ఇప్పుడు టౌన్లో నూ ఎక్కువగా ఫ్లాట్స్ కల్చర్ వచ్చేసింది. నగరాల్లో ఫ్లాట్స్ లోనే ఉండటం. పెద్ద ఇల్లు అదీ, విడిగా ఇండిపెండంట్ ఇల్లు అంటే మాటలు కాదు. మరి అలాంటప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేయటానికి చోటు ఉండదు. సరే మరి పరుగులు పెడుతూ మనం అంత సమయం కూడా వెచ్చించ లేము.
అందుకని ఫ్లాట్స్ ఉన్న వారు ఇప్పుడు చిన్న ముగ్గులు ఇష్ట పడుతున్నారు. ఈ ముగ్గులు వేయటం తేలిక. ఇంట్లో కూడా పూజా మందిరం ముందరో, హాలు లోనో ఇలా నచ్చిన చోట వెసుకొవచ్చు. పండగలకి, ఇంట్లో శుభ కార్యాలకి ఎప్పుడైనా వెసుకొవచ్చును.
ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఈ ముగ్గులు అక్కడక్కడ పెట్టి రంగులు వేసి దీపాలు పెడితే ముచ్చటగా ఉంటాయి. ఇంట్లో పార్టీ ఉన్నా ఇలా చేయవచ్చు.
మీ...అనామిక....
No comments:
Post a Comment