Wednesday, 7 August 2013

అమ్మమ్మ చిట్కాలు -9

షాంపు తో-1

మొన్న ఒక రోజు మా పక్కింట్లో ఉన్న పంకజం గారి ఇంటికి వెళ్ళాను. తనూ, నేను చిన్ననాటి స్నేహితులం. నేను వెళ్లే సరికి పంకజం, తన మనమరాలు  లావణ్యతో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని మాట్లాడుతోంది. నన్ను చూడగానే పంకజం నవ్వుతూ అహ్వనించింది. నేను ఒక కుర్చీ లాక్కుని కూర్చున్నా. 

ఇంతలో పంకజం కోడలు లక్ష్మి వంటింట్లోంచి తొంగి చూసి "బాగ్గున్నారా అండీ?" అని ప్రేమగా పలకరించింది. "ఆ బాగున్నానమ్మా. ఏమిటి విశేషాలు?"అని అడిగా. " మీరు అత్తయ్య తో మాట్లాడుతూ ఉండండి కాఫీ తెస్తాను" అని   బదులు చెప్పి వంటింట్లోకి అదృశ్యం అయ్యింది. 

నేను పంకజం కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉండగానే కాఫీ తీసుకొచ్చి ఇచ్చి "ఇప్పుడే వస్తాను" అని వంటింట్లోకి వెళ్ళింది. అప్పుడు చూశాను పంకజం ముందర టేబుల్ పైన బోలెడు షాంపూ పేకట్లు ఉన్నాయి-అవేనండి, రూపాయికి, రెండు రూపాయలకి అమ్ముతారు చూశారా అవి. 

"ఏంటి ఇన్ని పేకట్లు?"  అని అడిగాను. లావణ్య అందుకుంది "అదికాదు అమ్మమ్మగారు మా స్టోర్ రూమ్ క్లీన్ చేస్తుంటే ఇవి దొరికాయి. సబ్బు, పేస్ట్ లేదా పవుడరు తోనో ఫ్రీగా వచ్చినవి. వీటిని ఏం  చేస్తాము చెప్పండి? పారేద్దామని నేను, ఇన్ని డబ్బులూ, వస్తువులు  వేష్ట్ చేయకూడదని మా బామ్మా వాదించుకుంటున్నాము". 

"అవునమ్మా, పారేయటం ఎందుకు? వీటిని రక రకాలుగా ఉపయోగించ వచ్చును" అన్నా నేను. అయితే చెప్పండి ఎలాగో అంది లావణ్య . మరి నేను చెప్పినవి ఏమిటో మీరు చూడండి: 

మంచివి, ఖరీదైనవి, బ్రాండెడ్, సాఫ్ట్ లేదా బేబీ షాంపు వంటివి ఎక్స్ పైరి  డేటు చూసి ఒక పక్కన పెట్టుకోండి. వాటిని ఇలా వాడచ్చు: 

 • ఇంట్లో ఎవైరనా వాడుకోండి. ఎప్పుడూ  వాడే  షాంపు ఎంత కడిగినా, వాడిన ప్రతీ సారీ మన జుట్టు పైన కొంచెం ఉండి  పోతుందట. అందువలన వేరే షాంపు  పెట్టి తలంటుకోవాలని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలా వాడుకోవచ్చు . 
 • మొగవాళ్ళకి తక్కువ జుట్టు ఉంటుంది కాబట్టి మంచి షాంపు  పేకట్లు వాళ్ళు వాడుకోవచ్చును. 
 • ఇంటికి వచ్చిన అథితులకు కూడా వాడుకోవడానికి ఇవ్వవచ్చు. 
 • మనం ప్రయాణాలు చేసేటప్పుడు వాటిని వెంట తీసుకు వెళ్ల వచ్చు. బరువు తక్కువ, ఒలుకుతుందన్న భయం ఉండదు. 
 • లిక్విడ్ సోప్ అంటే బాడీ వాష్ లాగా వాడ వచ్చును. 
 • కొద్దిగా (సాఫ్ట్ లేదా బేబీ)షాంపు లో, తగినంత చక్కిర (మరి గండ్రగా ఉండ కూడదు. సన్నగా ఉండాలి)/టేబుల్ సాల్ట్/సీ సాల్ట్/ బొంబాయి రవ్వ-ఏదో ఒకటి  వేసి, ముఖానికి, శరీరానికి స్క్రబర్ లాగా వాడవచ్చును. మరీ గట్టిగా కాకుండా సున్నితంగా రుద్దాలి. ఉప్పు మాత్రం మండుతుంది సుమా. 
 • పెడిక్యూర్/మేని క్యూర్ కి వాడుకోవచ్చును. ఇవి మురికి తొలగించటమే కాక చర్మాన్నిమృదువుగా చేస్తాయి. 
 • సాఫ్ట్ లేదా బేబీ షాంపూ ఫేస్ వాష్ లా వాడ వచ్చు. ముక్యంగా డ్రై చర్మం కలవారు. 
 • సాఫ్ట్ లేదా బేబీ షాంపూ మేకప్ తీసివేయటానికి వాడ  వచ్చు. 
 • సాఫ్ట్ లేదా బేబీ షాంపూ మేకప్ బ్రషులు వంటివి శుభ్రం చేయటానికి వాడ  వచ్చు. 
 • సాఫ్ట్ లేదా బేబీ షాంపూ పెట్స్ స్నానానికి వాడ  వచ్చు. 
 బ్రాండెడ్ కానివి, డేటు అయిపోయినవి ఇలా వాడుకోవచ్చును 
 • చేతులు కడగటానికి  హ్యాండ్ వాష్ లాగా ఉపయోగించు కోవచ్చు. 
 • చేతికి అంటిన నూనె, మరకలు, వంటివి చక్కగా కడిగి వేస్తాయి. 
 • పెయింట్ మరకలను, దుస్తుల పైనుండి కాని చేతుల నుండి కాని కడిగి వెయ వచ్చు. 
 • చేతి రుమాళ్ళు ఉతకవచ్చును.
 • లో దుస్తులు కూడా ఉతక వచ్చు. 
 • ఉన్ని దుస్తులు, షాల్స్  ఉతక వచ్చు. సాఫ్ట్ లేదా బేబీ షాంపూ అయితే మంచిది. 
 • పట్టు లేదా ఖరీదైన బట్టలు ఉతక వచ్చు. సాఫ్ట్ లేదా బేబీ షాంపూ అయితే మంచిది. 
 • సాక్సు, టైట్స్ వంటివి ఉతక వచ్చును. 
 • బాత్రూం లో సింక్, బాత్ టబ్, అద్దం వంటివి శుభ్ర పరచ వచ్చును 
 • బాత్రూం టైల్స్ కి పట్టిన జిడ్డు, మురికి షాంపుతో  బాగా వదుల్తాయి. 
 • అలాగే వంటింట్లోని, సింక్, గట్లు, నేల, టైల్స్ వంటివి శుభ్ర పరచవచ్చు. 
 • జుట్టుకి స్ప్రే వాడేవారు, ఆ స్ప్రే గోడల మిద  కాని, డ్రెస్సింగ్ టేబుల్ మిద కాని పడితే దానిని శుభ్రం చేయటానికి వాడ  వచ్చు. 

గమనిక: చుండ్రు ని అరికట్టే షాంపూ(పాదరసం లాంటి కెమికెల్స్ ఉండవచ్చు)  లేదా కండీషనర్ ఉన్న షాంపూ(ఇవి జిడ్డుగా ఉండవచ్చు) మాత్రం పైన చెప్పిన వాటిలోని కొన్నిటికి పనికి రావు. 

మరి కొన్ని తరువాతి టపాలలో ..... 


మీ...అనామిక....

No comments: