకునే ముందు కొంచం బేబీ షాంపూ పట్టించి కాటన్ సాక్స్ తొడిగి పడుకోండి. పొద్దున్న లేవగానే కడిగి వేయండి.  మీ పాదాలు మృదువుగా ఉంటాయి. 
  • దుస్తుల పైన రక్తపు మరకలు కనక ఉంటె, అక్కడ కొంచం షాంపూ వేసి, తడి బట్టతో కప్పి ఒక అరగంట తరువాత కొంచం రుద్ది నీటితో కడిగి వేయండి. మరకలు మాయం. 
  • కాలరు పైన ఫుల్ హాండ్స్ చేతుల కఫ్స్ పైన, పైజమల కాళ్ళ  అంచుల పైన , లంగాల అంచుల పైన పడిన మట్టి/జిడ్డు మరకలు వదిలించటం కష్టం. ఆ ప్రదేశాలలో షాంపును పులిమి, కోక అరగంట నాన పెట్టి తరువాత కొద్దిగా బ్రష్ చేసి(లేదా చేతితో) రుద్ది మాములుగా డిటర్జెంట్ పెట్టి ఉతకండి. మరకలు మాయం. 
  • షాంపుని  మల్టీ పర్పస్ క్లీనర్ లా వాడ వచ్చును. ఇంట్లో నేల తుడవడానికి, టాయిలెట్ కడగడానికి, ఫర్నిచర్ వంటి చెక్క సామగ్రిని శుభ్ర పరచటానికి వాడ వచ్చు. 
  • షాంపులో కొద్దిగా వంట సోడా కలిపి మెటల్ ముఖ్యంగా క్రోమ్ తో చేసిన వాటిని చక్కగ శుభ్ర పరచవచ్చును - అంటే క్రోమ్  తో చేసిన పంపులు  (వంటింట్లో / స్నానాల గదిలో) వంటివి. 
  • వంటింట్లో పొయ్యి, ఫ్రిజ్జ్ వంటివి శుభ్రం  చేయ వచ్చు. 
  • జిడ్డు/మురికి పట్టిన దువ్వెనలు/బ్రష్ లను షాంపులో నీళ్ళు  కలిపి అందులో కొంచం సేపు నానబెట్టి, తరువాత  కడగండి. కొత్త వాటి లాగా మెరుస్తాయి. 
  • తివాసి పైన/రగ్గుల పైన ఏదైనా వొలికినా లేదా మరకలు పడినా,  కొద్దిగా షాంపు ఒక తడి గుడ్డ పై వేసి ఆ ప్రదేశాన్నికొద్ది కొద్దిగా తుడవండి (మరీ గట్టిగా రుద్దకండి, అటు ఇటు పులిమేయకండి-అలా చేస్తే ఆ మారక అంతా అంట వచ్చు). ఇలా మారక పోయినదాక చేయండి. 
  • పిల్లలు అల్లరి చేస్తుంటే, కొద్దిగా షాంపూను నీళ్ళలో కలిపి ఒక ప్లాస్టిక్ గ్లాసులో స్ట్రా వేసి ఇవ్వండి - బుడగలు ఊది ఆడుకుంటారు. 

మీకు కుడా ఈ చిట్కాలు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి. 

మరి మికేమైనా షాంపు తో ఉపయోగాలు ఇంకా తెలిస్తే నాకు మెయిల్ చేయండి లేదా కామెంట్స్ లో వ్రాయండి. అందరికి ఉపయోగ పడుతుంది. 


మీ...అనామిక....

No comments: